
విడుదల తేదీ : నవంబర్ 19, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ తదితరులు
దర్శకత్వం : వెంకటేష్ త్రిపర్ణ
నిర్మాతలు: అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫి: జె. ప్రభాకర రెడ్డి
ఎడిటింగ్: బస్వ రెడ్డి పివైడిఐ
వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్ హీరోలుగా వచ్చిన సినిమా ‘రామ్ అసుర్’. కాగా డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఇద్దరి జీవితాలు ఎలా ముడి పడ్డాయి అనే కోణంల్ ఈ సినిమా సాగుతోంది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్ష లోకి వెళ్లి చూద్ధాం.
కథ :
రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. దాంతో అతని పరిస్థితి రోజురోజుకు దిగజరుతూ ఉంటుంది. దాంతో రామ్ ప్రాణంగా ప్రేమించిన ప్రియ(షెర్రీ అగర్వాల్) అతనికి బ్రేకప్ చెప్పి వదిలేస్తోంది. ఆ తర్వాత రామ్ బాగా డిస్టర్బ్ అవుతాడు. జీవితంలో మళ్లీ కోలుకోవాలనే ప్రయత్నంలో పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. రామాచారి సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్తాడు. అసలు సూరికి, రామ్ కు మధ్య సంబంధం ఏంటి? వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిశాయి? సూరి ఎవరు ? అతని నేపథ్యం ఏంటి? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మెయిన్ పాయింట్ వజ్రం తయారుచేయడం, ఆ వజ్రంకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ఈ సినిమా కొంతమేరకు వైవిధ్యంగానే సాగింది. నటీనటులు విషయానికి వస్తే.. సూరి పాత్రలో అభినవ్ సర్దార్ బాగానే నటించాడు. ఒక ఎమోషనల్ లవర్ గా అలాగే ఎగ్రెసివ్ లుక్ లో కూడా అభినవ్ ఓకే అనిపించాడు. అలాగే మరో కీలక పాత్ర అయిన రామ్ పాత్రకి రామ్ కార్తీక్ న్యాయం చేశాడు.
ఇక షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకుంది. అదే విధంగా మరో హీరోయిన్ చాందిని తమిళరాసన్ కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో నటుడు శాన్వీ సాల్మన్ మంచి నటనను కనబరిచాడు. శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. న్యూ యాంగిల్ లో డిఫరెంట్ పాయింట్ అఫ్ వ్యూలో దర్శకుడు ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
మైనస్ పాయింట్స్ :
వినూత్నమైన పాయింట్ తో సినిమా స్టార్ట్ అయినా.. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు
ప్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో క్యారెక్టర్ కి ఇచ్చిన ఓవర్ బిల్డప్.. దానికి తగ్గట్లుగానే హీరో ఇచ్చిన సీరియస్ లుక్స్.. చివరికి హీరో క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడు అతని క్యారెక్టరైజేషన్ కి పై వాటికి ఎక్కడా పొంతన లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.
అయితే, దర్శకుడు రాసుకున్న కాన్సెప్ట్, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొన్ని, మరియ క్లైమాక్స్ సీన్స్ ఒకే అనిపించినప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడంతో సినిమా ఆకట్టుకోదు. ఇక కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాదు. దానికి తోడూ రెండో భాగం కథనంలో ప్లో కూడా ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో సినిమా బోర్ గా ముగుస్తుంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే బాగానే ఉంది. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ.. సినిమా విజువల్ గా పూర్తిగా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ ప్లస్ అయింది. సంగీతం పర్వాలేదు. అయితే సీన్ మూడ్ తో పాటు ఓవరాల్ గా సినిమాని దృష్టిలో పెట్టుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటర్ ప్లాష్ బ్యాక్ కి లైవ్ కి మధ్య స్మూత్ కట్టింగ్ చేస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
వైవిధ్యమైన పాయింట్ తో ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాగాలేదు. మెయిన్ థీమ్, కొన్ని సీన్స్ తప్ప ఇక సినిమాలో ఆకట్టుకునే అంశం ఏమి లేదు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో కీలక సీన్స్ బోర్ గా సాగడం, స్లో నేరేషన్, సినిమాలో ఇంట్రెస్టింగ్ అంశాలు పెద్దగా లేకపోవడం లాంటివి సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తమ్మీద ఈ ‘చిత్రం’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కొంతవరకు కనెక్ట్ అవుతుంది. అయితే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదు.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team
Click Here For English Version
The post సమీక్ష : రామ్ అసుర్ - ఆసక్తిగా సాగని డైమండ్ మిస్టరీ డ్రామా first appeared on https://www.123telugu.com/telugu.