Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

లాక్ డౌన్ రివ్యూ : ‘వన్ డే’–జస్టిస్ (నెట్‌ఫ్లిక్స్)

$
0
0

నటీనటులు: అనుపమ్‌ ఖేర్‌, ఈషా గుప్తా తదితరులు

డైరెక్టర్ : అశోక్ నందా

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన సినిమా ‘వన్ డే’ : జస్టిస్. అశోక్ నందా దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

న్యాయమూర్తి త్యాగి (అనుపమ్‌ ఖేర్‌) తన పదవి నుంచి పదవీ విరమణ చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటాడు. అలాగే బతుకుతుంటాడు. కానీ అతని ప్రశాంతమైన జీవితం వెనుక, ఒక సమాంతర కోర్టును నడుపుతుంటాడు, పెద్ద నేరాలకు పాల్పడిన వారిని కిడ్నాప్ చేసి శిక్ష వేస్తుంటాడు. కానీ సాక్ష్యాలు లేనందున కోర్టు అతన్ని విడిచిపెడుతుంది. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం ఈ క్రేజీ కేసును హ్యాండిల్ చేయమని ఏసిపి లాస్మి రతి (ఈషా గుప్తా) నియమిస్తారు. ఆమె జడ్జి త్యాగిని ఎలా పట్టుకుంటుంది ?దాని కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది అనేదే మిగిలిన కథ.

 

ఏం బాగుంది :

ఈ చిత్రం యొక్క మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్లే కూడా చక్కగా రాసుకున్నారు. విచారణ కూడా చాలా ఆసక్తికరమైన గమనికతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మొదటి రెండు కిడ్నాప్‌ లను చాల బాగా చిత్రీకరించారు. అన్ని నేరాలకు పాల్పడిన రిటైర్డ్ జడ్జిగా అనుపమ్ ఖేర్ అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంలో ప్రదర్శించిన క్రైమ్ యాంగిల్ కూడా బాగుంది. ఈషా పోలీసుగా చక్కగా ఉంది, అలాగే ఇతర సహాయక తారాగణం కరెక్ట్ గా సరిపోయింది. ఇక రెండవ భాగంలో వచ్చే సీన్స్ మరియు భావోద్వేగ క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది.

 

ఏం బాగాలేదు :

చాలా ఆసక్తికరమైన నోట్లో సినిమాను ప్రారంభించిన తరువాత, పాత్రల యొక్క యాక్టివిటీస్ చాలా నెమ్మదిగా మరియు నిస్తేజంగా సాగాయి. విరామం భాగం కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో అసలు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చివరి అరగంట వరకు వేచి ఉండాలి. ఈషా గుప్తా యాస బాగాలేదు. మరియు ప్రేక్షకులకు అర్ధం కానీ విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అనేక లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి.

 

చివరి మాటగా :

మొత్తంమీద, ‘వన్ డే’ జస్టిస్ ఒక క్రైమ్ థ్రిల్లర్, మంచి కథాంశం కలిగి ఉన్నా.. అలసత్వమైన కథనం ద్వారా సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోదు. అయితే అనుపమ్ ఖేర్ తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా ఈ చిత్రంలోని కిడ్నాప్ సన్నివేశాలు బాగున్నాయి. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికీ మంచి ఛాయిస్ అవుతుంది.

123telugu.com Rating : 2.5/5


Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles