Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2263

ఓటిటి సమీక్ష: ‘డియర్ ఉమ’–తెలుగు చిత్రం సన్ నెక్స్ట్ లో ప్రసారం

$
0
0

dear uma

స్ట్రీమింగ్‌ తేదీ : జూన్ 14, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : సన్ నెక్స్ట్

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : సుమయ రెడ్డి, పృథ్వీ అంబార్, కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, రాజీవ్ కనకాల, పృధ్వీ రాజ్, కేదార్ శంకర్, ఆమని, రూపా లక్ష్మి
దర్శకత్వం : సాయి రాజేష్ మహాదేవ్
నిర్మాత : సుమయ రెడ్డి
సంగీతం : రధన్
సినిమాటోగ్రఫీ : రాజ్ తోట
ఎడిటర్ : సత్య గిడుతూరి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా తెలుగు ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ “డియర్ ఉమ” కూడా ఒకటి. ప్రముఖ ఓటిటి సన్ నెక్స్ట్ లో రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

గిటారిస్ట్ గా మ్యూజిక్ లో అవకాశాలు కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు దేవ్ (పృథ్వీ అంబర్) తన అన్నయ్య సూర్య (కమల్ కామరాజు) ఆయుష్ హాస్పిటల్స్ లో అడ్మినిస్ట్రేటర్ గా పని చేస్తాడు. పెద్ద కొడుకు బాగా సెటిల్ అయ్యాడు చిన్న కొడుకు అలా తిరుగుతున్నాడు అని వారి తల్లిదండ్రులు దేవ్ ని బయటకి గెంటేస్తారు. ఈ క్రమంలో చిన్న పల్లెటూరు నుంచి డాక్టర్ అవ్వాలని వచ్చిన ఉమ (సుమయ రెడ్డి) అదే ఆయుష్ హాస్పిటల్స్ లో పని చేస్తుంది. కానీ అక్కడ కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దేవ్ మ్యూజిక్ లైఫ్ లో సక్సెస్ అయ్యాడా లేదా? తన లవ్ ట్రాక్ ఎలా సాగింది? ఉమకి ఏమైంది? ఆ హాస్పిటల్ లో ఏం జరుగుతుంది? అనేవి మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు పెద్దగా అయితే కనిపించవు. సప్తగిరిపై ఒకటీ రెండు కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో హీరో స్పీచ్ లో కొన్ని అంశాలు బాగుంటాయి.

అలాగే కమల్ కామరాజు పై ఓ ట్విస్ట్ బాగుంది. ఇంకా హీరో పృథ్వీ అంబర్ ఓకే అనిపిస్తాడు. తన నటన లుక్స్ బాగున్నాయి. యాక్షన్ లో కనిపించాడు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో చాలానే డిజప్పాయింటింగ్ అంశాలు ఉన్నాయి. మొదలైన ఒక పది, పన్నెండు నిమిషాల వరకు సినిమా ఓకే కానీ అక్కడ నుంచి అసలు టార్చర్ మొదలవుతుంది. అసలు హీరో పాత్ర చాలా చిరాకు తెప్పిస్తుంది. ఒక క్లారిటీ తన రోల్ లో లేదు. చెత్త చెత్త పాటలు, ప్రదర్శనలు చేసుకునే హీరో ఏకంగా ఇండియన్ ఐడల్ కి ఎంపిక అయ్యిపోతాడట, ఫైనల్స్ వరకు వెళ్తాడట.

అదే చెత్త ప్రదర్శన పాట చూసి హీరోయిన్ అతనితో ప్రేమలో పడిపోతుంది. ఇదొక హైలైట్.. ఇంకా ఇద్దరి నడుమ సాగే ట్రాక్ లు పరమ బోరింగ్ గా అనిపిస్తాయి. ఓ పక్క హీరో రోల్ సాగదీతగా వెళుతుంటే దానికి తోడు హీరోయిన్ పై సన్నివేశాలు కూడా పోటీ పడుతూ అంతే బోరింగ్ గా ఆల్రెడీ చూసేసిన రెగ్యులర్ కథనంలో సాగుతాయి.

అదే పాత చింతకాయ పచ్చడి నేపథ్యం అందులో మెడికల్ ఎలిమెంట్ పోనీ అదైనా కొత్తదా అంటే అది కూడా కాదు. ఒక మెర్సల్, ఎందుకంటే ప్రేమంట కలిపి మిక్సీలో వేస్తే వచ్చిందే ఈ డియర్ ఉమ. ఇలా పరంగా బోరింగ్ గా ఈ సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో ఎక్కడో చెప్పే మెసేజ్ కోసం అనవసర పాటలు ఊహించని రేంజ్ ల్యాగ్ ని పెట్టి రెండున్నర గంటలు బోరింగ్ సినిమా ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేలా సాగుతుంది.

ఇక ఫైనల్ గా చెప్పుకోక తప్పదు కానీ హీరోయిన్ కూడా సినిమాలో సూట్ కాలేదు. ఫీమేల్ లీడ్ గా మరెవరిని అయినా చూసుకోవాల్సింది. నటిగా సమయ రెడ్డి ఇంకా దృష్టి పెట్టాలి. ఆమె లుక్స్ కూడా బాలేవు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ ఓకే రధన్ సంగీతం కూడా అలా సోసోగా ఉంది. ఎడిటింగ్ బాలేదు. ఇక దర్శకుడు సాయి రాజేష్ మహాదేవ్ విషయానికి వస్తే.. తాను బెటర్ గా కథా కథనాలు తీసుకోవాల్సింది. లవ్, మెడికల్ బ్యాక్ డ్రాప్ లో మెసేజ్ తో ఏదో ట్రై చేద్దాం అనుకున్నారో కానీ చాలా బోరింగ్ గా సినిమాని నడిపించారు. క్లైమాక్స్ లో ప్రభుత్వాలని ప్రశ్నించే కొన్ని డైలాగ్స్ కోసం రెండున్నర గంటల పాటు సెన్స్ లెస్ గా సినిమాని సాగదీశారు. వీటితో తన వర్క్ బాలేదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘డియర్ ఉమ’. ఒక పరమ బోరింగ్ సోషల్ మెసేజ్ డ్రామా అని చెప్పాలి. సినిమాలో దాదాపు అన్ని అంశాలు నిరాశ పరిచే విధంగానే ఉన్నాయి. కేవలం క్లైమాక్స్ మెసేజ్ డైలాగ్స్ కోసం రెండున్నర గంటలు సాగదీసి ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించారు. వీటితో ఈ సినిమాకి దూరంగా ఉంటేనే మంచిది.

123telugu.com Rating: 1.5/5

Reviewed by 123telugu Team 

The post ఓటిటి సమీక్ష: ‘డియర్ ఉమ’ – తెలుగు చిత్రం సన్ నెక్స్ట్ లో ప్రసారం first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2263

Latest Images

Trending Articles



Latest Images