Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2256

సమీక్ష : సర్కిల్ –ఆకట్టుకోని రొమాంటిక్ థ్రిల్లర్

$
0
0
Circle Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 07, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్, నైనా

దర్శకుడు : నీలకంఠ

నిర్మాతలు: M.V. శరత్ చంద్ర, టి.సుమలత అన్నీత్ రెడ్డి, వేణుబాబు అడ్డగా

సంగీతం: NS ప్రసు

సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని

ఎడిటర్ : మధు రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో నటించిన సర్కిల్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

పుత్తూరు గణేష్ (బాబా భాస్కర్) కాంట్రాక్ట్ కిల్లర్ కాగా తను ప్రముఖ ఫోటోగ్రాఫర్ కైలాష్ (సాయి రోనక్)ని చంపాడానికి ఓ కాంట్రాక్ట్ తీసుకుంటారు. పుత్తూరు గణేష్‌కు ఒక ప్రిన్సిపుల్ ఉంది. దాని ప్రకారం అతను రెండు పార్టీలు (ఒకరు టార్గెట్ మరొకరు చంపమని చెప్పిన వారు) శాంతి ఒప్పందానికి వస్తే అతను చంపబోతున్న వ్యక్తిని విడిచేస్తాడు. పుత్తూరు గణేష్ తన ఇంట్లో కైలాష్‌ని చంపడానికి వస్తాడు మరియు అతని ప్రిన్సిపుల్ ప్రకారం అతనికి ఒక అవకాశం ఇస్తాడు. కైలాష్‌కి గతంలో అరుందతి (రిచా పనై), మాళవిక (నయన), హిమానీ రాజ్‌పుత్ (అర్షిన్ మెహతా) అనే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కైలాష్ తనని చంపడానికి పుత్తూరు గణేష్‌ని ఆ ముగ్గురిలో ఒకరు నియమించి ఉంటారని భావిస్తున్నాడు. అయితే అలా చంపమని చెప్పింది ఎవరు? చివరకు ఏం జరిగింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

సాయి రోనక్ తన నటనతో ఆకట్టుకున్నాడు మరియు మూడు లవ్ స్టోరీ ల కోసం సినిమాలో మూడు డిఫరెంట్ గెటప్ లలో కనిపించాడు. ఏం చేసినా తన కెరీర్‌ను మార్చుకోకూడదని మొండిగా ఉండే వ్యక్తిగా బాగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌ బాగున్నాయి.

నయన మరియు సాయి రోనక్ నటించిన రెండవ లవ్ ట్రాక్ డీసెంట్, షార్ట్ గా ఉంది. ఈ కథలో ప్రధాన జంట మధ్య కాన్ఫ్లిక్ట్ లాజికల్ గా మరియు నమ్మే విధంగా ఉంటుంది. పరిమిత పాత్రలో నయన బాగా నటించింది. నార్త్ ఇండియన్ అమ్మాయిగా అర్షిన్ మెహతా ఓకే. రిచా పనై హీరో కి మధ్యలో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ చిత్రంలో మూడు ప్రేమకథలు ఉన్నాయి, అవి స్క్రీన్ టైమ్‌లో దాదాపు ఎక్కువ భాగాన్ని తీసుకుంటాయి. రెండవది డీసెంట్ అయితే, మొదటి మరియు మూడవది చాలా బోరింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా మూడో ప్రేమకథ చాలా స్లో గా సాగుతుంది. సినిమాలోని హీరో పాత్ర, విభిన్న దశల్లో డిఫరెంట్ గా ప్రవర్తించడం జరుగుతుంది. హీరో పాత్రను డిజైన్ చేసిన విధానం అంతగా ఆకట్టుకోదు.

హీరోను ఎలిమినేట్ చేయడానికి కాంట్రాక్ట్ కిల్లర్‌ని ఎవరు నియమించారు అనే దానిపై సినిమా ఉంది. అందుకు గల కారణం చివరి నిమిషాల్లో మాత్రమే తెలుస్తుంది. అదెవరో తెలియడానికి చివరి వరకు ఓపికగా వేచి ఉండి, నిరాశ చెందుతారు చూసే ప్రేక్షకులు. చివర్లో చెప్పబడిన కారణం అస్సలు నమ్మశక్యంగా ఉండదు.

సినిమా అంతా కూడా క్లైమాక్స్ మీద ఆధారపడి ఉంది. కానీ అది చాలా బ్యాడ్ గా అనిపిస్తుంది. సిల్లీ గా ఉండే ట్విస్ట్ సినిమాలోని స్క్రీన్ ప్లే ను స్పాయిల్‌ చేసింది. సెకండాఫ్ అలా ఊరికే సాగిపోతుంది. కారణం లేకుండా సినిమా డ్రాగ్ అవుతుంది. మొదటి మరియు మూడో లవ్ స్టొరీ చాలా బోరింగ్ గా ఉన్నాయి. బాబా భాస్కర్ తన పాత్రలో బాగానే చేశాడు. కానీ అందులో లోపాలు ఉన్నాయి.

 

సాంకేతిక విభాగం:

 

ఎన్ఎస్ ప్రసు సంగీతం పర్వాలేదు. రంగనాథ్ గోగినేని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ టీమ్ సెకండాఫ్ ని బాగా ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

దర్శకుడు నీలకంఠ విషయానికి వస్తే, అతను సర్కిల్‌ చిత్రం తో అంతగా ఆకట్టుకోలేదు. అతని కోర్ పాయింట్ బాగానే ఉంది, కానీ అది చెప్పే విధానం అసలు బాగోలేదు. సరైన ఎమోషన్స్ లేని బోరింగ్ లవ్ స్టోరీ లతో సినిమా నిండిపోయింది. ఈ సినిమా థ్రిల్లర్ కాదు, రొమాంటిక్ డ్రామా కాదు.

 

తీర్పు:

 

మొత్తం మీద, సర్కిల్ సినిమా అంతగా ఆకట్టుకోదు. సినిమాలో డెప్త్ లేదు, సరైన ఎమోషన్స్ లేని బోరింగ్ లవ్ ట్రాక్‌లతో నిండి ఉంది. కోర్ పాయింట్ బాగానే ఉంది, కానీ చూపించిన విధానం ఆకట్టుకోదు. సాయి రోనక్ నటన, కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం మొత్తంగా నిరాశపరిచింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష : సర్కిల్ – ఆకట్టుకోని రొమాంటిక్ థ్రిల్లర్ first appeared on .

Viewing all articles
Browse latest Browse all 2256

Trending Articles