విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా
దర్శకుడు : అశోక్ తేజ
నిర్మాత : డి.మధు
సంగీత దర్శకుడు : బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్ : సౌందరరాజన్
ఎడిటర్ : అవినాష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఆ మధ్య ఓటిటిలో వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో సీక్వెల్ గా థియేటర్స్ లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యి సీక్వెల్ గా వచ్చిన మరో చిత్రమే “ఓదెల 2”. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ నాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఓదెల గ్రామంలోనే ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి (వశిష్ఠ) ని ఆ గ్రామస్థలు సమాధి చేసిన ఆరు నెలలకే మళ్ళీ ఒక భయంకర ఆత్మగా బయటకి వస్తాడు. అలా వచ్చి మళ్ళీ ఓదెలలో విధ్వంసం మరింత స్థాయిలో చేపడతాడు. అతడిని కట్టడి చేసేందుకు గ్రామస్తులు శివ శక్తి అయినటువంటి భైరవి (తమన్నా భాటియా) సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? దుష్ట శక్తికి దైవ శక్తికి నడుమ పోరులో ఎవరు ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామానికి ఎందుకు రావాలి అనుకుంటుంది? తిరుపతి, భైరవికి ఏం చేస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో అంతా మెయిన్ గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తమ పాత్రల్లో సాలిడ్ పెర్ఫామెన్స్ లని పోటా పోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ట కోసం చెప్పుకున్నట్టయితే కేజీఎఫ్, నారప్ప లాంటి సినిమాలతో బాగా ఫేమ్ తెచ్చుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచాడు అని చెప్పవచ్చు.
మెయిన్ గా తనలోని హారర్ షేడ్ ని బాగా పండించాడు. అలాగే పలు సన్నివేశాలు తనపై మంచి ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి. ఇక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడ నుంచి సెకండాఫ్ ని తమన్నా టేకోవర్ చేసింది అని చెప్పవచ్చు. ఒక పక్క వశిష్ఠ మరో పక్క తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తిగా సాగడం బాగుంది.
ఇక నటిగా తమన్నా కూడా మంచి పెర్ఫామెన్స్ ని అందించింది. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్ గా ఏ సన్నివేశానికి కావాల్సిన ఎమోషన్ అందుకు తగ్గట్టుగా అందించిందని చెప్పొచ్చు. అలాగే సినిమాలో క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావంతంగా ఆడియెన్స్ కి నచ్చే విధంగా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో అందరికీ తెలిసిందే అయినా డీసెంట్ లైన్ ని పెట్టుకున్నప్పటికీ దీనిని తెరకెక్కించే విధానం మాత్రం ఒకింత రెగ్యులర్ గానే అనిపిస్తుంది. దీంతో ఓదెల 2 కూడా రొటీన్ ఫీల్ నే మిగులుస్తుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే అనిపించాయి.
అలాగే సరైన ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో లేనట్టు అనిపిస్తుంది. అలాగే మరీ అంత థ్రిల్ చేసేసే హారర్ ఎలిమెంట్స్ గాని సస్పెన్స్ సీన్స్ కూడా ఈ సినిమాలో కనిపించలేదు. దీనితో ఈ చిత్రం సోసో గానే అనిపిస్తుంది. ఇంకా తమన్నాపై కొన్ని సీన్స్ ని బెటర్ గా డిజైన్ చేయాల్సింది.
కొన్ని కొన్ని సన్నివేశాలలో ఇంపాక్ట్ మిస్ అయ్యింది. ఇక అప్పటికే కొంతమేర సాగదీతగా అనిపించే కథనంలో అనవసరం అనిపించే పాటలు మరింత విసుగు తెప్పిస్తాయి. ఇక వీటితో పాటుగా మురళీ శర్మ, హెబా పటేల్ లాంటి నటుడు ఇంకా మరికొందరు పాత్రలు సినిమాలో మరికాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. టెక్నికల్ టీంలో విఎఫ్ఎక్స్ వర్క్స్ బాలేవు. అజనీష్ లోకనాథ్ మాత్రం తన మ్యూజిక్ తో చాలా సన్నివేశాలకి బాగా ప్లస్ అయ్యాడు. అలాగే సౌందర రాజన్ సినిమాటోగ్రఫి బాగుంది. అవినాష్ ఇంకా బెటర్ గా ఎడిట్ చేయాల్సింది.
ఇక దర్శకుడు సంపత్ నంది అందించిన కథ డీసెంట్ గానే ఉంటే దానిని సాధ్యమైనంత వరకు దర్శకుడు అశోక్ తేజ ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు. కానీ దీనిని ఇంకా బాగా ఆవిష్కరించే స్కోప్ ని మేకర్స్ మిస్ చేసుకున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకోసారి పర్ఫెక్ట్ గా హోమ్ వర్క్ చేసి బెటర్ వెర్షన్ ని కూడా ట్రై చేసి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సూపర్ నాచురల్ చిత్రం ‘ఓదెల 2’లో ప్రధాన తారాగణం తమన్నా, వశిష్ఠల సాలిడ్ పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి. అలాగే కొన్ని కొన్ని మూమెంట్స్ పర్లేదు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది కానీ వీటిని ఇంకా బెటర్ గా మలచి ఉంటే బాగుండు అనే భావన కూడా రాకపోదు. ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా కొంచెం డివోషనల్ టచ్ ఇచ్చినప్పటికీ కథనం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. సో ఈ చిత్రాన్ని కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకొనే ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష: తమన్నా ‘ఓదెల 2’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.