నటీనటులు: పుల్కిత్ సామ్రాట్, కృతి ఖర్బంద, జిమ్ సర్బ్, హర్షవర్ధన్ రాణే, సంజీదా షేక్
దర్శకత్వం: బిజోయ్ నంబియార్
నిర్మాతలు: నిశాంత్ పిట్టి, దీపక్ ముకుట్, బిజోయ్ నంబియార్, శివన్షు పాండే, రికాంత్ పిట్టి
సంగీతం: గౌరవ్ గాడ్ఖిండి, గోవింద్ వసంత
ఛాయాగ్రహణం: హరశ్వీర్ ఒబెరాయ్
ఎడిటింగ్: ప్రియాంక్ ప్రేమ్ కుమార్
పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న వెబ్ సిరీస్ “పాయిజన్ 2”. స్ట్రీమింగ్ యాప్ “జీ 5”లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఈ సిరీస్ లండన్ కు చెందిన సౌత్ హెల్ అనే ప్రాంతంలో మొదలవుతుంది. రోహన్ కల్రా(జిమ్ సర్బ్) ఒక డాక్టర్, అతడు పాకిస్తాన్ కు చెంసిన అర్ఫా(కృతి కర్బందా)ను ప్రేమిస్తాడు. అయితే అతడు తన సోదరుడి పెళ్లి ఉండడంతో ఇంటికి వస్తాడు ఇదే క్రమంలో కొన్ని కీలక పరిణామాల తర్వాత బ్రార్ కుటుంబానికి చెందిన భయకరమైన డాన్ పలి బ్రార్(హర్షవర్ధన్ రానే), తన అన్నయ్య(అభిమన్యు సింగ్)పై దాడి జరిగిందని అందరిని చంపేస్తానని హెచ్చరికలు ఇస్తాడు. అయితే ఈ పెద్ద డ్రామా వెనుక ఉంది సన్నీ(పుల్కిత్ సామ్రాట్) అని రోహన్ తెలుసుకుంటాడు. ఇక ఇక్కడ నుంచి రెండు కుటుంబాల మధ్య పెద్ద వార్ కు తెర లేస్తుంది. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరికి ఏమయ్యింది అన్నదే అసలు కథ.
ఏమి బాగుంది?
మొదటగా దర్శకుడు బిజోయ్ నంబియార్ కోసం చెప్పుకోవాలి. ఈ దర్శకుడు తన సినిమాలలో ఎమోషన్స్ ను ఎంత అద్భుతంగ క్యారీ చేస్తారో అంతే అంతే అద్భుతంగా ఈ సిరీస్ కు కూడా ప్లాన్ చేశారు. అంతే కాకుండా సినిమాలోని చూపిన కుటుంబాలు వాటిలో కనిపించే వారికి ఇచ్చిన పాత్రలు వాటిని సరైన రన్ టైం వరకు చూపిన విధానం అన్ని సూపర్బ్ గా అనిపిస్తాయి.
అలాగే నటీనటుల నుంచి రాబట్టిన ఎమోషన్స్ అన్ని కూడా ఈ సిరీస్ లో మంచి ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే డాన్ బ్యాక్ డ్రాప్ మంచి ఇంటెన్స్ గా ఉండడమే కాకుండా యాక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే మన తెలుగు నటుడు హర్షవర్ధన్ రానే రోల్ అయితే అద్భుతంగా ఉంటుంది. అతని లుక్ కానీ నటన కానీ చాలా బాగుంటాయి. అలాగే అతడి ట్రాన్స్ఫర్మేషన్ కానీ అతడి ఇచ్చిన పెర్ఫామెన్స్ కానీ సూపర్బ్ అంతే అని చెప్పొచ్చు.
ముఖ్యంగా ఎమోషన్స్ కూడా బాగా పండించాడు ఈ నటుడు. అలాగే పుల్కిత్ సామ్రాట్ తన అగ్రెసివ్ రోల్ లో మంచి నటనను కనబరిచాడు. అలాగే కీలక పాత్రలో కనిపించిన కృతి కర్బంద మంచి అవుట్ పుట్ ఇచ్చింది. వీరితో పాటుగా సంజిదా షేక్ తన రోల్ ను బాగా చేసింది. అలాగే జిమ్ సర్భ్ ఓకే అనిపిస్తాడు.
ఏమి బాగోలేదు?
ఈ సిరీస్ లోని కథ కాస్త రొటీన్ డ్రామా లానే అనిపిస్తుంది. ఇది వరకే చాలా షోలలో సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో సీన్స్ కాస్త అర్ధ రహితంగా అనిపిస్తాయి. అలాగే జిమ్ సర్భా పై చూపి కొన్ని సీన్స్ అనవసరంగా అనిపిస్తాయి.
అలాగే ఇందులో చూపే క్రైమ్ పార్ట్ మరీ ఓవర్ గా అనిపిస్తుంది. వీటితో పాటుగా ఈ సిరీస్ లో ఎక్కువగా పంజాబీ భాషను వాడడం మూలాన అందరికీ కొన్ని సంభాషణలు అర్ధం కాకపోవచ్చు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ తయిష్ సిరీస్ సాలిడ్ ఎమోషన్స్ మరియు నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ లు మంచి యాక్షన్ డ్రామా లు హైలైట్ గా అనిపిస్తాయి. కానీ ఒక్క ఓల్డ్ కంటెంట్ అనే మాటను పక్కన పెడితే బిజోయ్ నంబియార్ అత్యద్భుతంగా డిజైన్ చేసిన ఈ సిరీస్ మాత్రం ఖచ్చితంగా అందరు చూసే దగిందిగా ఉంటుంది. తప్పకుండా చూడొచ్చు.
Rating: 3.25/5
The post ఓటిటి రివ్యూ : తయిష్ - హిందీ సిరీస్ జీ5 లో ప్రసారం first appeared on https://www.123telugu.com/telugu.