Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2206

సమీక్ష: జగమే తంత్రం –తమిళ్(తెలుగు డబ్) నెట్‌ప్లిక్స్‌లో ప్రసారం

$
0
0
 Jagame Thandhiram Review

విడుదల తేదీ : జూన్ 18, 2021

123telugu.com Rating : 2.25/5

నటీనటులు : ధనుష్, జేంస్ కాస్మో, ఐశ్వర్య లక్ష్మీ, కలైయరసన్, జోజు జార్జ్ మరియు ఇతరులు

దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్

నిర్మాత‌ : యస్.శశికాంత్

సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ క్రిష్ణ

సంగీతం : సంతోష్ నారాయణన్

ఎడిటింగ్ : వివేక్ హర్షన్

జాతీయ అవార్డు గ్రహీత తమిళ స్టార్ ధనుష్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ డ్రామా “జగమే తంత్రం”. ఎన్నో అంచనాలు, హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం నేడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యింది.

అయితే మే నెలలోనే ఈ సినిమా తెరపైకి రావాల్సి ఉన్నప్పటికి కరోనా సెకండ్ వేవ్ మరియు లాక్‌డౌన్ కారణంగా మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. మరీ ఈ చిత్రం ఎలా ఉంది, ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకున్నది అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

సురులి (ధనుష్) మదురైలో ఓ స్థానిక గ్యాంగ్ స్టర్. అతను ఒక చిన్న హోటల్ కూడా నడుపుతున్నాడు. అయితే అతను ఒక వ్యక్తిని చంపిన తరువాత ఇబ్బందుల్లో పడతాడు. సురులి యొక్క యజమాని ఉద్రిక్తత తగ్గే వరకు అతడిని అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళమని చెబుతాడు.

శివాదాస్ (జోజు జార్జ్) అనే స్థానిక గ్యాంగ్‌స్టర్‌ను వెలికి తీయడానికి లండన్ నుండి వచ్చిన ఇద్దరు సురులిని సంప్రదిస్తారు. సురులి లండన్ వెళ్లి తన కొత్త బాస్ పీటర్(జేమ్స్ కాస్మో)తో చేరాడు. అతను వలసదారులకు వ్యతిరేకంగా ఉంటాడు.

అయితే శివదాస్ మరియు అతని ముఠాను వెంబడించే సమయంలో సురుళి అతిలా(ఐశ్వర్య లక్ష్మి)తో ప్రేమలో పడి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అయితే వలసదారుల వాస్తవికతను మరియు గుర్తింపు కోసం వారు చేస్తున్న దశాబ్దాల పోరాటానికి సురులి మద్ధతుగా నిలుస్తాడు. ఈ క్రమంలో తన బాస్ పీటర్‌ను వ్యతిరేకించి వలసదారుల కోసం పోరాడుతాడు. ఈ సమయంలో సురులి ఎలాంటి పోరాటం చేస్తాడన్నది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూసేయాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

లండన్‌లో అడుగుపెట్టిన ఆడంబరమైన గ్రామ యువకుడిగా ధనుష్ తన పాత్రలో బాగా మెప్పించాడు. నిజానికి అతను తన నటనతో మొత్తం సినిమాను తన భుజాలపైనే వేసుకున్నాడని చెప్పాలి. మదురైతో పాటు లండన్ ఎపిసోడ్లలో ధనుష్ చాలా బాగా ఉన్నాడు. ఇక ఎప్పటిలాగే అతను డ్యాన్స్ మరియు ఫైట్లలో కూడా తనదైన మార్క్ చూపించాడు .

ఇక ప్రశంసలు పొందిన మలయాళ నటుడు జోజు జార్జ్ మరోసారి ప్రశంసనీయమైన నటనను ఇచ్చి అద్భుతమైన ముద్ర వేశాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జేమ్స్ కాస్మో ప్రజెన్స్ కూడా ఈ చిత్రంలో బాగుంది. ఇక మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ సింగర్ పాత్రలో బాగా ఎమోట్ అయ్యింది. ఇక ఇతర నటీనటులు కూడా వారి వారికి ఇచ్చిన పాత్రలలో చక్కగా నటించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్ ప్లేనే ప్రధాన లోపాలు అని చెప్పాలి. ఒక ఆసక్తికరమైన గమనికతో సినిమాను ప్రారంభించిన తరువాత మదురై ఎపిసోడ్ దానిని అనుసరించిన తరువాత, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను తిరిగి లండన్‌కి తీసుకెళ్ళినప్పుడు కార్యకలాపాలు నెమ్మదించడం మైనస్ అని చెప్పాలి.
ఇక సినిమాలో చాలా పాత్రలు, అసంబద్ధమైన పాత్రలు, ముఖ్యంగా స్త్రీ పాత్రల కోసం, మరియు అర్ధంలేని సన్నివేశాలు కథనానికి రోడ్‌బ్లాక్‌లుగా పనిచేస్తాయి. తత్ఫలితంగా చిత్రం యొక్క ప్రధాన లక్ష్యమైన వలసదారుల దుస్థితిని ఎత్తిచూపడంపై ప్రభావం చూపించింది.

సాంకేతిక విభాగం:

ఎన్నో ప్రశంసలు పొందిన తమిళ స్వరకర్త సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జగమే తంత్రం సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పాలి. కొన్ని పాటలు, రకితా రకిత మరియు టైటిల్ ట్రాక్ సురులి, మిగిలిన ఆల్బమ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా మేజర్ క్రెడిట్ తీసుకుందని చెప్పాలి. శ్రేయాస్ లండన్ సన్నివేశాలను బాగా చూపించాడు. ఈ చిత్రం యొక్క ప్రధాన కథాంశం మరియు గొప్ప నిర్మాణ విలువలు జగమే తంత్రానికి ప్రధాన హైలెట్స్ అని చెప్పాలి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే తమిళ సినిమా మరియు స్టార్ తారాగణంలో ఎన్నడూ అన్వేషించబడని ప్రత్యేకమైన కథాంశంతో జగమే తంత్రం చిత్రం వచ్చినప్పటికి సరిగ్గా మలచలేకపోయారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో అంచనాలను క్రియేట్ చేసినా చివరకు ఆ అంచనాలను అందుకోలేదని స్పష్టంగా అర్ధమయ్యింది. ఇక ఈ సంవత్సరం పెద్ద నిరాశపరిచిన చిత్రాలలో ఇది కూడా ఒకటిగా నిలిచిందనే చెప్పాలి. ఈ చిత్రంలో ధనుష్ యొక్క శక్తివంతమైన పనితీరు అతని అభిమానులను ఆకట్టుకుంటుంది కానీ నత్త నడకన నడిచే కథనం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. ఏదేమీనా మీరు ఈ వారాంతంలో ఈ యాక్షన్ డ్రామాను చూడాలనుకుంటే తక్కువ అంచనాలతో చూసేయొచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

The post సమీక్ష: జగమే తంత్రం - తమిళ్(తెలుగు డబ్) నెట్‌ప్లిక్స్‌లో ప్రసారం first appeared on https://www.123telugu.com/telugu.


Viewing all articles
Browse latest Browse all 2206

Trending Articles