Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2205

సమీక్ష: పిజ్జా 3 –ది మమ్మీ –రొటీన్ రివెంజ్ డ్రామా

$
0
0
Pizza3 Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 18, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు, గౌరవ్ నారాయణన్, అభిషేక్ శంకర్, కాళీ వెంకట్, అనుపమ కుమార్

దర్శకుడు : మోహన్ గోవింద్

నిర్మాత: సివి కుమార్

సంగీతం: అరుణ్ రాజ్

సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్

ఎడిటర్: ఇగ్నేషియస్ అస్విన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

పిజ్జా సిరీస్‌లో మూడవ చిత్రం అయిన పిజ్జా 3: ది మమ్మీ యొక్క తెలుగు వెర్షన్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహన్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

 

కథ:

 

నలన్ (అశ్విన్ కాకుమాను) ఒక రెస్టారెంట్ ను కలిగి ఉంటాడు. అతను కయల్ (పవిత్ర మరిముత్తు) కోసం తలదాచుకున్నాడు. కయల్ ఒక యాప్ డెవలపర్, ఆత్మలతో కమ్యూనికేట్ చేయగల యాప్‌ను రూపొందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కయల్ సోదరుడు ప్రేమ్ (గౌరవ్ నారాయణన్) పోలీసు అధికారి, అతనికి నలన్ అంటే ఇష్టం ఉండదు. అకస్మాత్తుగా, రెస్టారెంట్‌లో కొన్ని రహస్యమైన విషయాలు జరగడం ప్రారంభం అవుతాయి.

వంటగదిలో ప్రతిరోజూ ఒక స్వీట్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ వంటకాన్ని తయారు చేసింది నలన్ అని రెస్టారెంట్ సిబ్బంది నమ్ముతారు. కానీ ఆ వంటకం గురించి ఎలాంటి ఆధారం లేని నలన్ వంటగదిలో ఒక దుష్టశక్తిని చూడటం ప్రారంభిస్తాడు. తరువాత ఏం జరిగింది? వంటగదిలో ఆత్మ ఎందుకు దాక్కుంటుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్:

 

సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది. థ్రిల్లింగ్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సినిమా మొదట్లో స్లో నోట్‌ గా మొదలైనప్పటికీ, ఆసక్తికరమైన అంశాలతో వేగం పుంజుకుంటుంది. కథానాయకుడు మరియు అతని సిబ్బంది పారానార్మల్ యాక్టివిటీని ఎక్స్ పీరియన్స్ చేసే సన్నివేశాలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని హత్యలు జరుగుతాయి. వాటిని చాలా బాగా చిత్రీకరించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల ప్రభావాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషించింది. అశ్విన్ కాకుమాను సినిమాలో చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విభిన్నమైన భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించాడు.

హీరోయిన్ పవిత్రా మరిముత్తు తన స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ చక్కగా నటించింది. పోలీసుగా గౌరవ్ బాగా యాక్ట్ చేశాడు. కాళీ వెంకట్ మరియు అభి నక్షత్ర వారి వారి పాత్రలలో అలరించారు. మేకర్స్ అనవసరమైన లవ్ సాంగ్స్ ను సినిమాలో జోడించలేదు.

 

మైనస్ పాయింట్స్:

 

ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉండగా, సెకండ్ హాఫ్ అటెన్షన్‌ని గ్రాబ్ చేయడం లో విఫలమైంది. హర్రర్ సన్నివేశాలు, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కారణంగా ఫస్ట్ హాఫ్ చాలా ఆకట్టుకుంది, అయితే దుష్ట ఆత్మ యొక్క నేపథ్యాన్ని బహిర్గతం చేయడంతో సినిమా ఉత్కంఠభరితంగా మారుతుంది.

అనేక ఇతర హారర్ చిత్రాల మాదిరిగానే, ఇక్కడ పిజ్జా 3లో కూడా, ఒక కుటుంబంను చంపడం జరుగుతుంది. వారి ఆత్మలు తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరాయి. కాబట్టి బ్యాక్‌స్టోరీ ప్రారంభమైన సన్నివేశం నుండి, చివరికి ఏమి జరుగుతుందో మనం ముందే ఊహించవచ్చు.

ఈ హారర్ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా మార్చడానికి మేకర్స్ ఇక్కడే కొన్ని మలుపులు మరియు థ్రిల్‌లను తీసుకురావాలి. అలాగే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా కాస్త సాగదీశాయి. రొటీన్ సెకండ్ హాఫ్ మరియు బ్యాడ్ క్లైమాక్స్ సినిమా కి మైనస్ గా మారాయి అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం:

 

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అరుణ్ రాజ్ ఇంపాక్ట్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి ప్రభు రాఘవ్ కూల్ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఎడిటింగ్ సెకండాఫ్‌లో ఇంకా బాగుండేది.

దర్శకుడు మోహన్ గోవింద్ విషయానికి వస్తే, అతను పిజ్జా 3తో పర్వాలేదు అని అనిపించుకున్నాడు. అతను ఒక హారర్ నేపథ్యం లోని కథను తీసుకున్నాడు. కొన్ని థ్రిల్స్ జోడించి ఆడియెన్స్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ బాగానే వర్కౌట్ అయినా, చివరికి సినిమా మరో రివెంజ్ డ్రామాగా అంతగా ఆకట్టుకోలేదు.

 

తీర్పు:

 

మొత్తం మీద ఈ పిజ్జా 3 ది మమ్మీ అనే సినిమా కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్‌లను కలిగి ఉంది. రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా పర్వాలేదు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో రొటీన్ ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్‌లు రావడం తో థ్రిల్ ను, సస్పెన్స్ ను కిల్ చేసినట్లు అనిపిస్తుంది. అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు మరియు ఇతరులు బాగా నటించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కాకపోతే, ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఈ చిత్రంలో కొత్తదనం ఏమీ లేదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష: పిజ్జా 3 – ది మమ్మీ – రొటీన్ రివెంజ్ డ్రామా first appeared on .

Viewing all articles
Browse latest Browse all 2205

Trending Articles