Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2258

రివ్యూ: పవర్ స్టార్- తెలుగు ఫిల్మ్- ఆర్ జి వి వరల్డ్ థియేటర్

$
0
0
Power Star Review

విడుదల తేదీ : జూలై 25, 2020

123telugu.com Rating : 2.25/5

నటీనటులు : ప్రవన్ కళ్యాణ్

దర్శకత్వం : ఆర్ జి వి

సంగీతం : డి ఎస్ ఆర్

సినిమాటోగ్రఫీ : జోషి

కొన్ని రోజులుగా సంచలనంగా మారిన పవర్ స్టార్ మూవీ నేడు విడుదలైంది . అనేక వివాదాల మధ్య ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథ:

సార్వత్రిక ఎన్నికల తరువాత మన సేన పార్టీ అధినేత ప్రవన్ కళ్యాణ్ ఘోర ఓటమి పాలవుతాడు. ఎన్నో ఊహించుకున్న ప్రవన్ కళ్యాణ్ ఘోర పరాజయాన్ని తట్టుకోలేక తీవ్ర ఒత్తిడి గురవుతాడు. ఆ క్రమంలో ఆయన తన రాజకీయ భవిష్యత్ పై సందిగ్ధంలో పడతాడు. అసలు రాజకీయాలలో కొనసాగాలా, వదిలేయాలా అనే సందిగ్ధంలో ఉండగా ఓ వ్యక్తి సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ వ్యక్తి ఎవరు? అతను ప్రవన్ కళ్యాణ్ ని ఎందుకు కలిశాడు? ప్రవన్ కి ఆ వ్యక్తి ఇచ్చిన సూచనలు ఏమిటీ? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ చిత్రం ద్వారా రామ్ గోపాల్ వర్మ హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాడని అందరూ అనుకున్నారు. ఐతే ఈ సినిమాలో అలాంటి పర్సనల్ అటాక్స్ ఏమి ఉండవు. ఎన్నిక ఫలితాల తరువాత ప్రవన్ కళ్యాణ్ అనే ఓ స్టార్ కమ్ పొలిటీషియన్ అనుభవించిన మానసిక వేదన తెలియజేశారు. ఇక ప్రవన్ కళ్యాణ్ పాత్ర చేసిన వ్యక్తి తనకు ఇచ్చిన జాబ్ పరి పూర్ణం చేశాడు.

ఇక ప్రవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇమేజ్ ని కొందరు ఎలా తమ స్వార్ధానికి వాడుకున్నారు, తనని మిస్ గైడ్ చేసి ఘోర ఓటమికి ఎలా కారణమయ్యారు అనే విషయాలు చెప్పిన విధానం బాగుంది. ఆర్ జి వి ఈ మూవీలో ఓ పాత్ర చేయడం విశేషం..ఆయన నటన పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

ఆర్ జి వి ఈ మూవీలో ప్రవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వారు తనని తప్పుదారి పట్టించి, ఫెయిల్యూర్స్ కారణం అవుతున్నారు అనే అంశాలను చెప్పడం జరిగింది. వర్మ నిర్మాణాత్మక విమర్శ బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ మూవీలో కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ పోలిన పాత్రలను వర్మ కొంచెం నెగిటివ్ యాంగిల్ లో చూపించారు. అది ఓ వర్గానికి వారి ఫ్యాన్స్ కి నచ్చక పోవచ్చు. కొన్ని సన్నివేశాలు చాల హార్స్ గా కొందరిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.

ఇక ఈ మూవీ పెద్ద పొలిటికల్ సెటైర్ అనుకుంటే పొరపాటే…ట్రైలర్ చూసి ఉహించుకున్న స్థాయిలో సెటైర్స్ ఉండవు. ఇక ప్రవన్ కళ్యాణ్ అనే పాత్రను డిపెండెంట్ గా చూపించారు. ప్రతి విషయంలోనూ పక్క వారి మాటలు వింటాడు అన్నట్లు చెప్పడం ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.

ఎప్పటిలాగే వర్మ తన సినిమాలో ఏమి ఉంటుందో అంతా ట్రైలర్ లోనే చూపించేశాడు. కాబట్టి 40 నిమిషాల సినిమాలో కొత్తగా చూడడానికి ఏమీ ఉండదు. అది కూడా ఈ చిత్రంలో ప్రధాన మైనస్ అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం:

 

కెమెరా పనితనం బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఇక ఈ సినిమా ద్వారా ఆర్ జి వి నేను పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కాదని నిరూపించుకొనే ప్రయత్నం చేశారు.

 

తీర్పు:

 

మొత్తానికి, పవర్ స్టార్ మూవీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనుభవించిన మానసిక వేదన తెలిపే ఓ షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలి . ఐతే అందరూ భావించినట్లు ఈ చిత్రం హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మరియు రాజకీయ జీవితంపై వచ్చిన సెటైరికల్ మూవీ అయితే కాదు . మంచి స్వభావం కలిగిన ప్రవన్ కళ్యాణ్ ని కొందరు తమ స్వార్ధం కోసం తప్పుదారి పట్టించారు అన్నట్లు సాగింది. ప్రముఖులపై వర్మ వేసిన కొన్ని సెటైర్స్ మరియు ప్రవన్ కళ్యాణ్ పాత్రను వర్మ స్వయంగా ఎదుర్కొనే విధానం వంటి విషయాలు చాలా మందికి నచ్చకపోవచ్చు. భిన్న షేడ్స్ కలిగిన ఈ మూవీ చూసే వారి దృష్టికోణాన్ని బట్టి అభిప్రాయం మారవచ్చు. ఐతే వర్మ గత చిత్రాలతో పోల్చుకుంటే మాత్రం పరవాలేదు అనిపిస్తుంది.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review


Viewing all articles
Browse latest Browse all 2258

Trending Articles