Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2225

సమీక్ష : ప్రేమిస్తావా –రొటీన్ గా సాగే లవ్ ఎమోషనల్ డ్రామా !

$
0
0

Premistava Movie Review In Telugu

విడుదల తేదీ : జనవరి 31, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ఆకాశ్‌ మురళి, అదితి శంకర్‌, ఖుష్బూ సుందర్, శరత్ కుమార్ తదితరులు.

దర్శకుడు : విష్ణువర్ధన్‌

నిర్మాత : గ్జావియర్ బ్రిట్టో

సంగీతం : యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం : ఎరిక్ బ్రైసన్

కూర్పు : శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఆకాశ్‌ మురళి, అదితి శంకర్‌ జంటగా విష్ణువర్ధన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమిస్తావా’. తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై చక్కటి ప్రజాధరణ పొందింది. కాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అర్జున్ (ఆకాశ్‌ మురళి), దియా (అదితి శంకర్‌) కాలేజీ నుంచే ప్రేమలో ఉంటారు. అయితే అర్జున్ ను ప్రేమించినా నచ్చకపోతే వదిలేస్తాను అంటుంది దియా. కానీ, చదువు పూర్తి అయ్యి, జాబ్ లో జాయిన్ అయ్యాక కూడా ఇద్దరూ కలిసే ఉంటారు. కెరీర్ పై సీరియస్ గా ఉండే దియాకి, అర్జున్ కెరీర్ ను లైట్ తీసుకోవడం నచ్చదు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ – దియా మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. దియా పోర్చుగల్ వెళ్తుంది. అయితే, పోర్చుగల్ లో దియా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఇంతకీ, దియా నిజంగానే ఆ హత్య చేసిందా ?, జైల్లో ఉన్న దియా కోసం అర్జున్ ఏం చేశాడు ?, అసలు హత్య ఎవరు చేశారు ?, ఆ హత్య వెనుక ఉన్న కథ ఏమిటి ?, చివరకు అర్జున్ – దియా ఒక్కటి అయ్యారా? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

లవ్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలతో సాగిన ఈ ప్రేమిస్తావా సినిమాలో బరువైన ప్రేమ కథ ఉంది. ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్‌ కూడా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో ఆకాశ్‌ మురళి పోషించిన ప్రధాన పాత్ర అయిన అర్జున్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు సీన్స్.. ముఖ్యంగా దియా పాత్ర.. ఇలా మొత్తానికి ఈ సినిమా కాన్సెప్ట్ అండ్ కొన్ని ప్రేమ సన్నివేశాల పరంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఆకాశ్‌ మురళి తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు.

అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అదితి శంకర్‌ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. తన నటనతో ఆమె ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరో కీలక పాత్రలో నటించిన ఖుష్బూ సుందర్ తన నటనతో మెప్పించారు. శరత్ కుమార్ కూడా మరో కీలక పాత్రలో చాలా బాగా నటించాడు. ఇక ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. క్రైమ్ టచ్ చేస్తూ విష్ణువర్ధన్‌ రాసుకున్న లవ్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాలను ఆయన చాలా బాగా తెరకెక్కించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘ప్రేమిస్తావా’ సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు కొన్ని చోట్ల తడబడ్డాడు. కాకపోతే, ప్రేమ కథలో క్రైమ్ టచ్ ఇచ్చి.. కొన్ని కీలక సన్నివేశాలను బాగానే తెరకెక్కించారు. హీరో పాత్రను ఇంకా ఎఫెక్టివ్ గా రాసుకోవాల్సింది. అలాగే, కథలో చాలా చోట్ల బలమైన కాన్ ఫ్లిక్ట్ ను ఎస్టాబ్లిష్ చేయాల్సింది. హీరోయిన్ జైల్లో ఉంది అనే పాయింట్ నే చూపిస్తూ కథలో సీరియస్ నెస్ తెచ్చే ప్రయత్నం చేసినా అది ఆశించిన స్థాయిలో లేదు.

అయితే, దర్శకుడు విష్ణువర్ధన్‌ పనితనం, నటీనటుల నటన సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… కథనంలో కొత్తదనం లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగాయి. మొత్తమ్మీద ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నా.. కొన్ని చోట్ల రోటీన్ ప్లేతో బోరింగ్ లవ్ డ్రామాగా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ ఎరిక్ బ్రైసన్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. సినిమాలో నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దర్శకుడు విష్ణువర్ధన్‌ పనితనం బాగుంది.

తీర్పు :

‘ప్రేమిస్తావా’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. కొన్ని బరువైన భావోద్వేగాలు, కొన్ని లవ్ సీన్స్ బాగున్నాయి. ఐతే, కథనం కొన్ని చోట్ల స్లోగా సాగడం, మరియు కొన్ని రోటీన్ లవ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో నటీనటుల నటనతో పాటు ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష : ప్రేమిస్తావా – రొటీన్ గా సాగే లవ్ ఎమోషనల్ డ్రామా ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2225

Trending Articles