
విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: కిషోర్, కలైయరసన్, ఆంటోని, షీలా రాజ్‌కుమార్, వేలరామమూర్తి, బాలహాసన్, లవ్లిన్, పట్టాబి, సతీష్, గౌతమ్, ఓర్నియం ప్రభు, తదితరులు.
దర్శకులు : ఎల్. ఏ. రాజ్ కుమార్
నిర్మాతలు: వెట్రిమారన్
సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్రాజ్
ఎడిటర్: సుదర్శన్
సంబంధిత లింక్స్: ట్రైలర్
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ పర్యవేక్షణలో తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ వెబ్ సిరీస్ పెట్టై కాళీ ని తెలుగులో జల్లికట్టు టైటిల్ తో డబ్ చేసి ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు నేడు తీసుకువచ్చారు. మరి ఈ సిరీస్ సమీక్ష ఇప్పుడు చూద్దాం.
కథ :
తమిళనాడులోని ముల్లయ్యూర్ నేపథ్యంలో సాగే ఈ కథ, ఆ ప్రాంతంలోని జమీందార్లు మరియు వ్యవసాయ కూలీల మధ్య జరిగే పోరాటంతో ప్రారంభమవుతుంది. భూమిలో కొంత భాగాన్ని తమకు ఇవ్వాలని కూలీలు భూస్వాములను అభ్యర్థించగా, భూస్వాములు వారి అభ్యర్థనను తిరస్కరిస్తారు. దానితో కూలీలు, భూస్వాముల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంటుంది. అయితే జల్లికట్టు క్రీడలో అగ్రవర్ణాల ఎద్దులను పట్టుకోకూడదని కూలీలు నిర్ణయిస్తారు. కాగా పాండి (కలైఅరసన్) అనే వ్యక్తి జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొని జమీందార్ సెల్వ శేఖరన్ (వేలరామమూర్తి) ఎద్దును మచ్చిక చేసుకుంటాడు. అయితే ఇది మళ్లీ అగ్రవర్ణ, నిమ్న కులాల ప్రజల మధ్య వైరానికి దారితీస్తుంది. మరి ఆ తరువాత ఏం జరిగింది? అనంతరం అది ఏవిధంగా మలుపులు తిరుగుతుంది అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
తమిళనాట సంప్రదాయ క్రీడ జల్లికట్టును ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా చూపించేందుకు యూనిట్ ఎంతో శ్రమించింది అనే చెప్పాలి. అలానే జల్లికట్టు వంటి క్రీడతో కూడిన కథ, కథనాలను రూపొందించడం అంత సులభం కాదు. ఇక ఇటువంటి సినిమాల్లో స్క్రీన్ పై నటీనటులందరూ వారి స్క్రీన్ టైమ్‌తో సంబంధం లేకుండా అద్భుతంగా నటించడం చాలా ముఖ్యం. కాగా నటీనటుల సహజ నటన, మేనరిజమ్స్ నిజంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. జల్లికట్టు యొక్క వివరణాత్మక సీన్స్ ని చక్కగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు మరియు అవి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అలానే సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రారంభ సీన్స్ అయితే ఆడియన్స్ లో మంచి ఆసక్తిని ఏర్పరుస్తాయి. ఇక కథ కూడా చక్కగా సెట్ చేయబడింది. ప్రతి నటీనటులు తమ తమ పాత్రల్లో తమ బెస్ట్‌ని అందించారు. ఆంటోని, కిషోర్ మరియు షీలా మరింతగా తమ పాత్రలతో మెప్పించడంతో పాటు వారికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అలాగే సినిమాలో కుల వివక్షను, దానికి సంబందించిన సన్నివేశాలను చక్కగా చూపించారు. అయితే ఐదవ ఎపిసోడ్‌లో వచ్చే కామెడీ ట్రాక్ ఈ సీరియస్‌గా సిరీస్‌లో ఆడియన్స్ కి కొంత ఉపశమనం కలిగిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
