Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2206

సమీక్ష : ఓ సాథియా –రెగ్యులర్ ఎమోషనల్ డ్రామా!

$
0
0
O Saathiya Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 07, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్‌ భాస్కర్, అంబరీష్‌ అప్పాజి తదితరులు

దర్శకుడు : దివ్యభావన

నిర్మాతలు: సుభాశ్‌ కట్టా, చందన కట్టా

సంగీతం: విన్నూ వినోద్‌

సినిమాటోగ్రఫీ: ఈజె.వేణు

ఎడిటర్ : కార్తిక్ కట్స్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఆర్యాన్ గౌరా హీరోగా ఓ సాథియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఈ సినిమాని నిర్మించారు. దివ్యా భావన దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి.

 

కథ :

 

అర్జున్‌ (ఆర్యన్‌ గౌరా) బి.టెక్‌ స్టూడెంట్. కాలేజీలో కీర్తి (మిస్తీ చక్రవర్తి) ని చూసి ప్రేమలో పడతాడు. కీర్తి కూడా అర్జున్ అల్లరిని ఇష్ట పడుతుంది. వీరి మధ్య బాండింగ్ పెరుగుతుంది అనుకునే లోపే.. కీర్తి సడెన్ గా కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత అర్జున్ ఆమె కోసం హైదరాబాద్ లోని కీర్తి చదివే కాలేజీలోనే జాయిన్ అవుతాడు. కానీ, అప్పటికే కీర్తి, రాహుల్ అనే వ్యక్తితో లవ్ లో ఉంటుంది. అసలు ఈ రాహుల్ ఎవరు?, కీర్తికి ఏమవుతాడు?, నిజంగానే రాహుల్ – కీర్తి ప్రేమలో ఉన్నారా ? లేదా?, చివరకు అర్జున్ ప్రేమ గెలుస్తుందా ? లేదా? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

చిన్న ప్రేమ కథలో బలమైన భావోద్వేగాలతో సాగిన ఈ ఓ సాథియాలో బరువైన ప్రేమ కథ ఉంది. ఎమోషనల్ గా సాగే గుడ్ లవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్‌ కూడా బాగున్నాయి. అదే విధంగా నటీనటుల పనితీరు, నిర్మాణ విలువలు, కెమెరా వర్క్, పాటలు సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన ఆర్యన్‌ గౌరా పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిస్తీ చక్రవర్తి పాత్ర.. ఆమె జీవితంలో ఆమె ప్రేమకు ఎదురైన అడ్డంకులు, మరియు హీరో హీరోయిన్ల మధ్య సంఘర్షణ.. ఇలా మొత్తానికి ‘ఓ సాథియా’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా లవ్ టోన్ తో సాగే ఎమోషనల్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఆర్యన్‌ గౌరా తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి కూడా ఈ సినిమాలో బాగానే నటించింది. అలాగే కీలక పాత్రల్లో నటించిన దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, చైతన్య గరికపాటి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ ఎమోషనల్ డ్రామాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకురాలు దివ్యభావన బాగా తీశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే కంటెంట్ తో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ ‘ఓ సాథియా’ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ జనరేషన్ లో ఇలాంటి ప్రేమ కథలను చూడటానికి మెజార్టీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారా అనేది కూడా డౌటే.

అయితే, దర్శకురాలు దివ్యభావన పనితనం, హీరో ఆర్యన్‌ గౌరా నటన సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని సెంటిమెంట్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఓవరాల్ గా అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే సినిమా బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు విన్నూ వినోద్‌ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ ఈజె.వేణు వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాతలు సుభాశ్‌ కట్టా, చందన కట్టా పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు:

 

‘ఓ సాథియా’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని బరువైన భావోద్వేగాలు, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, కథ కథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా.. లవర్స్ కి యూత్ కి కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

The post సమీక్ష : ఓ సాథియా – రెగ్యులర్ ఎమోషనల్ డ్రామా! first appeared on .

Viewing all articles
Browse latest Browse all 2206

Trending Articles