
విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, మధు, శుభలేఖ సుధాకర్, ఆదిత్య మీనన్ తదితరులు.
దర్శకుడు : దయానంద్
నిర్మాత: రవి కస్తూరి
సంగీత దర్శకుడు: అభిషేక్ ఏ ఆర్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటింగ్: వంశీ అట్లూరి
సంబంధిత లింక్స్: ట్రైలర్
అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించిన తాజా సినిమా గేమ్ ఆన్. ఈ మూవీలో గీతానంద్ హీరోగా నటించగా నేహా సోలంకి హీరోయిన్ గా నటించారు. మరి నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.
కథ :
సిద్దార్థ (గీతానంద్) అతని గర్ల్ ఫ్రెండ్, ఎంప్లాయర్, ఫ్రెండ్ ల దృష్టిలో లూజర్ గా మిగిలిపోతాడు. ఇక ఈ ఘటనలతో అతడు సూసైడ్ చేసుకోవాలని భావిస్తాడు. అయితే అదే సమయంలో అతడికి ఒక ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ కాల్ రావడంతో అతడి జీవితం మారిపోతుంది. అతడికి కొన్ని టాస్కులు పూర్తి చేయమని కొందరి నుండి పేమెంట్ అందుతుంది. అయితే అది ఒక రియల్ గేమ్ అని అలానే అందులో కొన్ని రూల్స్ కూడా ఉంటాయని వారు చెప్తారు. ఈ గేమ్ టైం లో తార (నేహా సోలంకి) అతడి జీవితంలోకి వచ్చి అతడిని ప్రేమిస్తుంది. మరి ఆ రియల్ గేమ్ సిద్దార్థ యొక్క లైఫ్ ని ఏ విధంగా మార్చింది, అనంతరం ఏమి జరిగింది అనేది మొత్తం మనం సినిమాలో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీ కి నటుడు గీతానంద్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా పలు సన్నివేశాల్లో అతడి యాక్టింగ్ ఎంతో బాగుంది. ముందు యువకుడిగా ఆ తరువాత స్ట్రాంగ్ మ్యాన్ గా మారడానికి అతడు పడిన తపన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడి డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో బాగుంది. ఫ్లాష్ బ్యాక్ చిన్నదే అయినప్పటికీ కథ ముందుకు సాగడానికి అది హెల్ప్ చేస్తుంది. సెకండ్ హాఫ్ కొన్ని కీ సీన్స్ తో ఆకట్టుకునే రీతిన సాగుతుంది. హీరోయిన్ నేహా సోలంకి తన పాత్ర యొక్క పరిధి మేరకు అందరినీ అలరించారు. నటుడు ఆదిత్య మీనన్, మరొక సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ ఇద్దరూ కూడా అలరించారు.
మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరికీ కూడా కొరియన్ షో స్క్విడ్ గేమ్ ని గుర్తు చేస్తుంది. అయితే అది పెద్ద సమస్య కాదు గాని, ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే తోనే సమస్య. హీరో పెర్ఫార్మన్స్ తప్ప ఫస్ట్ హాఫ్ మొత్తం పెద్దగా ఆకట్టుకోదు. మొత్తంగా సినిమాలో మూడు ట్విస్ట్ లు ఉన్నప్పటికీ కూడా అవి సినిమాలో ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు ఊహాజనితంగా ఉంటాయి. ఇక మధుబాల పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేదు. క్లైమాక్స్ సీన్స్ బాగానే ఉంటాయి. కొన్ని విజువల్స్ అయితే ఇరిటేషన్ తెప్పిస్తాయి.
సాంకేతిక వర్గం :
ఏ ఆర్ అభిషేక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా సినిమా డౌన్ లో ఉన్నప్పుడు అతడి స్కోర్ మనకు రిలీఫ్ అందిస్తుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో గేమ్ ఆన్ మూవీ విజువల్స్ ది బెస్ట్ అని చెప్పాలి. అరవింద విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విభాగం మరింతగా పనిచేయాల్సింది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ విషయంలో. ఇక మేకర్స్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనకు స్క్రీన్ పై కనపడుతుంది. దర్శకుడు దయానంద్ మూవీని మంచి స్టైలిష్ థ్రిల్లర్ గా తీయాలని భావించారు కానీ అందుకోసం మరింత కష్టపడాల్సింది. అలానే ట్విస్ట్ ల విషయంలో కూడా ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే బాగుండేది.
తీర్పు :
మొత్తంగా గీతానంద్ నటించిన గేమ్ ఆన్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా సెకండ్ హాఫ్ లో పర్వాలేదనిపించే సీన్స్ తో సాగుతుంది. ముఖ్యంగా గీతానంద్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ప్రధాన బలం. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో అతడి నటన మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే డల్ గా సాగె ఫస్ట్ హాఫ్, పెద్దగా ఆకట్టుకోని ట్విస్ట్ లు సినిమాని సాదాసీదాగా అనిపించేలా చేస్తాయి.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష : గేమ్ ఆన్ – కొన్ని సీన్స్ కోసం మాత్రమే first appeared on Latest Telugu Movie reviews, Tollywood Movies Updates in Telugu, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews and Ratings.