Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2264

సమీక్ష : ‘వి’–అక్కడక్కడా పర్వాలేదనిపించే సస్పెన్స్ థ్రిల్లర్ !

$
0
0
V Movie Review

Release date : September 05th, 2020

123telugu.com Rating : 2.75/5

నటీనటులు : నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి, జగపతి బాబు తదితరులు.

రచన,దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : అమిత్ త్రివేది

సినిమాటోగ్రఫర్ : పి.జి.విందా

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

 

 

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వి’. అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ

కథ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే సూపర్ కాప్ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) గ్యారెంటీ మెడల్ తో డిపార్ట్మెంట్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేధా) అతని కథ రాయడానికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. అంతలో సడెన్ గా ఆదిత్య జీవితంలోకి విష్ణు (నాని) ఎంట్రీ ఇస్తాడు. ఇన్స్ పెక్టర్ ప్రసాద్ అనే అతన్ని చంపి మరో నలుగురును చంపుతా దమ్ము ఉంటే ఆపు అని ఆదిత్యతో ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ను పర్సనల్ గా తీసుకున్న ఆదిత్య, విష్ణు హత్యలు చేయకుండా ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు ? అసలు ఆర్మీలో పని చేసిన విష్ణు అత్యంత దారుణంగా ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? ఈ హత్యలకు సాహెబా (అదితి రావ్ హైదరి)కి సంబంధం ఏమిటి ? ఇంతకీ ఆదిత్య , విష్ణులలో చివరకు ఎవరు గెలిచారు ? గతంలో వారిద్దరి మధ్య కనెక్షన్ ఏమిటి ? విష్ణు మెయిన్ గా ఆదిత్యనే ఎందుకు టార్గెట్ చేసాడు ? అనేదే మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

తన సహజమైన నటనతో ప్రేక్షకుల చేత నేచురల్ స్టార్ అనిపించుకున్న నాని ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్లు… ఎప్పటిలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నాని నటించిన విధానం సినిమాకే హైలెట్ అనిపిస్తోంది. అలాగే సెకెండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సన్నివేశాలతో పాటు సుదీర్ బాబు క్యారెక్టర్ తో సాగే ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని నాని తన టైమింగ్ తో అద్భుతంగా నటించాడు. అలాగే తన క్లాసిక్ విలనిజమ్ తో నాని కొత్తగా కనిపించాడు.

హీరో సుధీర్‌ బాబును `స‌మ్మోహ‌నం`లో లవర్ బాయ్ లా చూపించిన ఇంద్ర‌గంటి, ఈసారి మాత్రం సుధీర్‌ ను ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో అంతే పవర్ ఫుల్ గా చూపించాడు. నాని విలనిజానికి ధీటుగా ఉండే ఒక డీసీపీ పోలీస్ ఆఫీస‌ర్ హీరోయిజాన్ని సుధీర్‌బాబు కూడా అంతే సీరియస్ టోన్ లోనే పలికించాడు. ఇక నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా వ‌చ్చే యాక్ష‌న్ అండ్ ఛేజింగ్ స‌న్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఇంద్ర‌గంటి మొదటి సినిమా నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికే ప్రయత్నం చేస్తూ.. మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ తన సినిమాలో గుడ్ కంటెంట్ ఉంటుందనే నమ్మకాన్ని మళ్ళీ ఇ సినిమాతో రుజువు చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక కీలక పాత్రల్లో నటించిన హీరోయిన్స్ ‘అదితి రావ్ హైదరి’, ‘నివేదా థామస్’ అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు మరియు వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో మెప్పించారు.

 

మైనస్ పాయింట్స్

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీసుకున్న మెయిన్ పాయింట్ బాగా ఆకట్టుకున్నా… ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ ఆయన రాసుకున్న ట్రీట్మెంట్ కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇద్దరి హీరోల లవ్ ట్రాక్స్ కూడా వీక్ గా ఉన్నాయి. క్రైమ్ కథలు రాయడానికి వచ్చిన ఒక కాలేజీ టాపర్ నివేధా మరీ సిల్లీగా లవ్ లో పడిపోవడం, దానికితోడు అమెగారు రీసెర్చ్ చేసే విధానం మరీ కామెడీగా అనిపిస్తుంది..

ఇక నాని – అతిధి మధ్య సాగిన లవ్ ట్రాక్ పాత అనేక లవ్ సినిమాల వాసన కొట్టొచ్చినట్లు కనిపించినా.. ఎక్కడో ఏదొక సీన్ అయినా ఆకట్టుకుందేమో అని మనం ఆశగా ఎదురుచూడటం తప్ప.. అక్కడా ఆకట్టుకునే ఒక్క సీన్ లేదు. మొత్తానికి ఇంద్రగంటి సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. కథనంతో సినిమాని నెమ్మదిగా సాగతీస్తూ మధ్యమధ్యలో యాక్షన్ పెట్టి నెట్టుకొచ్చాడు.

అలాగే ఫస్టాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించుకుని ఉండి ఉంటే, సినిమాకి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది. అయితే దర్శకుడు రాసుకున్న మెయిన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని సీన్స్ బాగా స్లోగా ఉండటం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. మొత్తంగా దర్శకుడు సస్పెన్స్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా సినిమా పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన సాంగ్స్ సినిమాకి పెద్దగా ప్లస్ అయితే కాలేదు. ఇక యాక్షన్ సీన్స్ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఎడిటింగ్ బాగుంది గాని, ఫస్ట్ హాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లోని విజువల్స్ ను విందా చాలా సహజంగా చూపించారు. నిర్మాత దిల్ రాజు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

 

తీర్పు :

భారీ అంచనాలతో మల్టీస్టారర్ గా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. నేచురల్‌ స్టార్‌ నాని నటనతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే కొన్ని సప్సెన్స్ సీన్స్ తో అదేవిధంగా ఇంద్రగంటి డైరెక్షన్ స్కిల్ తో ఈ సినిమా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే లవ్ ట్రాక్స్ బోర్ గా సాగడం, సాంగ్స్ కూడా బాగాలేకపోవడం, అలాగే కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు కొన్ని చోట్ల ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా అనిపిస్తాయి. అయితే సుధీర్ బాబు, అతిధి, నివేదా తమ నటనతో మెప్పిస్తారు. ఓవరాల్ గా ఈ సినిమా ఇద్దరి హీరోల అభిమానులతో పాటు థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి కూడా బాగానే నచ్చుతుంది. కాకపోతే ఓన్లీ కామెడీ సినిమాలనే ఇష్టపడేవారితో పాటు మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ కాదు.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click Here For English Review


Viewing all articles
Browse latest Browse all 2264

Latest Images

Trending Articles



Latest Images