Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : భూల్ చుక్ మాఫ్ –బోరింగ్ రొమాంటిక్ కామెడీ డ్రామా

$
0
0

Bhool Chuk Maaf Movie Review in Telugu

విడుదల తేదీ : మే 23, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి, సీమా పాహ్వా, సంజయ్ మిశ్ర, రఘుబీర్ యాదవ్, జాకిర్ హుస్సేన్త దితరులు
దర్శకుడు : కరణ్ శర్మ
నిర్మాత: దినేష్ విజన్
సంగీతం : తనిష్క్ బాగ్చి, కేతన్ సోధ
సినిమాటోగ్రఫీ : సుదీప్ ఛటర్జీ
ఎడిటర్ : మనీష్ ప్రధన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, వామిక గబ్బి జంటగా నటించిన చిత్రం ‘భూల్ చుక్ మాఫ్’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంత మేర ఆకాటుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
బనారస్‌లో ఉండే రంజన్(రాజ్ కుమార్ రావు), తిత్లీ(వామికా గబ్బి) ప్రేమించుకుంటారు. వారు ఇంటి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో తత్లీ తండ్రి రంజన్ 2 నెలల్లో గవర్నమెంట్ జాబ్ సాధిస్తే తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. ఎలాగోలా రంజన్ గవర్నమెంట్ జాబ్ సాధిస్తాడు. కట్ చేస్తే.. పెళ్లికి ముందు రోజు నిద్ర లేచిన రంజన్‌కు మరుసటి రోజు కూడా అదే రిపీట్ అవుతుంది. దీంతో రంజన్ భయపడతాడు. అసలు అతనికి రోజూ ఒకే తేదీ ఎందుకు రిపీట్ అవుతుంది..? అతడు పెళ్లి కోసం దేవుడిని ఎలాంటి కోరిక కోరాడు..? అతడి పెళ్లి అవుతుందా లేదా..? అనేది సినిమాలోని అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :
రాజ్ కుమార్ రావు సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయి. అతను ఎంచుకునే కథలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయనే భావన ఉంది. దీనికి తగ్గట్లుగానే ఈ సినిమాలోని కొంతమేర పాయింట్ ప్రేక్షకులను ఆలోచింప జేస్తుంది. ఇక అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా వారణాసి నేపథ్యంలో సాగడంతో, అక్కడి పరిసరాలను చాలా చక్కగా చూపెట్టారు. ఇక ఈ సినిమాలోని కొన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొన్ని కామెడీ సీన్స్ కూడా నవ్విస్తాయి. ఒకే రోజు రిపీట్ కావడం అనే కాన్సెప్ట్ కొంతమేర మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :
ఇలాంటి రొమాంటిక్ కామెడీ చిత్రంలో కథ కూడా ప్రభావం చూపెడుతుంది. అయితే, ఈ సినిమాలోని కథ చాలా రొటీన్‌గా సాగడం ప్రేక్షకులను మెప్పించదు. ముఖ్యంగా హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే ట్రాక్ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రేమ, పెళ్లి.. దానికి హీరోయిన్ తండ్రి పెట్టే షరతులు.. ఇదంతా చాలా రొటీన్ టెంప్లేట్‌గా కనిపిస్తుంది.

పెళ్లి ఫిక్స్ అయ్యాక వచ్చే సీన్స్ కొంతమేర మెప్పించినా, ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్ కూడా పాత చింతకాయ పచ్చడిలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కామెడీ సీన్స్ కూడా కొంతమేర వర్కవుట్ అయినా, మిగతా చోట్ల అనవసరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రిపీటెడ్‌గా సీన్స్ వస్తుండటం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోదు.

స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మేజర్ మైనస్ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లోని చాలా సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ముఖ్యంగా పాటలు అనవసరమైన టైమ్‌లో వచ్చినట్లుగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో మంచి సందేశం ఇద్దామని మేకర్స్ ప్రయత్నించినా, అది పెద్దగా వర్కవుట్ కాలేదు.

సాంకేతిక విభాగం :
దర్శకుడు కరణ్ శర్మ ఈ సినిమాను రొమాంటిక్ కామెడీతో పాటు ఓ సందేశాన్ని ఇవ్వాలనే ప్రయత్నంలో పూర్తిగా ట్రాక్ తప్పాడు. కథలో కొత్తదనం ఇద్దామని ప్రయత్నించగా అది మిస్ ఫైర్ అయ్యింది. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకున్నా, మ్యూజిక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎడిటింగ్ విషయంలోనూ ఇంకా బెటర్‌గా చేయాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. రాజ్ కుమార్ రావు నుంచి మంచి సినిమాలు ఆశించే ప్రేక్షకులకు ‘భూల్ చుక్ మాఫ్’ ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్‌గా మిగిలింది. రాజ్ కుమార్ రావు ఒక్కడే సినిమాను హిట్ చేయలేడు అనేది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. రొటీన్ టెంప్లేట్‌తో వచ్చిన బోరింగ్ సినిమా కావడంతో ఈ వీకెండ్ ప్రేక్షకులు వేరే సినిమాలను ట్రై చేయడం బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

The post సమీక్ష : భూల్ చుక్ మాఫ్ – బోరింగ్ రొమాంటిక్ కామెడీ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles