Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2263

ఓటిటి సమీక్ష: ‘కేరళ క్రైమ్ ఫైల్స్ –సీజన్ 2’–తెలుగు డబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో

$
0
0

 Kerala Crime Files S2 web series review

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 20, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : జియో హాట్‌స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అర్జున్ రాధాకృష్ణన్, సిరాజుద్దీన్ నాజర్, ఇంద్రన్స్, రెంజిత్ శేఖర్, హరిశ్రీ అశోకన్ తదితరులు
దర్శకత్వం : బహుళ్ రమేష్
నిర్మాణ సంస్థ : మంకీ బిజినెస్
సంగీత దర్శకుడు : హీషం అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రాఫర్ : జితిన్ స్టనిస్లాష్
ఎడిటర్ : మహేష్ భువనెంద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన లేటెస్ట్ సిరీస్ లలో జియో హాట్ స్టార్ తీసుకొచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నే ‘కేరళ క్రైమ్ ఫైల్స్ – సీజన్ 2’ కూడా ఒకటి. గత సీజన్ కి సక్సెసర్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఈ సిరీస్ సెటప్ అంతా కేరళ లోని ఎర్నాకులం, త్రివేండ్రం తదితర ప్రాంతాల్లో నడుస్తుంది. స్టార్టింగ్ లోనే ఒక మ్యూజియంలో విలువైన వస్తువులు దోపిడీ జరుగుతుంది. ఇంకోపక్క అదే ప్రాంతంలో పని చేసే ఓ సిపిఐ అంబిలి రాజు (ఇంద్రాన్స్) అనే పోలీస్ ఆఫీసర్ అనూహ్యంగా మిస్ అవుతారు. అయితే తన మిస్సింగ్ అతని హత్య అని పోలీసులకి తెలుస్తుంది. దీనితో ఈ కేసు ఎస్సై నోబెల్ (అర్జున్ రాధా కృష్ణన్) దగ్గరకి వస్తుంది. మరి ఈ కేసు ఎలా వెళ్ళింది? ఆ దొంగతనంకి అంబిలి రాజు హత్యకి ఏమన్నా లింక్ ఉందా? మధ్యలో అయ్యప్పన్ (హరిశ్రీ అశోకన్) అలాగే జైమ్సన్ (సిరాజుద్దీన్ నజర్) లు ఎవరు ఈ కేసుతో ఎలా భాగం అయ్యారు? అలాగే వారికీ టెరీ (సింబా) అనే పోలీస్ కుక్కకి లింక్ ఏంటి? చివరికి ఈ కేసుకి ముగింపు ఎలా వచ్చింది అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మళయాళ సినిమాలు లేదా మళయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ని బాగా ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఒకింత క్లిక్ అవ్వచ్చు అని చెప్పాలి. ఒక డీసెంట్ క్రైమ్ లైన్ ని అంతే డీసెంట్ గా మంచి ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ తో ఆకట్టుకునే ఎంగేజింగ్ ట్విస్ట్ లు అక్కడక్కడా సస్పెన్స్ తో కూడిన వివరాలతో చూడాలి అనుకునేవారికి ఈ సీజన్ మంచి ట్రీట్ గా అనిపిస్తుంది.

ఒక పాయింట్ నుంచి మొదలై ఇంకో రకంగా డీవియేట్ అవుతూ ఒకో కనెక్షన్ డెవలప్ అవ్వడం ఈ సీజన్ లో బాగుంది. అలాగే మంచి థ్రిల్లింగ్ అంశాలు మాత్రమే కాకుండా కుక్కలని ఇష్టపడే వారికి ఈ సిరీస్ లో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఇక నటీనటుల్లో అయితే కనిపించిన ప్రతీ కీలక నటుడు మంచి పెర్ఫామెన్స్ ని అందించారు.

సిపిఐ అంబిలి రాజుగా ఇంద్రాన్స్ మంచి నటన కనబరిచారు అలాగే అయ్యప్పన్ నటుడు ఇంకా ఎస్సై నోబెల్ గా అర్జున్ రాధా కృష్ణన్ తన పాత్రలో పడే స్ట్రగుల్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో సిన్సియర్ పెర్ఫామెన్స్ ని తాను అందించారు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా కూడా నాచురల్ పెర్ఫామెన్స్ లతో ఇంప్రెస్ చేస్తారు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో కొన్ని కొన్ని అంశాలు ఓకే కానీ కొన్ని అంశాలు మాత్రం డల్ గా ఉంటాయని చెప్పాలి. ఒక్క చివరి ఎపిసోడ్ తాలూకా నిడివి తప్పితే మిగతా ఎపిసోడ్స్ అంతా చిన్నవే కానీ అందులో కూడా ఒకింత నెమ్మదితనం కనిపిస్తుంది. దీనితో అక్కడక్కడా బోర్ గా అనిపిస్తుంది. అలాగే మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ లో ఒకో కొత్త పాత్ర పరిచయం అవుతూ వస్తుంటాయి.

వీటితో చూసే జెనరల్ ఆడియెన్స్ కి కథనం పక్కదారి పట్టినట్టుగా అనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా తగ్గిస్తే బాగున్ను అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఇంకొన్ని అంశాలు బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయ్యిన ఈ సిరీస్ రివెంజ్ బ్యాక్ డ్రాప్ లోకి వెళుతుంది ఓకే కానీ కొన్ని అనవసర మూమెంట్స్ కి ఇచ్చిన డీటైలింగ్ ఇక్కడ ఇవ్వాల్సింది.

అలాగే మెయిన్ నిందితుడు ఇద్దరినీ ఎలా చంపాడు అనేవి కూడా చూపిస్తే బాగున్ను అని ఓ సెక్షన్ ఆడియెన్స్ ఫీల్ అవ్వొచ్చు వాటిని దర్శకుడు అసంపూర్ణంగా వదిలేసినట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి వాటిలో ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రాపర్ మళయాళ థ్రిల్లర్ కి కావాల్సిన అంశాలు అన్నీ బాగున్నాయి. నాచురల్ విజువల్స్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. జితిన్ స్టనిస్లాష్ ఇచ్చిన కెమెరా విజువల్స్ బాగున్నాయి. ఎక్కడా సహజత్వం లోపించలేదు. అలాగే హీషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన సంగీతం బాగుంది. కొన్ని సీన్స్ లో తన స్కోర్ బాగుంది. మహేష్ భువనెంద్ ఎడిటింగ్ బాగానే ఉంది కానీ ఇంకొన్ని సీన్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేయాల్సింది. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి కథనం స్పీడప్ చేయాల్సింది.

ఇక దర్శకుడు బహుళ్ రమేష్ విషయానికి వస్తే.. తాను డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ లైన్ ని తీసుకున్నారు. ఇందులో డిజైన్ చేసుకున్న ఎమోషనల్ అంశాలు, ఇన్వెస్టిగేషన్ అంశాలు బాగున్నాయి. కాకపోతే అవసరమైన అంశాల్లో ఇంకొంచెం డీటైలింగ్ ఇవ్వాల్సింది. అలాగే కథనం కొన్ని కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే ఈ సిరీస్ మరింత ఎంగేజింగ్ గా అనిపించేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్ – సీజన్ 2’ మళయాళ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి అయితే బాగానే అనిపిస్తుంది. అక్కడక్కడా ఇంట్రెస్టింగ్ గా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అలానే ఎమోషనల్ అంశాలు ఇందులో బాగున్నాయి. కాకపోతే ఇదే మూమెంటం మొత్తం సిరీస్ లో మిస్ అవుతుంది. కొన్ని సన్నివేశాలు ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇవి మినహాయిస్తే ఈ సిరీస్ ని తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

The post ఓటిటి సమీక్ష: ‘కేరళ క్రైమ్ ఫైల్స్ – సీజన్ 2’ – తెలుగు డబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2263

Latest Images

Trending Articles



Latest Images