Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2205

సమీక్ష : ఇజం –మెసేజ్ ఉన్న పూరి మార్క్ సినిమా

$
0
0
ISM review

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : పూరి జగన్నాథ్

నిర్మాత : కళ్యాణ్ రామ్

సంగీతం : అనూప్ రూబెన్స్

నటీనటులు : కళ్యాణ్ రామ్, అధితి ఆర్య

డాషింగ్ డైరెక్షర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ‘ఇజం’. ఫస్ట్ లుక్స్, టీజర్ బాగుండటం, కళ్యాణ్ రామ్ పాత లుక్ ను మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

సత్య మార్తాండ్ (కళ్యాణ్ రామ్) అనే భాద్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రాభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను, దోపిడీని, పేదలు, రైతుల కష్టాలను చూసి తట్టుకోలేక, వాటికి కారణమైన రాజకీయనాయకులు, దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావెద్ భాయ్ (జగపతి బాబు) ను టార్గెట్ చేసుకుంటాడు.

అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబుకు ఎలా దగ్గరయ్యాడు ? అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు ? దాన్ని పేద ప్రజలకు ఎలా పంచాడు ? అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయంలో ముందుగా చెప్పుకోవలసింది కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజన్స్, అతని పెర్ఫార్మెన్స్ గురించి. కళ్యాణ్ రామ్ తన ముందు సినిమాల్లో కన్నా ఇందులో చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ, మ్యానరిజం, ఎమోషనల్ సన్నివేశంలో చూపించిన హావభావాలు చాలా బాగున్నాయి. కళ్యాణ్ రామ్ ను పూర్తిగా మార్చేసి కొత్తగా చూపిస్తూ పూరి ఇచ్చిన ఫ్రెష్ నెస్ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎలివేషన్, పెర్ఫార్మెన్స్ తో బాగానే సాగిపోయింది.

ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమా మొత్తానికీ హైలెట్ గా నిలిచింది. ఆ సన్నివేశంలో పూరి రాసిన సోషల్ డైలాగులు, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఎమోషన్ ను బాగా పండించాయి. అలాగే ఫస్టాఫ్ లో జగపతి బాబుకి, కళ్యాణ్ రామ్ కి మధ్య బీడీ స్నేహం, హీరోయిన్ అధితి ఆర్యకు, కళ్యాణ్ రామ్ కు మధ్య లవ్ సీన్స్ కొన్ని బాగున్నాయి. పాటలు కూడా సందర్భానుసారంగా వస్తూ మంచి ఫీల్ ని ఇచ్చాయి. ముఖ్యంగా పూరి పాడిన పాట బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైన్స్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవలసింది సెకండాఫ్ గురించి. ఇందులో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా మిగతా అన్ని సన్నివేశాలు ఊహాజనితంగానే ఉండి బోర్ కొట్టించాయి. అలాగే జావెద్ భాయ్ గా విలన్ జగపతిబాబుని మొదట్లో ఓ రేంజ్ లో చూపించి ఆ తరువాత పూర్తిగా తేల్చేశాడు. ఇక క్లైమాక్స్ లో అయితే ఇండియాలో జరుగుతున్న కరెప్షన్ కి అండగా నిలిచిన జగపతిబాబుని ఏమాత్రం నొప్పించకుండా ఫ్రీగా వదిలేయడం హీరో లక్ష్యాన్నే దెబ్బ తీసేదిగా ఉండి నిరుత్సాహపరిచింది.

అలాగే హీరోయిన్ అధితి ఆర్య తో ఇంకాస్త పెర్ఫార్మెన్స్ చేయించి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ను హడావుడిగా ముగించేశారు. హీరో నల్ల ధనాన్ని ఇండియాకు తిరిగి తెప్పించడానికి, దోపిడీదారులను బయటకు లాగడానికి చేసిన ప్రయత్నాన్ని రఫ్ గా చూపించేసి వదిలేశారు. దాన్ని ఇంకాస్త వివరంగా చూపించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకోవడంలో, అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగులు, బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్ గా ఉన్నాయి. ఫస్టాఫ్ లో హీరో పాత్ర చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. కానీ సెకండాఫ్ చివర్లో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జడ్జిమెంట్ ఆమోదయోగ్యంగా లేదు. పాటలకు అనూపు రూబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బాగుంది. జునైద్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

తీర్పు :

‘ఇజం’ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది. ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్టాఫ్, కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజన్స్, పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, పాత సోషల్ సబ్జెక్టు కు పూరి ఇచ్చిన కొత్త, ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా, ఊహాజనితమైన, బోరింగ్ సెకండాఫ్ కథనం, జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం, హడావిడిగా క్లైమాక్స్ ను చుట్టేయడం ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ ‘ఇజం’ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2205

Trending Articles