Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

లాక్ డౌన్ రివ్యూ : ‘భోంస్లే’ ( సోనీ లైవ్ లో ప్రసారం)

$
0
0

తారాగణం: మనోజ్ బాజ్‌పాయ్, సంతోష్ జువేకర్ తదితరులు

దర్శకుడు: దేవశీష్‌ మఖిజ

సంగీతం: మంగేష్ ధక్డే

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సినిమా ‘భోంస్లే’. దేవశీష్‌ మఖిజ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘సోనీ లైవ్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :

గణపత్ భోంస్లే (మనోజ్ బాజ్‌పాయ్) ఆరోగ్య సమస్యల కారణంగా పోలీసు శాఖ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేయవలసి వస్తుంది. ముంబై నగరంలోని ఒక ప్రాంతంలోని ఒక గదిలో అతను బోరింగ్ జీవితాన్ని గడుపుతున్నాడు. అటువంటి సమయంలో, బీహార్ నుండి సీత (ఇప్షితా చరబోర్తి) అనే అమ్మాయి మరియు ఆమె సోదరుడు గణపత్ పక్కనే ఉండటానికి వస్తారు. వారితో పరిచయం అవుతుంది. అతనితో సన్నిహితంగా ఉంటారు. విలాస్ ధావ్లే (సంతోష్ జువేకర్) అనే స్థానిక వ్యక్తి స్థానికంగా ఉద్యోగాల్లో ఒక విప్లవాన్ని ప్రారంభించి ముంబై వాసులకు మాత్రమే ఉద్యోగాలలో ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలనడటంతో.. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా సీతకు మరియు ఆమె సోదరుడు సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి గణపత్ భోంస్లే ఏమి చేస్తారు అనేది మిగతా మొత్తం కథ.

ఏం బాగుంది :

భోంస్లేగా మనోజ్ బాజ్‌పాయ్ వన్ మ్యాన్ షోతో అద్భుతంగా నటించాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న మనోజ్ బాజ్‌పాయ్ తన పాత్రలో జీవించి చిరస్మరణీయమైన నటనను కనబర్చాడు. మానవజాతి యొక్క వైవిధ్యాలలో చిక్కుకున్న 60 ఏళ్ల వ్యక్తిగా మరియు అతని రాష్ట్రంపై ప్రేమతో అతను నటించిన విధానం ఆకట్టుకుంటుంది. మనోజ్ బాడీ లాంగ్వేజ్ ఎమోషనల్ యాక్టింగ్, అలాగే అతను ఒక వృద్ధుడి యొక్క సూక్ష్మ భావోద్వేగాలను ఎక్స్ ప్రెస్ చేసిన విధానం అబ్బురపరుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం మనోజ్ బాజ్‌పాయ్ నటనా పరాక్రమానికి ఒక ఉదాహరణ.

ఇక నర్సుగా నటించిన ఇప్షితా చక్రబోర్తి కూడా చాల నటించింది. ముంబైలోని వాతావరణాన్ని అలాగే అక్కడి పరిస్థితులను దర్సకుడు బాగా చూపించారు. ఈ చిత్రంలో కెమెరామెన్ కెమెరావర్క్, విజువల్స్ ను చూపించిన విధానం అద్భుతమైనది. అలాగే ఆర్ట్ డైరెక్షన్ ప్రత్యేకమైంది. పైగా ఈ చిత్రానికి మంచి థీమ్ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే ఉంది.

ఏం బాగాలేదు :

చాలా మంది చూపించిన దానికి భిన్నంగా ఏదో ఆశించటం వల్ల సినిమా ముగింపు కాస్త నిరాశపరిచింది. ఈ చిత్రం యొక్క పేస్ దాని స్వంత నేరేషన్ ను కలిగిలేకపోవడం బాగాలేదు. పైగా ఇది అందరికీ నచ్చదు. ఇక సినిమాలో చూపిన మత మరియు ప్రాంతీయ వివాదం చాలా సన్నివేశాల్లో అధికంగా తీసుకోబడకపోవడం నిరాశ కలిగిస్తోంది.

చివరి మాటగా :

మొత్తంమీద, ముంబై వంటి నగరంలో వలసదారులను ఎలా చూస్తారనే దాని గురించి ఎలివేట్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా నిర్మించిన చిత్రం ఇది. కథా నేపథ్యం, కథ మరియు మనోజ్ బాజ్‌పాయ్ నటన, దర్శకుడి పనితీరు బాగా ఆకట్టుకుంటాయి.అయితే ప్లే నెమ్మదిగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం థీమ్, ఎమోషనల్ డెప్త్ తో మెప్పిస్తోంది. ఈ లాక్డౌన్ వ్యవధిలో మంచి సినిమా చూడాలనుకునే వారు ఈ సినిమా చూడొచ్చు.

Rating: 3.5/5


Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles