Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2236

సమీక్ష: “35 –చిన్న కథ కాదు”–మెప్పించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

$
0
0
35-Chinna Katha Kaadu Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 06, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: నివేతా థామస్, విశ్వదేవ్ రాచకొండ, మాస్టర్ అరుణ్ దేవ్, మాస్టర్ అభయ్ శంకర్, గౌతమి, ప్రియదర్శి.

దర్శకుడు: నంద కిషోర్ ఇమాని

నిర్మాతలు : సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి

సంగీత దర్శకుడు: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి

ఎడిట‌ర్ : టీసీ ప్రసన్న

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈవారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్ నివేతా థామస్ అలాగే నటుడు విశ్వదేవ్ రాచకొండ కాంబినేషన్ లో దర్శకుడు నందకిషోర్ తెరకెక్కించిన చిత్రం “35 చిన్న కథ కాదు” డీసెంట్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. తిరుపతిలో ఒక చిన్నపాటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సత్య ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) అలాగే తన భార్య సరస్వతి (నివేత థామస్) వారి ఇద్దరి పిల్లలు అరుణ్ (అరుణ్ దేవ్ పోతుల) వరుణ్ (అభయ్ శంకర్) లు కలిసి ఎలాంటి చేకూ చింత లేకుండా ఒక హ్యాపీ లైఫ్ ని సాగిస్తారు. తమ ఇద్దరి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇద్దరు తల్లిదండ్రులు అహర్నిశలు తాపత్రయ పడతారు. అయితే వారి పిల్లల్లో అరుణ్ వేసే ప్రశ్నలు చాలా లాజిక్ గా సమాధానం దొరికేలా లేకుండా ఉంటాయి. దీనితో లెక్కల సబ్జెక్టులో తాను వెనకబడతాడు. మరి లెక్కల సబ్జెక్టు మూలాన తన జీవితంలో తన తల్లి సరస్వతి జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? ఆ లెక్కల సబ్జెక్టులో మినిమమ్ 35 మార్కులతో అరుణ్ పాస్ అవ్వాలనే సందర్భం ఎలా వస్తుంది? చివరికి ఈ కథ ఎలా సుఖాంతం అయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం ఖచ్చితంగా తెలుగు ఆడియెన్స్ కి చాలా కాలం తర్వాత ఒక ‘మంచి’ సినిమా చూసాం అనే భావన తప్పక కలిగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా కథనం మొదలైన మొదటి నిమిషం నుంచి ఇంపైన నేపథ్య సంగీతం, తిరుపతి వాతావరణం అంతా చాలా రిఫ్రెషింగ్ గా ఆహ్లదంగా కనిపిస్తాయి. మరి వీటికి తగ్గట్టుగానే సినిమాలో కూడా ఆద్యంతం వినోదాత్మకంగా నడుస్తుంది.

ముఖ్యంగా చిన్న పిల్లల నడుమ స్కూల్ సన్నివేశాలు అన్నీ మంచి హాస్యాన్ని పండిస్తాయి. అలాగే సినిమాలో సెకండాఫ్ చూసే వీక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది అని చెప్పాలి. ఇక నటీనటుల్లో అయితే ఎవరికి వారే అద్భుతమైన అద్భుతమైన పెర్ఫామెన్స్ లను అందించారు. బాలయ్య నటులు అరుణ్ నుంచి సీనియర్ నటి గౌతమి వరకు ఎంతో డీసెంట్ పెర్ఫామెన్స్ ని అందించారు.

ఇక ముఖ్య పాత్రధారిణి నివేత థామస్ కోసం మాట్లాడుకోవాలి. తన పాత్రలో నివేత చక్కగా ఒదిగిపోయింది.. ఇంట్లో పనులు చేస్తూ ఓ గృహిణిగా భర్త కోసం తాపత్రయపడే భార్యగా పిల్లల భవిష్యత్తుకు ఆరాటపడే తల్లిగా ఇలా అన్ని కోణాల్లో నివేతా థామస్ తనలోని నటిని అద్భుతంగా చూపించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో తనపై ప్రతి సీన్ బాగుంది. తన కొడుకుతో సంఖ్య ’10’ కోసం చెప్పే డైలాగ్ అయితే సినిమాలో వావ్ అనిపించేలా ఎగ్జైట్ చేస్తుంది అని చెప్పాలి.

