Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2231

సమీక్ష : లైలా –సిల్లీగా సాగే బోరింగ్ కామెడీ డ్రామా !

$
0
0

Laila Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు :విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ, కమెడియన్ పృథ్వి, అభిమన్యు సింగ్, బబ్లూ పృథ్వీ రాజ్ తదితరులు.

దర్శకుడు :రామ్ నారాయణ్

నిర్మాత :సాహు గారపాటి

సంగీతం :లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ :రిచర్డ్ ప్రసాద్

ఎడిటర్ :సాగర్ దాడీ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేస్తూ ప్రయోగం చేసిన సినిమా లైలా. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

కథ :

సోను (విశ్వక్‌సేన్) బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. ఆ ఏరియాలో సోను బ్యూటీ పార్లర్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అతనితో మేకప్ వేయించుకోవడానికి లేడీస్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి సోను జీవితంలోకి జెన్నీ (ఆకాంక్ష శర్మ) ఎంటర్ అవుతుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే సోను ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సోను అమ్మాయిగా గెటప్ వేసుకోవాల్సి వస్తోంది. అసలు సోను ఎందుకు హైడ్ అవ్వాల్సి వస్తోంది ?, ఇంతకీ సోనుకి వచ్చిన సమస్య ఏమిటి ?, ఆ సమస్య నుంచి సోను బయట పడ్డాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

కథ సెటప్ అండ్ విశ్వక్ సేన్ లేడీ గెటప్, ఆ గెటప్ కారణంగా వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, లవ్ సీన్స్ మరియు పెళ్లి సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో బాగా నటించాడు. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన అభిమన్యు సింగ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అభిమన్యు సింగ్ పాత్ర పై వచ్చే కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.

హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ తో అలరించింది. హీరోతో సాగే ఆమె లవ్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా బాగున్నాయి. విలన్ గా బబ్లూ పృథ్వీ రాజ్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. ప్రధాన పాత్రల మధ్య వచ్చే పంచ్ లు అండ్ కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు రామ్ నారాయణ్ కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్ తో సాగితే బాగుండేది. కానీ, సెకండ్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫన్ ఎలిమెంట్స్.. ఫస్ట్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకి మైనస్ అయ్యింది.

హీరోహీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే లేడీ గెటప్ ఎంట్రీ ఇచ్చాక వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాడు. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. సెకండ్ హాఫ్ నిజంగానే కొన్ని చోట్ల ఫన్ తో సాగింది. ఆ ఫన్ ను కూడా దర్శకుడు సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయాడు. ఓవరాల్ గా ఈ లైలా చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నా.. పూర్తి స్థాయిలో సినిమా ఆకట్టుకోదు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ సాగర్ దాడీ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాత సాహు గారపాటి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. రామ్ నారాయణ్ దర్శకత్వం బాగున్నా.. స్క్రిప్ట్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.

తీర్పు :

‘లైలా’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, లేడీ గెటప్ తాలూకు కొన్ని ఫన్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఐతే, రెగ్యులర్ స్క్రీన్ ప్లే, మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.
123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

The post సమీక్ష : లైలా – సిల్లీగా సాగే బోరింగ్ కామెడీ డ్రామా ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2231

Trending Articles