Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2258

ఓటీటీ సమీక్ష : ఆజాద్ –నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ చిత్రం

$
0
0

Azaad Hindi Movie Review In Telugu

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మార్చి 14, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అజయ్ దేవ్గన్, డయానా పెంటీ, ఆమన్ దేవ్గన్, రషా తడాని తదితరులు
దర్శకుడు :అభిషేక్ కపూర్
నిర్మాతలు : రానీ స్క్రూవాలా, ప్రగ్యా కపూర్
సంగీతం : అమిత్ త్రివేది
ఛాయాగ్రహణం : సత్యజిత్ పాండే
ఎడిటింగ్ :చందన్ అరోరా

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్, డయానా పెంటీ, ఆమన్ దేవ్గన్, రషా తడాని ముఖ్య పాత్రల్లో దర్శకుడు అభిషేక్ కపూర్ తెరకెక్కించిన చిత్రం ‘ఆజాద్’. బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1920ల కాలంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో ఈ కథ సాగుతుంది. గుర్రపు శాలలో పనిచేసే గోవింద్(ఆమన్ దేవ్గన్) తన యజమాని కూతురు జానకి(రషా తడాని) కారణంగా అడవిలోకి పారిపోతాడు. అక్కడ విక్రమ్ సింగ్(అజయ్ దేవ్గన్) అనే రెబల్ నాయకుడిని కలుసుకుంటాడు. వారి బృందంలో ఉంటూ గుర్రపు స్వారి నేర్చుకోవాలని గోవింద్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విక్రమ్ సింగ్‌కు ఎంతో ఇష్టమైన తన గుర్రం ‘ఆజాద్’పై సవారీ చేయాలని గోవింద్ భావిస్తాడు. ఈ క్రమంలో జరిగే ఓ ఘటనలో విక్రమ్ సింగ్ మృతి చెందుతాడు. ఆ తర్వాత గోవింద్, ఆజాద్‌ల మధ్య ఎలాంటి బంధం ఏర్పడుతుంది..? అసలు గోవింద్ అడవికి ఎందుకు పారిపోయాడు..? జానకితో అతడికి ఎలాంటి బంధం ఉంటుంది..? ఆజాద్‌ను గోవింద్ సవారీ చేస్తాడా లేదా..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఆజాద్ సినిమా కథ గుర్రంపై సాగుతుండటం కొంతమేర ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం. ఇలాంటి కథకు కోర్ పాయింట్ బలంగా ఉంటే ఫలితం వేరే లెవెల్‌కు వెళ్లేది. ఇక అజయ్ దేవ్గన్ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆమన్ దేవ్గన్, రషా తడాని తమ డెబ్యూ చిత్రం అయినా, చక్కటి ప్రతిభను కనబరిచారు. కథలో మంచి ఎమోషన్ ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు.

సంగీతం పరంగా కూడా ఒకట్రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. 1920 కాలం నాటి పరిస్థితులను చక్కగా చూపెట్టారు. సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి పీరియాడిక్ డ్రామా చిత్రాల్లో కథే సినిమాకు బలం అని చెప్పాలి. గుర్రంపై కథను నడిపించాలంటే దాన్ని ప్రజెంట్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఈ సినిమాలో ఏ కోశాన సినిమా కథ ఆసక్తికరంగా సాగదు. స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు ఏమాత్రం జాగ్రత్త వహించలేదని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.

ఇక నటీనటుల విషయంలోనూ అజయ్ దేవ్గన్ తప్ప పెద్దగా గుర్తుపట్టే వారు ఎవరూ లేకపోవడం మైనస్. డయానా పెంటీ ఉన్నప్పటికీ ఆమె పాత్ర ఏమాత్రం ప్రభావం చూపదు. కొత్తవారైనా ఆమన్, రషా తమ వంతుగా పూర్తి ప్రయత్నం చేశారు. కానీ, కథలో దమ్ములేనప్పుడు ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టినా అది వృథానే అవుతుంది. ఈ సినిమాలో కూడా అదే జరిగింది.

ఈ సినిమా నెరేషన్ చాలా స్లోగా సాగడంతో ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అవుతారు. మంచి కోర్ పాయింట్ ఉండి ఉంటే, ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఇక ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ కూడా పెద్దగా ఉపయోగపడలేదని చెప్పాలి.

సాంకేతిక వర్గం :

దర్శకుడు అభిషేక్ కపూర్ ఎంచుకున్న కథ మంచిదే అయినా, దాని కోసం ఆయన నడిపిన డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. స్క్రీన్ ప్లే విషయంలోనూ దర్శకుడు చాలా జాగ్రత్త పడాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సంగీతం పర్వాలేదనిపించింది. అయితే, ఎడిటింగ్ వర్క్‌పై చిత్ర యూనిట్ ఇంకా ఫోకస్ పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, ‘ఆజాద్’ సినిమా కథపై మరికాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్, ఆమన్ దేవ్గన్, రషా తడానిల పర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకుంటాయి. అయితే, రొటీన్ డ్రామా, బోరింగ్ స్క్రీన్ ప్లే, స్లో నేరేషన్ వంటి అంశాల వల్ల ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మంచి ఎంగేజింగ్ కంటెంట్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను స్కిప్ చేయవచ్చు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

The post ఓటీటీ సమీక్ష : ఆజాద్ – నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ చిత్రం first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2258

Trending Articles