మరి తనకి భర్తగా నటించిన యువ నటుడు విశ్వదేవ్ మంచి నటన కనబరిచాడు. తాను పలికే ప్రతి డైలాగ్ సినిమాలో అర్ధవంతంగా అనిపిస్తాయి. ఇంకా నటుడు ప్రియదర్శి కొంచెం నెగిటివ్ కోణంలో కనిపించి ఆకట్టుకుంటాడు. కొన్ని సీన్స్ లో తన హావభావాలు చాలా బాగున్నాయి. ఇక సినిమాలో కనిపించే బాల్య నటులు అరుణ్, అభయ్ సహా ప్రతీ ఒక్కరూ ఎంతో సహజ నటనతో తమ రోల్స్ ని అద్భుతంగా రక్తి కట్టించారు. ఇంకా సినిమాలో కదిలించే ఎమోషన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మొదటిసగం కథనం కొంచెం నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. అలాగే మలిసగంలో కూడా ఒకటి రెండు చోట్ల కొంచెం స్లో భావన కలుగుతుంది. అలాగే సినిమాలో మూల కథ సింపుల్ గానే అనిపిస్తుంది. దీనితో మరీ ఎక్కువ కొత్తదనం కోరుకునేవారు కొంచెం నిరాశ చెందవచ్చు.

ఇంకా నటి గౌతమి పాత్రని ఇంకాస్త ఎమోషనల్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే సినిమాలో కొన్ని కొన్ని చోట్ల మరింత ఎమోషన్స్ ని పండించే ప్రయత్నం చేయాల్సింది. ముఖ్యంగా అరుణ్, నివేత థామస్ నడుమ సెకండాఫ్ లో కనిపించే లాంటి సీన్స్ కొంచెం ముందు నుంచే ఉండుంటే ఇంకాస్త బెటర్ ఫీల్ కలిగి ఉండేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో సురేష్ ప్రొడక్షన్స్ వారి సమర్పణలో వచ్చిన ఈ చిత్రం నిర్మాణ విలువలు బాగున్నాయి. వారి నుంచి ఇది మరో మంచి సినిమా అని చెప్పవచ్చు. మరి ఈ చిత్రానికి మళ్ళీ వివేక్ సాగర్ తన మార్క్ మ్యూజిక్ ని అందించి మైమరపించాడు. పాటలు నేపథ్య గీతం రెండిటిలో కూడా తన మార్క్ ట్యూన్స్ తో సినిమాకి అదనపు బలం అయ్యాడు. ఇంకా నికేత్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం చాలా బాగుంది. చాలా వరకు సహజమైన విజువల్స్, తిరుపతి ప్రాంతాన్ని అందంగా చూపించాడు. టీసీ ప్రసన్న ఎడిటింగ్ కూడా నీట్ గానే ఉంది.

ఇక దర్శకుడు నందకిషోర్ ఇమాని విషయానికి వస్తే.. తను ఈ చిత్రానికి అందించిన పనితనం ఆకట్టుకుంటుంది. అందరికీ తెలిసిన లైన్ నే పట్టుకున్నప్పటికీ దానిని తెరకెక్కించిన విధానంకి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. ఇంపైన భావిద్వేగాలు, మంచి కామెడీ సీన్స్, నటీనటుల నుంచి ఏ మోస్తరు నటన రాబట్టాలో ఇలా అన్నిటిలో తన పనితనం మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “35 చిన్న కథ కాదు” అనేది నిజంగా చిన్న కథేమీ కాదని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లే ప్రతి ఒక్కరిని ఈ చిత్రం మెప్పిస్తుంది. అలాగే చాలా రోజుల తర్వాత ఈ భారీ, భారీ చిత్రాలు నడుమ ఒక చిన్న సింపుల్ తెలుగు సినిమా చూసాం అనే భావన ఈ చిత్రం కలిగిస్తుంది. చిన్న చిన్న పొరపథ్యాలు ఉన్నాయి కానీ వాటిని పక్కన పెడితే ఈ వారాంతానికి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైనర్ గా అయితే ఈ చిత్రం మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష: “35 – చిన్న కథ కాదు” – మెప్పించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2236

Trending Articles