
విడుదల తేదీ : జూన్ 15, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: తమన్నా భాటియా, సుహైల్ నయ్యర్, ఆషిమ్ గులాటీ, అన్య సింగ్, హుస్సేన్ దలాల్, సంవేద సువాల్కా, సయన్ బెనర్జీ, మల్హర్ థాకర్ తదితరులు.
దర్శకుడు : అరుణిమ శర్మ
నిర్మాతలు: దినేష్ విజన్
సంగీతం : సచిన్ జిగర్
సినిమాటోగ్రఫీ: మహేంద్ర శెట్టి
ఎడిటర్: నేహా మెహ్రా, దీపికా కల్రా
సంబంధిత లింక్స్: ట్రైలర్
ప్రైమ్ వీడియో నుంచి వచ్చిన తాజా సిరీస్ జీ కర్దా. ఈ వెబ్ సిరీస్ ఓ రొమాంటిక్ డ్రామా. స్టార్ నటి తమన్నా భాటియా ప్రధాన పాత్రలలో ఒకరు. మరి ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం రండి.
కథ:
ఈ సిరీస్ ఏడుగురు స్నేహితులు లావణ్య సింగ్ (తమన్నా భాటియా), రిషబ్ (సుహైల్ నయ్యర్), అర్జున్ (ఆషిమ్ గులాటి), ప్రీత్ (అన్యా సింగ్), షాహిద్ (హుస్సేన్ దలాల్), శీతల్ (సంవేద సువాల్కా), మరియు మెల్రాయ్ (సాయన్ బెనర్జీ) మధ్య సాగుతుంది. ఈ ఏడుగురు చిన్నప్పటి నుంచి సన్నిహితులు. ఒకరోజు తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఒక జ్యోతిష్యుని దగ్గరకు వెళ్లారు. ఆ జ్యోతిష్కుడు ప్రతి ఒక్కరికీ జరగనున్న ముప్పు గురించి హెచ్చరిస్తాడు. నిజంగానే ఆ జ్యోతిష్కుడు చెప్పింది నిజమే అని నమ్మే కొన్ని సంఘటనలు జరుగుతాయి ?, ఇంతకీ ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ?, ఆ తర్వాత వీరి జీవితంలో ఏం జరిగింది ? అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
కొన్ని పాత్రల ద్వారా, జీ కర్దా మేకర్స్ కొన్ని సాధారణ జీవిత సమస్యలను చక్కగా ప్రస్తావించారు. ఆ సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సంఘర్షణలు ఈ సిరీస్ బాగానే డ్రైవ్ చేశాయి. ముఖ్యంగా ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో తన భర్త మరియు అత్తమామలతో కలిసి జీవిస్తున్న ఓ అమ్మాయికి ప్రశాంతమైన లైంగిక జీవితాన్ని గడపడం కష్టతరంగా మారితే ? అనే కోణంలో వచ్చే సీన్స్ బాగున్నాయి. అలాగే కొన్నేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వివాహం అడ్డంకిగా ఉంటుందా అని సందేహించే మరో అమ్మాయి మనోగతాన్ని కూడా బాగా చూపించారు.
మొత్తానికి సిరీస్ లోని పాత్రలకు సంబంధించి విషయాలను ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగుంది. అదేవిధంగా స్నేహితులతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సన్నివేశాలు కూడా బాగున్నాయి. షాహిద్‌గా నటించిన హుస్సేన్ దలాల్ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనైనా కలిసిపోయే వ్యక్తి. ఆ పాత్రలో అతని నటన బాగుంది. ఇది వెబ్ షో అయినప్పటికీ, సచిన్ జిగర్ కొన్ని అద్భుతమైన పాటలను స్వరపరిచారు, అవి బాగా ప్రభావాన్ని చూపుతాయి.
నటీనటుల విషయానికి వస్తే.. ప్రతి కళాకారుడు ప్రశంసనీయమైన పనితనం కనబర్చాడు. మెయిన్ గా తమన్నా అద్భుతంగా నటించింది. మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ సన్నివేశాల్లో తమన్నా విచ్చలవిడిగా నటించింది. సుహైల్ నయ్యర్, ఆషిమ్ గులాటీ, అన్యా సింగ్, హుస్సేన్ దలాల్, సంవేద సువాల్కా, సయన్ బెనర్జీ, మల్హర్ థాకర్ లు కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
కొన్ని కథలు సున్నితమైన అంశాలతో సాగాయి కాబట్టి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సిరీస్ ఆకట్టుకోదు. జీ కర్దా ఓ వర్గం ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని వచ్చింది. అందువల్ల ఇతర వర్గాలు దీనిని బోరింగ్‌గా భావించవచ్చు. మెల్రాయ్ క్యారెక్టర్ సిరీస్ కి కొత్తదనాన్ని తీసుకురాలేదు. పైగా ఫ్యామిలీ ప్రేక్షకులు బోల్డ్ కి సంబంధించిన సన్నివేశాలను చూడలేకపోవచ్చు.
అదే విధంగా కొన్ని పాత్రలు ఇంకా బెటర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. అన్య సింగ్ పోషించిన ప్రీత్ క్యారెక్టర్ మొదట్లో బాగానే ఉంది, కానీ షో ముందుకు సాగుతున్న కొద్దీ అది బలహీనపడటం మొదలవుతుంది. అలాగే స్క్రీన్‌ప్లే గతానికి, వర్తమానానికి మధ్య ఊగిసలాడుతూ ఉండడంతో డ్రామా స్టార్ట్ అయ్యే విధానం కాస్త గందరగోళంగా ఉంది. దీనికితోడు ఏ పాత్రలో ఎవరు నటిస్తారో అర్థం కావాలంటే కొంత సమయం పడుతుంది.
అలాగే సిరీస్ ముగిసే విధానం చాలా నిరాశపరిచింది. సరైన ముగింపు లేకుండా హఠాత్తుగా ముగించిన అనుభూతిని కలిగిస్తుంది. ఏడుగురు స్నేహితుల జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి చివరి వరకు వేచి ఉన్న వ్యక్తికి, ముగింపు బాగా నిరాశపరుస్తుంది.
సాంకేతిక వర్గం :
సచిన్ జిగర్ సంగీతం అద్భుతంగా ఉంది, పాటలు కాసేపు ప్రేక్షకుల మదిలో మెదులుతాయి. మహేంద్ర శెట్టి సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది, పాష్ లొకేషన్‌లు చాలా చక్కగా తీశారు. ఎడిటింగ్ బాగుంది, షో ఏ సమయంలోనూ నెమ్మదించదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకురాలు అరుణిమ శర్మ విషయానికి వస్తే, ఆమె జీ కర్దాతో పర్వాలేదు అనిపించింది. కొన్ని కథలు సాపేక్షంగా మరియు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, మరికొన్ని మరింత
మెరుగ్గా ఉండి ఉండాల్సింది.
తీర్పు:
మొత్తంమ్మీద, జీ కర్దా సిరీస్ లో కొన్ని బోల్డ్ సీన్స్, కొన్ని ఎమోషన్స్ ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే తమన్నా తన హాట్ నెస్ తో మెప్పించింది. మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు. కానీ, స్లో నేరేషన్, బోరింగ్ ప్లే, మెరుగైన ముగింపు లేకపోవడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా యూత్‌ఫుల్ డ్రామాలను ఇష్టపడే వారికీ జీ కర్దా కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
The post ఓటీటీ సమీక్ష: తమన్నా ‘జీ కర్దా’ – హిందీ వెబ్ సిరీస్ (ప్రైమ్ వీడియోలో ప్రసారం) first appeared on .