Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2225

సమీక్ష : గుడ్ బ్యాడ్ అగ్లీ –కొన్నిచోట్ల ఆకట్టుకునే వైల్డ్ యాక్షన్ డ్రామా!

$
0
0

Good Bad Ugly Telugu Movie Review

విడుదల తేదీ : ఏప్రిల్ 10, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, సునీల్ తదితరులు.
దర్శకుడు : అధిక్ రవిచంద్రన్
నిర్మాణం: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : అభినందన్ రామానుజం

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

అజిత్ కుమార్ నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్) మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ స్టర్. అయితే, తన భార్య (త్రిష) కోసం, తన కొడుకు కోసం ఏకే అన్ని వదిలేసి.. జైలుకు వెళ్తాడు. కానీ తన గతం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఏకే కొడుకు సమస్యలో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఏకే తన కొడుకు కోసం ఏం చేశాడు ?, అసలు ఏకే కొడుకుని టార్గెట్ చేసింది ?. ఇంతకీ ఏకే గతం ఏమిటి ?, త్రిష పై పగబట్టిన గ్యాంగ్ ఏది ?, చివరకు ఏకే ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ గుడ్ బ్యాడ్ అగ్లీలో లార్జర్ దేన్ గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్లో అజిత్ కుమార్ చాలా వైల్డ్ గా కనిపించారు. పవర్ ఫుల్ పాత్ర‌లో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆయన ఆకట్టుకున్నాడు. తన అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే తన క్యారెక్టరైజేషన్ అండ్ మాడ్యులేషన్ తో అజిత్ కుమార్ తన పాత్రకు పర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో అజిత్ కుమార్ కొత్త లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ అర్జున్ దాస్. ఆయన ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో అర్జున్ దాస్ నటన చాలా బాగుంది. హీరోకి అనుచరుడి పాత్రలో కనిపించిన సునీల్ తన నటనతో మెప్పించారు. హీరోయిన్ గా త్రిష ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు అధిక్ రవిచంద్రన్ హై టెక్నికల్ వేల్యూస్‌ తో బాగా తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడిగా అధిక్ రవిచంద్రన్ మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ.. ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ బోర్ గా సాగే సన్నివేశాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకువస్తాయి. అన్నిటికీ మించి ఈ సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు.

నిజానికి క్లైమాక్స్ లో హీరో అజిత్ కుమార్ క్యారెక్టర్ ను ఎమోషనల్ గా డిజైన్ చేసినప్పటికీ.. అది పెద్దగా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు. సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ అండ్ సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగినా.. ఎక్కడా వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ కూడా బలంగా లేకపోవడం ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి మరో బలహీనత. నిజానికి ఈ సినిమా మెయిన్ గా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ.. దర్శకుడు మాత్రం అక్కడక్కడ కొన్ని చోట్ల తడబడ్డాడు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గానీ, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు. సినిమాలో ఇంట్రెస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ప్లే సింపుల్ గా హ్యాండల్ చేశారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే… జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం చాలా బాగుంది. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంటూ వచ్చిన ఈ సినిమాలో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ మరియు అజిత్ వైల్డ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అయితే, కొన్ని చోట్ల బోరింగ్ ప్లే, రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

The post సమీక్ష : గుడ్ బ్యాడ్ అగ్లీ – కొన్నిచోట్ల ఆకట్టుకునే వైల్డ్ యాక్షన్ డ్రామా! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2225

Trending Articles