Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : షష్టిపూర్తి –స్లోగా సాగే ఫ్యామిలీ డ్రామా

$
0
0

Shashtipoorthi Movie Review

విడుదల తేదీ : మే 30, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్, ప్రభాస్ శ్రీను తదితరులు
దర్శకత్వం : పవన్ ప్రభ
నిర్మాత : రూపేష్
సంగీతం : ఇళయరాజా
ఛాయాగ్రహణం : రామ్
కూర్పు : కార్తీక్ శ్రీనివాస్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్, నేషనల్ అవార్డ్ గ్రహీత అర్చన, రూపేష్ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘షష్టిపూర్తి’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రమోషనల్ కంటెంట్‌తో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రంగా ఈ మూవీ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

శ్రీరామ్(రూపేష్) ఓ నిజాయితీగల పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎలాంటి అవినీతి చేయకుండా న్యాయం కోసం కేసులు వాదిస్తుంటాడు. అయితే, అనుకోకుండా ఓ రోజు జానకి(ఆకాంక్ష సింగ్)ను కలిసిన శ్రీరామ్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కోసం శ్రీరామ్ తన పద్ధతి మార్చుకుంటాడు. అయితే, శ్రీరామ్‌తో జానకి ప్రేమ వెనకాల అసలు కారణం ఏమిటి..? శ్రీరామ్ తల్లిదండ్రులు విడిపోవాలని ఎందుకు అనుకుంటారు..? వారి షష్టిపూర్తి వేడుక జరుగుతుందా లేదా..? అనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ మంచి మార్కులు వేస్తారు. ఇక ‘షష్టిపూర్తి’ అంటూ పక్కా ఫ్యామిలీ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో కొంతమేర సక్సెస్ అయ్యింది. తల్లిదండ్రులు విడిపోవాలనుకోవడం.. వారిని కలిపేందుకు కొడుకు చేసే ప్రయత్నాన్ని మనకు ఈ సినిమాలో చక్కగా చూపెట్టారు. బంధాలకు పెద్దపీట వేస్తు దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగుంది.

హీరోగా రూపేష్‌కు ఇది తొలి సినిమా అయినా చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా ఆయన ఎమోషనల్ సీన్స్‌లో పండించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. సాంగ్స్ పరంగా కూడా ఇళయరాజా సంగీతం కొంతవరకు మెప్పించింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ మైనస్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచే ఈ చిత్రాన్ని చాలా స్లోగా ప్రెజెంట్ చేయడం ప్రేక్షకులను విసిగిస్తుంది. ఇక దీనికి తోడు బోరింగ్ సీన్స్ కూడా ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి.

చాలా సీన్స్ ల్యాగ్‌గా అనిపించడంతో ఈ సినిమా రన్‌టైమ్ ఎక్కువగా అనిపిస్తుంది. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకునేవి లేకపోవడం మైనస్. ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, అర్చన లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ, వారి పాత్రలను సెకండాఫ్‌కే పరిమితం చేయడం వర్కవుట్ కాలేదే. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా మెప్పించదు.

ప్రీ-క్లైమాక్స్ సీక్వెన్స్ బాగున్నా, క్లైమాక్స్‌ను మరికొంత ఎమోషనల్‌గా తీర్చిదిద్దాల్సింది. అప్పుడు ఆడియన్స్‌కు ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలిగేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పవన్ ప్రభ తీసుకున్న పాయింట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించేది అయినప్పటికీ, దాని ఎగ్జిక్యూషన్‌లో ఆయన కాస్త తడబడ్డాడు. మెయిన్ పాయింట్‌ను పక్కనబెట్టి హీరోహీరోయిన్ లవ్ ట్రాక్‌కు ఆయన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. దీంతో కథలోని ఎమోషన్ సైడ్ ట్రాక్ అయినట్లు కనిపించింది. ఇళయరాజా సంగీతం బీజీఎం వరకు బాగానే ఉన్నా, ఒకట్రెండు సాంగ్స్ మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, ‘షష్టిపూర్తి’ సినిమా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమాగా ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటుంది. అయితే, ఇందులోని ఫ్లాట్ స్క్రీన్ ప్లే, స్లో గా సాగే సన్నివేశాలు, బోరింగ్ సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా కొంతవరకు నచ్చవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

The post సమీక్ష : షష్టిపూర్తి – స్లోగా సాగే ఫ్యామిలీ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles