Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2205

సమీక్ష: ‘మిషన్ ఇంపాజిబుల్ –ది ఫైనల్ రెకోనింగ్’–థ్రిల్ చేసే సాలిడ్ యాక్షన్ డ్రామా

$
0
0

Mission: Impossible – The Final Reckoning Telugu Movie Review

విడుదల తేదీ : మే 17, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : టామ్ క్రూయిజ్, హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, హెన్రీ జెర్నీ, ఏంజెలా బాసెట్, ఎసై మోరల్స్
దర్శకుడు : క్రిస్టోఫర్ మెక్ క్యూరీ
నిర్మాతలు: టామ్ క్రూజ్ మరియు క్రిస్టోఫర్ మెక్ క్యూరీ
సంగీత దర్శకుడు : మాక్స్ అరుజ్ మరియు ఆల్ఫీ గాడ్ఫ్రే
సినిమాటోగ్రాఫర్ : ఫ్రేజర్ టాగర్ట్
ఎడిటర్ : ఎడ్డీ హామిల్టన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకోనింగ్’. తన సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ మిషన్ ఇంపాజిబుల్ నుంచి వచ్చిన 8వ సినిమా ఇది కాగా ఇదెలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన ఐఎంఎఫ్ (ఇంపాజిబుల్ మిషన్ ఫోర్స్) లోకి ఈథన్ హంట్ (టామ్ క్రూయిజ్) మళ్ళీ వస్తాడు. అయితే ఒక ఆఖరి క్లిష్టమైన మిషన్ ఎంటిటీ అనే పవర్ఫుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమస్త ప్రపంచానికే ముప్పు తెచ్చేదిగా మారుతుంది. అయితే ఈథన్ గతంలో ఒక విలన్ అయిన గాబ్రియల్ (ఇసాయ్ మోరలెస్) కి ఈథన్ అడ్డుకునే క్రమంలో ఏం జరిగింది? గాబ్రియల్ లూథర్ (వింగ్ హెమ్స్) ని ఎందుకు చంపాడు? పాయిజన్ పిల్ ఏంటి? అలాగే పరిస్థితులు చేదాటిపోతున్న సమయంలో ఈ ఫైనల్ మిషన్ ఎలా ముగిసింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం ఈ క్రేజీ ఫ్రాంచైజ్ కి ఉన్న ఫాలోయింగ్ కి ఇపుడు ఉన్న అంచనాలకి తగ్గట్టుగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిన్ గా టామ్ క్రూయిజ్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ మిషన్ ఇంపాజిబుల్ అనే ఫ్రాంచైజ్ లో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఈథన్ పనైతే ఆ పాత్రలో టామ్ క్రూయిజ్ ఎందుకు అంత పర్ఫెక్ట్ అనేది మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది.

గగుర్పొడిచే తన స్టంట్స్ నీటిలో గాలిలో ఎలాంటి డూప్ లు లేకుండా టామ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. తన డెడికేషన్ అది కూడా ఈ ఏజ్ లో చూపించడం అనేది తన కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమా చూస్తే అది ఆడియెన్స్ కి మరింత అర్ధం అవుతుంది.

అలాగే ఈ సినిమాలో పలు సర్ప్రైజ్ లు కూడా ఈ ఫ్రాంచైజ్ లవర్స్ ని మళ్ళీ కాలం వెనక్కి తీసుకెళ్లాయి అంతే కాకుండా ఎమోషనల్ పార్ట్ కూడా ఈ చిత్రం సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది. ఇక టామ్ తో పాటుగా కెప్టెన్ అమెరికా నటి హైలే అట్వెల్ మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. తన గ్లామ్ షో ఇంకా పెర్ఫామెన్స్ లు బాగున్నాయి.

