Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2262

సమీక్ష: ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్’–బోర్ గా సాగే హారర్ కామెడీ

$
0
0

Devil's Double Next Level Movie Review

విడుదల తేదీ : మే 16, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : సంతానం, గీతికా తివారి, గౌతమ్ మీనన్, యషికా ఆనంద్, రెడిన్ కింగ్స్ లే
దర్శకత్వం : ప్రేమ్ ఆనంద్
నిర్మాణం : నిహారిక ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : ఆఫ్రో
ఛాయాగ్రహణం : దీపక్ కుమార్
కూర్పు : భరత్ విక్రమన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన హారర్ కామెడీ చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ప్రస్తుత సినిమా కాలంలో కొంతమంది యూట్యూబ్ రివ్యూస్ ఇచ్చి వాంటెడ్ గా సినిమాని చంపేస్తున్న వారికి సినిమా ప్యారడైజ్ అనే థియేటర్ నుంచి ఒక స్పెషల్ టికెట్ ఒకో రివ్యూవర్ కి వస్తూ ఉంటుంది. ఇలాంటి యూట్యూబర్స్ లో కిస్సా 47 అనే యూట్యూబ్ ఛానెల్ ని రన్ చేస్తూ రివ్యూస్ ఇచ్చే కృష్ణ (సంతానం) కి కూడా ఓరోజు ఆహ్వానం వస్తుంది. ఇలా తన కుటుంబం సహా కృష్ణ ఆ థియేటర్ కి వెళ్ళాక ఏమయ్యింది? ఆ థియేటర్ లో అసలేం జరుగుతుంది? కృష్ణ తన కుటుంబాన్ని తన లవర్ హర్షిని (గీతికా తివారి)ని ఎలా కాపాడుకుంటాడు? ఈ క్రమంలో తనకి ఎదురైన సవాళ్లు ఏంటి? వారు చూడటానికి వెళ్లిన సినిమా ముగింపు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కొద్దో గొప్పో అలరించే అంశం ఏదన్నా ఉంది అంటే అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ అని చెప్పాలి. ముఖ్యంగా రెడిన్ కింగ్స్ లే పై అలాగే గౌతమ్ మీనన్ పై కొన్ని సన్నివేశాలు మంచి ఫన్ తో హిలేరియస్ గా అనిపిస్తాయి. అలాగే నటుడు రాజేంద్రన్ పై కూడా కొన్ని ఫన్ సీన్స్ బాగున్నాయి.

అలాగే ఎక్కడో కాన్సెప్ట్ కూడా ఓకే అనిపిస్తుంది. ఒక సినిమాలో సినిమా అందులో హీరో ఇరుక్కోవడం దానికి ముగింపు మధ్యలో కొన్ని సవాళ్లు లాంటివి కొన్ని ఫన్ అడ్వెంచర్ లాంటి సినిమాలు ఇష్టపడేవారికి ఓకే అనిపించవచ్చు. అలాగే సంతానం తన రోల్ లో బాగానే చేసాడు.

తన లుక్స్ గాని యాక్షన్ పార్ట్ లో తన నటన బాగున్నాయి. ఇక తనతో పాటుగా గౌతమ్ మీనన్ ఉన్నంతసేపు కథనం ఓకే రేంజ్ లో సాగుతుంది. అలాగే తనపై ట్విస్ట్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ గీతికా తివారి తన రోల్ లో ఫిట్ అయ్యింది. అలాగే డ్యూయల్ షేడ్స్ లో బాగానే చేసింది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో పాయింట్ ఓకే అనిపిస్తుంది కానీ కథనం మాత్రం ఎంగేజింగ్ గా సాగలేదు. సినిమా అందులో సినిమా పైగా హారర్ ఇంకా కామెడి ఎలిమెంట్స్ వంటివి ఆడియెన్స్ ని లీనం అయ్యేలా చేయలేకపోయాయి. కేవలం కొన్ని కామెడీ కామెడీ తప్ప సినిమాలో ఇంకెక్కడా నవ్వు తెప్పించే అంశాలు లేవు.

ఇంకా సంతానం లాంటి నటుడు ఉన్నప్పటికీ సరైన నవ్వులు సినిమాలో లేవు. ఇక హారర్ ఎలిమెంట్స్ కోసం అయితే చెప్పక్కర్లేదు. ఒక్క చోట కూడా భయం కలగదు. చాలా సిల్లీగా, నవ్వు తెప్పించని కామెడీతో సినిమా అలా సాగదీతగా వెళుతూ ఉంటుంది. ఫస్టాఫ్ వరకు రెడిన్ ఇంకా గౌతమ్ మీనన్ పై కొన్ని సన్నివేశాలు ఉన్నంతలో ఓకే అనిపిస్తాయి కానీ సెకండాఫ్ లో వీరి ట్రాక్ పక్కకి వెళ్ళిపోయింది.

రెడిన్ పై వచ్చే ఆ కొన్ని సీన్స్ కూడా ఫన్ గా సాగలేదు. ఇక దీనితో పాటుగా కథనం చూస్తుంటే పలు హాలీవుడ్ సినిమాలు నుంచి కాపీ కొట్టినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. రాంగ్ టర్న్, సా (SAW) లాంటి సినిమాల్లో ఎపిసోడ్స్ ని పెట్టుకున్నారు.

ఇలా సినిమా ఎటెటో వెళుతుంది. ఇక వీటితో పాటుగా నటి కస్తూరి పాత్ర ఈ ఏజ్ లో అంత గ్లామర్ షో అవసరమా అనిపిస్తుంది. అలాగే సెల్వరాఘవన్ పాత్ర మొదట్లో బాగానే అనిపిస్తుంది కానీ నెమ్మదిగా తన పాత్ర కూడా తేలిపోయినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. థీమ్ కి కావాల్సిన సెటప్ ని బాగా ప్లాన్ చేశారు. అలాగే సెట్టింగ్స్ ఇంకా హారర్ ఎలిమెంట్స్ కి కావాల్సిన అంశాలు ఇంకా వి ఎఫ్ ఎక్స్ వర్క్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. సంగీత దర్శకుడు ఆఫ్రో వర్క్ పర్వాలేదు. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో చాలా వరకు సన్నివేశాలు ట్రిమ్ చేయాల్సింది. ప్రోస్తటిక్ మేకప్ టీం వర్క్ బాగుంది.

ఇక దర్శకుడు ప్రేమ్ ఆనంద్ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ చిత్రం బిలో యావరేజ్ గా ఉందని చెప్పాలి. మెయిన్ పాయింట్ ఓకే కానీ దానికి తగ్గట్టుగా ఎంగేజింగ్ కథనం తాను రాసుకోలేదు. ఎక్కడో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్, లాజిక్స్ తప్పితే మిగతా అంశాలు మెప్పించలేదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్’ లో కేవలం కొన్ని కామెడీ సీన్స్, అది కూడా అక్కడక్కడా ఓకే అనిపిస్తాయి. అలాగే దర్శకుడు అనుకున్న పాయింట్ ఓకే కానీ దానిని ఇంకా బెటర్ నరేషన్ తో ప్రెజెంట్ చేయాల్సింది. సో ఈ కామెడీ హారర్ డ్రామా అంత ఇంట్రెస్ట్ గా ఏమీ సాగదు. సో ఈ వీకెండ్ కి దీని బదులు వేరే ప్లాన్ చేసుకుంటే బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

The post సమీక్ష: ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్’ – బోర్ గా సాగే హారర్ కామెడీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2262

Latest Images

Trending Articles



Latest Images