విడుదల తేదీ : మే 09, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తదితరులు
దర్శకుడు : కార్తీక్ రాజు
నిర్మాణం: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్
ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా #సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. పైగా విజయ్ చాలా సరదా మనిషి. కాకపోతే, లవర్ లేకుండా సింగల్ గా ఉన్నానని బాధపడుతూ ఉంటాడు. ఇక అతనికి ఏకైక ఫ్రెండ్ అరవింద్ (వెన్నెల కిషోర్) కి లవర్ ఉండటంతో, వాళ్లెప్పుడు విడిపోతారా అని విజయ్ ఎదురుచూస్తుంటాడు. ఈ మధ్యలో విజయ్ ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించడానికి ప్రయత్నించినా వర్కౌట్ అవ్వదు. ఈ క్రమంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పూర్వ (కేతికాశర్మ) ని విజయ్ ఇష్టపడతాడు. కానీ, పూర్వకి విజయ్ అంటే ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతుంది. మరోవైపు హరిణి (ఇవానా) విజయ్ ని ప్రేమిస్తున్నాని చెప్పి వెంట పడుతూ ఉంటుంది. కానీ, విజయ్ కి హరిణి అంటే ఇష్టం ఉండదు. ఎందుకు హరిణి అంటే విజయ్ కి ఇష్టం లేదు ?, ఆమె ఎందుకు విజయ్ ని ప్రేమిస్తున్నానని వెంటపడుతుంది ?, అలాగే పూర్వ ఎందుకు విజయ్ ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడింది ?, చివరకు ఈ ముగ్గురి మధ్య కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
కథ సింపుల్ గా ఉన్నా.. మంచి స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైలాగ్స్ కుదరడంతో సింగిల్ మూవీ థియేటర్ లో నవ్వులు పూయించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు.
ఇక మరో ప్రధాన పాత్రలో నటించిన వెన్నెల కిషోర్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించారు. ప్రధానంగా శ్రీ విష్ణు, కేతిక, ఇవానా, వెన్నెల కిషోర్ మధ్య వచ్చిన సీన్స్ చాలా ఎంటర్ టైన్ గా ఉన్నాయి. హీరోయిన్స్ గా నటించిన కేతిక, ఇవానా నటన ఆకట్టుకుంది. ఇవానా తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ మెప్పించింది. చివర్లో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ బాగుంది.
ఇక ఎప్పటిలాగే కీలక పాత్రల్లో కనిపించిన విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. ఈ పాత్రలను కూడా కథలో భాగం చేస్తూ దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. పైగా ఎక్కువగా కామెడీ సన్నివేశాల కోసం కథనాన్ని ల్యాగ్ చేయడం బాగాలేదు.
హీరోయిన్స్ కేతిక శర్మ మరియు ఇవానా పాత్రలను ఇంకా బాగా బలంగా రాసుకోవాల్సింది. అలాగే, హీరో – హీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ ను రైజ్ చేస్తూ స్క్రీన్ ప్లేను టైట్ చేసుకోవాల్సింది. ఇక సినిమాలో ఒక పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. మొత్తానికి మ్యూజిక్ పరంగా ఈ చిత్రం పెద్దగా ఇంప్రెస్ చేయదు. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు. కానీ, బలమైన కథాకథనాలు ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లి ఉండేది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కామెడీ సన్నివేశాలను దర్శకుడు కార్తీక్ రాజు బాగా తెరకెక్కించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ప్రవీణ్ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘#సింగిల్’ అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ గా సాగింది. ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రలు, ఆ పాత్రల మధ్య డ్రామా, మరియు నటీనటుల నటన.. మొత్తమ్మీద దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాను ఎంటర్ టైన్ గా నడిపాడు. కాకపోతే, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష : సింగిల్ – అలరించే కామెడీ ఎంటర్ టైనర్ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.