Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2258

సమీక్ష : “ది ఘోస్ట్”–యాక్షన్ లవర్స్ కోసం మాత్రమే

$
0
0
The Ghost-telugu-movie-review

విడుదల తేదీ : అక్టోబర్ 05, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవివర్మ

దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్

సంగీతం: భరత్ – సౌరభ్, మార్క్ కె రాబిన్

సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

డిఫెరెంట్ జోనర్ లలో, డిఫెరెంట్ చిత్రాలతో ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో కింగ్ నాగార్జున. టాలీవుడ్‌కి కొత్త తరహా చిత్రాలను పరిచయం చేస్తూ, ప్రతిసారీ తన బెస్ట్ ను ఇస్తూనే ఉన్నారు నాగార్జున. తన లేటెస్ట్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ కోసం స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారుతో చేతులు కలిపాడు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం.

 

కథ:

 

విక్రమ్ (నాగార్జున) ఇంటర్ పోల్ ఆఫీసర్, తన ప్రియురాలు ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలిసి దుబాయ్‌ లో పనిచేస్తాడు. అతని ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగా సాగుతున్న టైమ్ లో ఒక సంఘటన విక్రమ్‌ని మానసికంగా కలవరపెడుతుంది. ఆ సంఘటన కారణం గా అతను, తన ప్రియురాలు ప్రియను విడిచి పెడతాడు. ఒక రోజు అతను అను (గుల్ పనాగ్) నుండి తన కుమార్తె అదితి మరియు ఆమె జీవితం పట్ల తనకున్న ఆందోళనను తెలియజేస్తూ, సమస్యను పరిష్కరించమని విక్రమ్‌ని అడగడం జరుగుతుంది. ఈ అను ఎవరు? ఆమె విక్రమ్ సహాయం ఎందుకు కోరింది? అను, అదితికి ముప్పు ఏంటి? అనుకు విక్రమ్‌కి ఉన్న అనుబంధం ఏమిటి? సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

వైవిధ్యమైన పాత్రలు చేయడానికి వెనుకాడని నటుల్లో కింగ్ నాగార్జున ఒకరు. ఈ విషయాన్ని తన కెరీర్‌లో చాలాసార్లు నిరూపించుకున్నాడు. ది ఘోస్ట్‌తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. విక్రమ్‌ గా అతని నటన ఈ చిత్రం కి అతి పెద్ద ప్లస్ పాయింట్. కింగ్ నాగ్ ఈ సినిమాను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తన అద్భుతమైన నటనతో తన భుజాలపై మోశాడు.

ఈ చిత్రంలో కంపోజ్ చేసిన అన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఇటీవలి కాలంలో అత్యుత్తమమైనవి అని చెప్పాలి. ఈ యాక్షన్ సీక్వెన్స్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సినిమాలో అవి చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఈ సన్నివేశాలు చూస్తుంటే థియేటర్ల లో గూస్‌బంప్స్ వస్తాయి. అలాంటి రిస్కీ స్టంట్స్‌ని కన్విన్సింగ్‌ గా చేసినందుకు నాగార్జునను తప్పకుండా మెచ్చుకోవాలి. ఈ చిత్రం అంతా కూడా అలాంటి అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఇది ప్రేక్షకులని స్క్రీన్‌ లకు అతుక్కుపోయేలా చేస్తుంది.

సోనాల్ చౌహాన్ కేవలం గ్లామర్ షో కి మాత్రమే కాకుండా చాలా చక్కని నటనని కనబరిచింది. ఆమె పాత్రకు ఈ సినిమా లో మంచి స్కోప్ ఉంది. ఆమె సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అనికా సురేంద్రన్, గుల్ పనాగ్, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి మిగతా నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేసారు.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ చిత్రం యాక్షన్ పార్ట్‌తో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, డ్రామా మరియు కథ అంత గొప్పగా లేవు. మరియు యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కథకి అంత డెప్త్ గా ఉండదు. ఎమోషనల్ యాంగిల్ సినిమాలో ఆర్టిఫీషియల్ గా, కొంచెం బలవంతంగా కనిపిస్తుంది. ఇది మనల్ని సినిమాకి పూర్తిగా కనెక్ట్ చేయదు.

ది ఘోస్ట్‌లో విలన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్ గా ఉంది. ముఖ్యంగా హీరో నాగ్ తుపాకీలతో దూసుకు పోతున్నప్పుడు విలన్ పాత్ర కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. కానీ, సినిమాలో అలా ఉండదు. పెద్దగా కష్టపడకుండానే హీరో పని అయిపోతుందన్న ఫీలింగ్ మన అందరిలో కలుగుతుంది.

ఒకానొక పాయింట్ నుండి చివరి గంటలో కథ ఊహించదగినదిగా ఉంటుంది. అందుకు తోడుగా స్క్రీన్‌ప్లే అంత ఆసక్తికరం గా ఉండదు. మధ్యలో కొన్ని సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా ఉంటాయి. కానీ, వాటిని సినిమాలో పెట్టిన విధానం ప్రేక్షకులను అలరించదు.

 

సాంకేతిక విభాగం:

 

భరత్ – సౌరభ్ లు అందించిన పాటలు బాగున్నాయి. మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. కొన్ని యాక్షన్ బ్లాక్‌లలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్స్ ను పెంచడం మాత్రమే కాకుండా, దానికి విలువను జోడించింది అని చెప్పాలి. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీ గా ఉంది. కొన్ని ఫ్రేమ్‌లు హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అతని పనితనం భారీ డెప్త్ ను జోడించింది అని చెప్పాలి.

నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. సన్నివేశాలు మరింత అందంగా కనపడటానికి చాలా ఖర్చు చేశారు మేకర్స్. ముందుగా చెప్పినట్లుగా యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు సినిమా కి ప్రధాన ఆస్తులు. అడ్రినలిన్ రష్ మూమెంట్‌లను ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన డెప్త్ ను ఇచ్చారు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే, అతను ది ఘోస్ట్‌తో కొంతవరకు విజయం సాధించాడు. అతను యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. అయితే కోర్ ఎమోషనల్ పార్ట్ పై కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. అతను ఈ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే, సినిమా ఇంకాస్త బావుండేది.
తీర్పు:

 

మొత్తం మీద, ది ఘోస్ట్ పర్వాలేదనిపించే యాక్షన్ థ్రిల్లర్. కొన్ని ప్రపంచ స్థాయి పోరాట సన్నివేశాల ద్వారా నాగార్జున అద్భుతమైన నటనను కనబరిచారు. ఇవి సినిమాకి బలం అని చెప్పాలి. మరోవైపు, సరైన భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం, బలహీనమైన విలన్, ముందుగానే తెలిసిపోయే విధంగా కథ సాగుతూ ఉండటం వంటి అంశాలు నిరాశను కలిగిస్తాయి. మీరు యాక్షన్ చిత్రాలను ఇష్ట పడేవారు అయితే సినిమాను చూడవచ్చు. మీ అంచనాలను తగ్గించుకొని వెళితే ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష : “ది ఘోస్ట్” – యాక్షన్ లవర్స్ కోసం మాత్రమే first appeared on .

Viewing all articles
Browse latest Browse all 2258

Trending Articles