టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ సహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ బిగ్గెస్ట్ డే రానే వచ్చేసింది. వారు నటించిన మోస్ట్ పవర్ ఫుల్ చిత్రం “భీమ్లా నాయక్” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.
అయితే తెలుగు రాష్ట్రాల సహా ఓవర్సీస్ లో కూడా భీమ్లా నాయక్ మొట్ట మొదటి రోజుని ఒక రోరింగ్ రెస్పాన్స్ తో స్టార్ట్ చేసుకున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. మేకర్స్ పెట్టిన మొత్తం ఎఫర్ట్స్ ఇప్పుడు సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి.
దీనితో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే దర్శకుడు సాగర్ చంద్ర పవన్ మరియు రాణాలతో కలిసి ఒక భారీ హిట్ ని అందుకున్నట్టే అని చెప్పాలి. మరి ఈ చిత్రంలో నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
The post రోరింగ్ రెస్పాన్స్ తో మొదలైన "భీమ్లా నాయక్" ఫస్ట్ డే..! first appeared on https://www.123telugu.com/telugu.