ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 09, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్, జీనత్ అమన్, సాక్షి తన్వర్, విహాన్ సమత్ తదితరులు
దర్శకులు : ప్రియాంక ఘోస్, నుపూర్ ఆస్థానా
నిర్మాత : ప్రితీష్ నాండీ
సంగీతం : రూహ్ జోహ్, హర్ష్ ఉపాధ్యాయ్, కనిష్క్ సేథ్, ఆదిత్య, నయన్‌తారా భత్కల్
సినిమాటోగ్రఫీ : నేహా పార్తి మటియాని
ఎడిటింగ్ : అంతార లహిరి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది రాయల్స్’ అనే రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ మే 9న స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్ ముఖ్య పాత్రల్లో నటించారు. రంగీత ప్రతీష్ నాండీ, ఇషిత ప్రితీష్ నాండీ తెరకెక్కిచిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
రాజస్థాన్‌లోని మోర్పూర్ రాజకుటంబానికి చెందిన అవిరాజ్(ఇషాన్ ఖట్టర్)కు పట్టాభిషేకం చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. అయితే, తమ రాజవంశానికి ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ఈవెంట్ మేనేజర్ సోఫియా శేఖర్(భూమి పెడ్నేకర్) సాయం తీసుకుంటాడు అవిరాజ్. కట్ చేస్తే.. వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే నాటకీయ పరిణామాల కారణంగా రాజ కుటుంబానికి చెందిన ఇతరులకు సంబంధించి కొన్ని నిజాలు బయటపడతాయి. ఇంతకీ ఆ నిజాలు ఏమిటి..? రాజ కుటుంబానికి చెందిన సభ్యులు ఎలాంటి పనులు చేస్తుంటారు..? అవిరాజ్ పట్టాభిషేకం జరుగుతుందా..? రాజ కుటుంబం సమస్యల నుంచి బయటపడుతుందా..? అవిరాజ్, సోఫియాల ప్రేమ పెళ్లి గా మారుతుందా..? అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్‌ను చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
రొటీన్ టెంప్లేట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్‌లో ఇషాన్ ఖట్టర్ చక్కటి నటనను కనబరిచాడు. అవిరాజ్ పాత్రలో అతను ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక రాణి పద్మజగా సాక్షి తన్వర్ చాలా ఈజ్‌గా నటించి ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
భూమి పెడ్నేకర్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉండటం విశేషం. ఈ వెబ్ సిరీస్‌కు బాక్‌గ్రాండ్‌లో వచ్చే టైటిల్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా యూత్‌ను ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి రొటీన్ టెంప్లేట్ కంటెంట్‌ను డీల్ చేస్తు్న్నప్పుడు కథనంపై మేకర్స్ దృష్టి పెట్టాల్సింది. కేవలం రొమాన్స్, డ్రామాకే పెద్దపీట వేయడంతో సామాన్య ప్రేక్షకులు చాలా వరకు ఈ వెబ్ సిరీస్‌ను ఫార్వార్డ్ చేస్తూ వీక్షిస్తారు. ఇక ఎలాంటి యాక్షన్, ఆకట్టుకునే కామెడీ ట్రాక్ లేకపోవడం ఈ వెబ్ సిరీస్‌కు మైనస్.
అయితే, ఎంత రొటీన్ కథ అయినా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ, ఈ వెబ్ సిరీస్‌లో అలాంటి స్క్రీన్ ప్లే ఎక్కడా కనిపించదు. ఒకట్రెండు ఎపిసోడ్స్‌లో ఆకట్టుకునే స్టఫ్ ఉన్నప్పటికీ, దాన్ని హ్యాండిల్ చేయడంలో మేకర్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇందులో నోరా ఫతేహి, డినో మోరియా, మిలింద్ సోమన్, చంకీ పాండే, జీనత్ అమన్ లాంటి స్టార్స్‌ను సరిగా వినియోగించుకోలేకపోయారు.
ఇక ఈ వెబ్ సిరీస్‌కు మరో మేజర్ డ్రాబ్యాక్ దీని రన్‌టైమ్ అని చెప్పాలి. స్లో గా సాగే సీన్స్‌తో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. అసలే రొటీన్ కథ..అందులోనూ సాగదీత ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను ఎంజాయ్ చేయలేరు.
సాంకేతిక విభాగం :
ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ప్రియాంక ఘోస్, నుపూర్ ఆస్థానా దీనిని ఎంగేజింగ్‌గా మార్చడంలో ఫెయిల్ అయ్యారు. ఎలాంటి కొత్తదనం లేని స్క్రీప్టును వారు సరిగా హ్యాండిల్ చేసి ఉంటే, కాస్తోకూస్తో ఈ వెబ్ సిరీస్ కొంత ఆసక్తికరంగా మారేది. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ బాగున్నా సంగీతం ఆకట్టుకోదు. ఎడిటింగ్ వర్క్ పై చాలా ఫోకస్ పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. చాలా సీన్స్ గ్రాండియర్‌గా కనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ వర్క్ ఆకట్టుకుంటుంది.
తీర్పు :
ఓవరాల్‌గా ‘ది రాయల్స్’ వెబ్ సిరీస్ చాలా స్లో నెరేషన్, బోరింగ్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇషాన్ ఖట్టర్, సాక్షి తన్వర్ తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్‌కు పెద్ద డ్యామేజ్ చేసింది. రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్‌లను ఇష్టపడేవారు ‘ది రాయల్స్’ను స్కిప్ చేయడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team
The post ఓటీటీ సమీక్ష : ది రాయల్స్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.