Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2267

ఓటిటి సమీక్ష: ‘డియర్ డాడీ’–తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

$
0
0

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 08, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రవివర్మ, శశిధర్, శరణ్య ప్రదీప్, వైష్ణవి, సహస్ర శ్రీ
దర్శకుడు : శ్రీకాంత్ దేవరకొండ
నిర్మాణం : ఈటీవీ విన్
సంగీత దర్శకుడు : రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రాఫర్ : పోతన్ ఓం ప్రకాష్
ఎడిటర్ : ఎస్ జె శివ కిరణ్, సుంకర సాయి తేజ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు తీసుకొస్తున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ నే “డియర్ డాడీ”. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇద్దరు భార్యాభర్తలు రవి (శశిధర్) చంద్రిక (శరణ్య ప్రదీప్)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వారికి విస్మయ (వైష్ణవి) పుడుతుంది. అయితే ఆమె చిన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ పెద్ద దర్శకుడు అయ్యి గొప్ప లైఫ్ ని కోరుకునే రవి విడాకులు తీసుకొని దర్శకత్వం పనుల్లో ఉంటాడు. అయితే 9 ఏళ్ల వయసులో కూతురు నుంచి విడిపోయాక తాను పెద్ద దర్శకుడు అయ్యి మళ్ళీ తనకి 18 ఏళ్ళు నిండాక తన కూతురుగా అందరికీ చెప్తానని అప్పుడు నుంచి తన దగ్గరే ఉండొచ్చని విస్మయాకి చెప్తాడు. ఇంతలో చంద్రిక అశోక్ (రవివర్మ) ని వివాహం చేసుకుంటుంది. మరి తన లైఫ్ లో వచ్చిన నాన్న కాని నాన్న పట్ల విస్మయ ఎలా ఉంది? 18 ఏళ్ళు నిండిన తర్వాత తన తండ్రి దగ్గరకి వెళ్ళాక ఏం జరిగింది? చివరికి ఏ నాన్న ప్రేమ ఆమెకి సొంతం అయ్యింది అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ లో ప్రధాన బలం నటీనటుల పెర్ఫామెన్స్ లతో పాటుగా నీట్ గా సాగే ఎమోషనల్ కథనం అని చెప్పవచ్చు. ఈటీవీ విన్ ఈ కథా సుధలో వచ్చిన అన్ని ఎపిసోడ్స్ కంటే ఇదే ఎక్కువ నిడివి కావచ్చు కానీ దాదాపు పెద్దగా బోర్ లేకుండానే సాగింది. మొదటి నుంచి చివరి వరకు కూడా డీసెంట్ ఎమోషన్స్ తో ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది.

సీనియర్ నటులు రవి వర్మ మంచి రోల్ లో కనిపించాడు. తన రోల్ లోని డెప్త్ ని తాను ఎమోషనల్ బాగా క్యారీ చేసి చూపించారు. అలాగే నటుడు శశిధర్ కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని చూపించారు. తన రోల్ లో లేయర్స్ ని పాజిటివ్ నుంచి నెగిటివ్ వరకు బాగా చేశారు.

ఇక ఫిదా ఫేమ్ నటి శరణ్య ప్రదీప్ తన మార్క్ నాచురల్ నటనతో ఆకట్టుకుంటారు. ఇక వీరితో పాటుగా కూతురి పాత్రలో నటించిన యువ నటులు వైష్ణవి సహస్ర శ్రీలు కూడా బాగా చేశారు. వీటితో పాటుగా ఎపిసోడ్ లో చివరి కొంతసేపు బాగా సాగుతుంది. దర్శకుడు అక్కడ రాసుకున్న కథనం ఒకింత హార్డ్ హిట్టింగ్ గానే తగులుతుంది.

మైనస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ లో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఇది చాలా రొటీన్ లైన్ అని చెప్పాలి. చాలా వరకు కథనం ఒకింత ఊహించదగిన రీతిలోనే సాగుతుంది కాబట్టి పెద్దగా ట్విస్ట్ లు లాంటివి ఈ ఎమోషనల్ ట్రాక్ లో కనిపించవు.

వీటితో పాటుగా మధ్యలో కొన్ని సీన్స్ అయితే మరీ రొటీన్ గా ఓల్డ్ డ్రమాటిక్ గా అనిపిస్తుంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ప్రకాష్ రాజ్ తన కల కోసం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళడాన్నే ఇక్కడ కూడా తీసుకున్నారు. సో కొంచెం కొత్తదనాన్ని కోరుకునేవారు అయితే డిజప్పాయింట్ అవ్వక తప్పదు. ఇలాంటి వాటిలో కొంచెం కేర్ తీసుకోవాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ ఎపిసోడ్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ వంటివి కూడా బాగానే ఉన్నాయి కానీ డబ్బింగ్ ఇంకొంచెం నాచురల్ గా చేయాల్సింది. మెయిన్ గా చిన్న పాప డబ్బింగ్ చాలా తక్కువ క్వాలిటీలో అనిపిస్తుంది.

ఇక దర్శకుడు శ్రీకాంత్ దేవరకొండ విషయానికి వస్తే తన నుంచి ఇది డీసెంట్ వర్కే అని చెప్పొచ్చు కానీ ఇంకొంచెం బెటర్ గా కూడా ట్రై చేసి ఉంటే బాగుండేది. ఎమోషనల్ పార్ట్ వరకు తాను బాగా నడిపించారు. కానీ లైన్ లో ఇంకొన్ని సీన్స్ లో ఫ్రెష్ నెస్ లోపించింది. ఇది కూడా బాగుండి ఉంటే పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండేది. ఇవి మినహా తన వర్క్ మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘డియర్ డాడీ’ లో ఎమోషనల్ పార్ట్ వర్కౌట్ అవుతుంది. కొన్ని సీన్స్ మినహాయిస్తే ఇందులో ఒక కూతురు, తండ్రికి నడుమ కనిపించే ప్రేమ, డ్రామా బాగున్నాయి. సొంత నాన్న స్థానంలో మరొకరిని ఎలా భర్తీ చేస్తారు అనే అంశాన్ని దర్శకుడు చక్కగా తీసుకెళ్లారు. కొన్ని నెగిటివ్స్ పక్కన పెడితే ఈ ఎపిసోడ్ ని కూడా ఈటీవీ విన్ కథా సుధలో ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

The post ఓటిటి సమీక్ష: ‘డియర్ డాడీ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2267

Latest Images

Trending Articles



Latest Images