Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2258

రివ్యూ : పరాన్నజీవి –‘శ్రేయాస్ ఈటి అప్’లో

$
0
0
Paranna Jeevi Review

Release date : July 25th, 2020

123telugu.com Rating : 1.75/5

నటీనటులు : షకలక శంకర్, కత్తి మహేష్, లక్ష్మణ్,లహరి, జాస్మిన్

దర్శకుడు : డాక్టర్ నూతన్ నాయుడు

స్క్రీన్ ప్లే: డాక్టర్ నూతన్ నాయుడు

నిర్మాత : సీఎస్

 

ఆర్జీవీ వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేస్తూ నూతన నాయుడు పరాన్నజీవి అనే ఓ మూవీ తెరకెక్కించాడు. ప్రముఖ కమెడియన్ షకలక శంకర్ ఆర్జీవీగా నటించాడు. ఈ సినిమా ‘శ్రేయాస్ ఈటి అప్’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

 

కథ :

ఆర్జీవీ(షకలక శంకర్) హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని అందమైన అమ్మాయిలను శారీరకంగా వాడుకుంటూ.. కనీసపు విలువలు కూడా లేకుండా ప్రవర్తిస్తుంటాడు. ఇక ఆర్జీవీ అసిస్టెంట్ మహేష్ (లక్ష్మణ్), ఆర్జీవీ మీద కోపం ఉన్నా తప్పక అతని దగ్గరే పని చేస్తుంటాడు. ఈ క్రమంలో నిర్మాత శేఖర్ (కత్తి మహేష్) ఆర్జీవీతో సినిమా తిద్దామనుకుంటాడు. కానీ ఆర్జీవీ తానూ తీసే సినిమాకు సబంధించి ఎలాంటి ఆలోచన లేకుండా ఏది పడితే అది చెబుతూ పవన్ కళ్యాణ్ బయోపిక్ తీస్తానంటాడు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్జీవీకి ఎలా బుద్ధి చెప్పారు అన్నదే మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఆర్జీవీగా నటించిన షకలక శంకర్‌ నటన పరంగా బాగా ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా ఆర్జీవీ టైమింగ్ తో బాగా అలరించాడు. ఇక హీరోయిన్ అవుదామనుకునే పాత్రల్లో లహరి, జాస్మిన్ కూడా పర్వాలేదు. తమ నటనను ప్రదర్సించే అవకాశం లేకపోయినా ఏదో నటించడానికి వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేశారు.

ఇక కత్తి మహేష్, లక్ష్మణ్ తమ కామెడీ టైమింగ్‌ తో ఒకటి రెండు సీన్స్ లో పర్వాలేదనిపించారు. ఆర్జీవీ పలికిన డైలాగ్స్ అండ్ అతని నైజం చెప్పే సన్నివేశం ఓకే అనిపిస్తోంది. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు అనవసరపు ఎక్స్ ప్రెషన్స్ తో నటించినా పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేదు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదు. ఏది ఇంట్రస్టింగ్ గా సాగదు. సినిమా చూశాక.. సినిమాలో చాల సన్నివేశాలు ఆర్జీవీ మీద కోపంతో తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమాలో చాలా భాగం ఆర్జీవీ అమ్మాయిలను వాడుకుంటున్నాడని చెప్పడానికే సరిపోయింది. దీనికి తోడు అనవసరమైన సీన్స్ ఒకటి.

పైగా ప్లో లేని సీన్లతో, అలరించని కామెడీతో దర్శకుడు సినిమాని నడిపాడు. దాంతో ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. మొత్తానికి ఆర్జీవీ మీద కోపంతో ఏదో తీయాలని ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా నిరుత్సాహ పరుస్తోంది. అయినా ఆర్జీవీ మీద ఎలాంటి సినిమా తీయాలో క్లారిటీ లేకుండా సినిమా తీసినట్టు అనిపిస్తోంది.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు నూతన్ నాయుడు రాసుకున్న స్క్రిప్ట్ ఏ మాత్రం బాగాలేదు. దీనికి తోడు స్క్రీన్ మీదకు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఎక్కడా కథకథనాలు అంటూ పెద్దగా కనిపించవు. మ్యూజిక్ డైరెక్టర్ అందించిన పాటలు మాత్రం పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఇక నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లే సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి.

 

తీర్పు :

ఆర్జీవీ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినీ విమర్శనాస్త్రం ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా సాగకపోగా.. నిరుత్సాహ పరుస్తోంది. షకలక శంకర్‌ తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా కథాకథనాల్లో ఇంట్రస్ట్ అండ్ క్లారిటీ మిస్ అవ్వడం, అలాగే కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ ఉండటం, దీనికితోడు ఏ మాత్రం ఆసక్తికరంగా సాగని ప్లే లాంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఆకట్టుకోదు. పవన్ ఫ్యాన్స్ ను కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating : 1.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2258

Trending Articles