తనతో పాటుగా సైమన్ పెగ్ (బెంజీ) కూడా కొన్ని టెన్స్ సన్నివేశాల్లో ఇంప్రెస్ చేస్తాడు. ఇక సినిమాలో బాగా ఇంప్రెస్ చేసే అంశాల్లో టెక్నీకల్ టీం ఎఫర్ట్స్ ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఫ్రాజర్ టగ్గర్ట్ అందించిన కెమెరా వర్క్ ఈ సినిమాకి స్టన్నింగ్ గా ఉంది. అలాగే సంగీతం కూడా సన్నివేశాలని బాగా ఎలివేట్ చేయడంతో ఆడియెన్స్ బాగా ఎగ్జైట్ అవుతారు.

మైనస్ పాయింట్స్:

పలు అంశాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఈ భారీ చిత్రం కొన్ని అంశాల్లో మాత్రం వీక్ గా ఉందని చెప్పక తప్పదు. స్టోరీ లైన్ లో డెప్త్ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే కథనం కూడా ఒకింత కొన్ని మూమెంట్స్ లో డల్ గా అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ కూడా ఇదే పరిస్థితి.

ఇక ఈ సినిమాలో బలమైన విలన్ మిస్ అయ్యిన భావన కూడా కలుగుతుంది. ఒక ఫైనల్ సినిమాకి తగ్గ రేంజ్ లో విలన్ లేడు అనిపించక మానదు. ఇంకొంచెం క్లిష్టమైన విలన్ ని సెట్ చేసి ఉంటే బాగుండేది.

అలాగే ఈ ఫ్రాంచైజ్ లవర్స్ కి కావాల్సిన కొన్ని మూమెంట్స్ కూడా బాగా మిస్ అయ్యినట్టు అనిపిస్తాయి. ఎత్తుకి పైఎత్తులు, స్పై టెక్నిక్స్ ఇంకా ఇతర ఇంట్రెస్టింగ్ అంశాలు ముందు రేంజ్ లో ఉన్నట్టుగా అనిపించవు. ఇవి ఒకింత డిజప్పాయింట్ చేయొచ్చు.

సాంకేతిక వర్గం:

నిర్మాణ విలువలు పరంగా చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు లాంటి సినిమాకి తగ్గట్టుగా గ్రాండ్ సెటప్ ని ఆ ఖర్చు అంతా కనిపిస్తుంది. టెక్నీకల్ టీం వర్క్ ఈ సినిమాకి అతి పెద్ద బలం, సంగీతం, కెమెరా వర్క్ యాక్షన్ ఇలా అన్ని వర్గాలు ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ని అందించారు. ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు క్రిస్టోఫర్ మాక్ క్యూరీ విషయానికి వస్తే.. తాను గ్రాండ్ విజువల్స్ మరియు యాక్షన్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు కానీ కోర్ లైన్ మరియు కొన్ని చోట్ల కథనంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సింది. కొన్ని సీన్స్ ని తగ్గించి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే సెట్ చేసి ఉంటే మరింత బెటర్ గా అనిపించేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకోనింగ్’ ఈ ఫ్రాంచైజ్ లవర్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పాలి. టామ్ క్రూయిజ్ మరోసారి తన సత్తా ఏంటి అనేది చూపించారు. అలాగే భారీ యాక్షన్ సీక్వెన్స్ లు రియలిస్టిక్ స్టంట్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటాయి. అయితే బలమైన విలన్ ఇంకా కొన్ని చోట్ల కథనం వీక్ గా ఉండడం వంటివి మైనస్ గా నిలిచాయి. కానీ ఇవి మరీ అంత ప్రభావం చూపవు. ఆ యాక్షన్ ఎలిమెంట్స్ సహా ఎమోషన్స్ ఇంకా కొన్ని నోస్టాలాజిక్ మూమెంట్స్ ఆ మైనస్ అంశాలని భర్తీ చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం ఈ ఫ్రాంచైజ్ లవర్స్ అయితే ఈ థ్రిల్ రైడ్ ని థియేటర్స్ లో చూసేందుకు సిద్ధం అయ్యిపొండి.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

The post సమీక్ష: ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకోనింగ్’ – థ్రిల్ చేసే సాలిడ్ యాక్షన్ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2205

Trending Articles