జల్లికట్టును ఉపయోగించి, మేకర్స్ దాని చుట్టూ విభిన్న అంశాలను బట్టి కథని అల్లడానికి ప్రయత్నించారు. కొన్ని అంశాలు చక్కగా చూపించబడినప్పటికీ, కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా లేవనే చెప్పాలి. అలానే కొన్ని సబ్‌ప్లాట్‌లు కూడా ఆకట్టుకునేలా చూపబడలేదు మరియు అందువల్ల కథనం ప్రభావం కొంత చెప్పగా సాగుతుంది. ఇక కథనంలో పలు ఇతర అంశాలు మరియు చిన్న సబ్‌ప్లాట్‌లు భాగాలుగా బాగానే సాగినా కానీ అవి సరిగ్గా కనెక్ట్ కాలేదు. కొన్ని ఎపిసోడ్స్ అయితే ఎంతో బోరింగ్ గా ఉంటాయి. స్పోర్ట్స్ ఎలిమెంట్‌ని తీసుకొచ్చినప్పుడల్లా, సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది, కానీ ఆ తర్వాత కొన్ని అనాసక్తికర సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. కథ ముందుకు సాగుతున్నప్పుడు, కథనంలో చాలా వరకు ఊహించదగినదిగా మారుతుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా హడావిడిగా సాగడం మరియు సినిమాటిక్ గా కూడా ఉంటుంది. ఇక సిరీస్ ని 6-7 ఎపిసోడ్‌లలో ముగించి ఉంటే ఇంకా బాగుండేది.
సాంకేతిక భాగం :
ఆర్. వేల్‌రాజ్ కెమెరా పనితనం బాగుంది, జల్లికట్టు క్రీడను వివిధ కోణాలలో ఆకట్టుకునేలా చూపించారు. ప్రతాప్ సౌండ్ డిజైన్ బాగుంది, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అయితే, ఎడిటింగ్ టీమ్ వారు సిరీస్‌ను కొంత ట్రిమ్ చేసి ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ కూడా ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఎల్ .రాజ్‌కుమార్ విషయానికి వస్తే, అతను సిరీస్ ని తెరకెక్కించడంలో ఓకే అనిపించారు. ఆయనే రచయిత కూడా కావడంతో అధికారం కోసం దురాశ, ప్రేమ మరియు ప్రతీకారం వంటి విభిన్న అంశాలను జల్లికట్టు క్రీడకు అనుసంధానం చేయాలనే ఆలోచన బాగుంది కానీ, ఆ విషయంలో పాక్షికంగా మాత్రమే ఆయన విజయం సాధించాడు. ప్రధానంగా సినిమా స్లో పేసింగ్‌తో సాగడంతో కొన్నిసార్లు విసుగును కూడా కలిగిస్తుంది. అలాగే, కథనం బహుళ సబ్‌ప్లాట్‌లను సరిగ్గా కనెక్ట్ చేయలేదు.
తీర్పు :
మొత్తంగా జల్లికట్టు సిరీస్ ప్రేమ, ప్రతీకారం మరియు అధికారం కోసం ఆరాటం వంటి అనేక అంశాల మేళవింపుగా సాగుతుంది. ఈ అంశాలను జల్లికట్టు క్రీడతో ముడిపెట్టేందుకు మేకర్స్ ప్రయత్నించారు. అయితే అందులో కొన్ని ఎపిసోడ్‌లు బాగున్నా, మరికొన్ని బోరింగ్‌గా సాగుతాయి. చాలావరకు నీరసంగా సాగె కథనం సిరీస్ కి అడ్డంకిగా మారింది అనే చెప్పాలి. మీరు గ్రామీణ డ్రామా సినిమాలు ఇష్టపడేవారైతే, ఈ వీకెండ్ లో జల్లికట్టు ఒకసారి చూసేయొచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష : జల్లికట్టు – ఆహా లో తెలుగు డబ్బింగ్ సిరీస్ first appeared on .