Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2205

సమీక్ష : జయదేవ్ –హీరో కొత్తే అయినా కథ మాత్రం పాతదే

$
0
0
Jayadev movie review

విడుదల తేదీ : జూన్ 30, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : జయంత్ సి. పరాంజీ

నిర్మాత : కె. అశోక్ కుమార్

సంగీతం : మణిశర్మ

నటీనటులు : గంటా రవి, మాళవిక రాజ్

మంత్రి గంటా శ్రీనివాసరావ్ కుమారుడు గంటా రవి హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమానే ఈ ‘జయదేవ్’. జయంత్ సి.పరాంజీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో గంటా రవి ఎంతవరకు మెప్పించాడో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ :

ఒక సిన్సియర్ పోలీసాఫీసరైన జయదేవ్ (గంటా రవి) ఒక పోలీసాఫీసర్ యొక్క హత్య కేసును టేకప్ చేస్తాడు. ఆ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ హత్య వెనుక లిక్కర్ డాన్ (వినోద్ కుమార్) ఉన్నాడని తెలుసుకుంటాడు జయదేవ్. ఇక ఆ తర్వాత జయదేవ్ ఆ డాన్ ను ఎలా ఎదుర్కున్నాడు ? అతన్ని జైలుకి ఎలా పంపాడు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

హీరోగా గంటా రవి ఓకే అనిపించుకున్నాడు. ఫిజిక్ అతనికి బాగా హెల్ప్ అయింది. మంచి సీరియస్ రోల్స్ లో అతను బాగా సెట్టవుతాడు. యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఈజ్ చూపించిన రవి ఇంకొన్ని సినిమాలు చేస్తే పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సుంది. సినిమాకు మరొక ప్లస్ పాయింట్ హీరోయిన్ మాళవిక రాజ్. చూడటానికి అందంగా కనిపిస్తూ ప్రేక్షకులకు కాస్త కనులవిందు చేసింది.

చాలా కాలం తర్వాత వినోద్ కుమార్ ఒక మంచి పాత్ర చేశారు. హీరో ముఖం దాచుకుని చేసే ఫైట్ స్టైలిష్ గా బాగుంది. డ్యూటీలో ఉన్న పోలీసాఫీసర్లు ఎదుర్కునే సమస్యలను ఆసక్తికరంగా చూపించారు. అసలు నేరస్థుల్ని పట్టుకోవడానికి హీరో చేసే ఇన్వెస్టిగేషన్ తాలూకు సన్నివేశాలు కొన్ని మెప్పించాయి.

మైనస్ పాయింట్స్ :

పాత సక్సెస్ ఫుల్ స్టోరీ లైన్ కలిగిన ఈ సినిమా చాలా వరకు ఊహాజనితంగానే ఉంది. కథనంలో కూడా పెద్దగా మలుపులు లేని ఈ సినిమాలో మొదటి సన్నివేశం నుండి తర్వాత ఏం జరుగుంది అనే విషయాన్ని చాలా సులభంగా చెప్పేయొచ్చు.

‘ప్రేమఁనఁచుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారు బాగున్నారా’ లాంటి సినిమాల్ని తీసిన దర్శకుడు జయంత్ సి. పరాంజీ ఈ సినిమాను మరీ ఇంత చప్పగా చెప్పడం కొంచెం బాధాకరం. విలన్ ట్రాక్ కూడా చాలా బలహీనంగా ఉంది. దీంతో కథనంలో బలమైన సన్నివేశాల్ని, సందర్భాల్ని అస్సలు ఆశించనవసరం లేకుండా పోయింది. దానికి తగ్గట్టే దర్శకుడు కూడా సిల్లీ, అవసరం లేని భారీ సీన్లతో సినిమాను ముందుకు తోసేశారు.

కథనంలోని కొన్ని సన్నివేశాలు కొన్నింటికి అస్సలు కొన్నింటికి అర్థమే ఉండదు. హీరో ఉద్యోగం కోల్పోవడం, మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం వంటివి మరీ పేలవంగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల ఎలివేషన్ సీన్లను పెట్టడానికి ఆస్కారమున్నా కూడా ఆ అవకాశాల్ని సరిగా ఉపయోగించుకోలేదు.

సాంకేతిక విభాగం :

నిర్మాణ విలువలు పర్వాలేదని స్థాయిలో ఉన్నాయి. మణిశర్మ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ అంత బాగోలేదు. కొని అనవసరమైన సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. ఇక దర్శకుడు జయంత్ విషయానికొస్తే ఆసక్తికరమైన కథనం లేకుండా ఏదో తీశాం అన్నట్టుండే తీరు విధానం సినిమాలో కనబడిపోతుంది.

తీర్పు :

కొత్త హీరో అయిన గంటా రవికి ‘జయదేవ్’ లాంటి పోలీస్ సబ్జెక్ట్ హెవీ అయింది. ఆరంభం కనుక అయన ఏదైనా సింపుల్ స్టోరీని ఎంచుకుని ఉండాల్సింది. ఆయన తన పాత్రలో మెప్పించడానికి కష్టపడినప్పటికీ ఏమాత్రం ఆసక్తికరంగా లేని నరేషన్, బలమైన సన్నివేశాలు లోపించడం వంటివి సినిమా స్థాయిని కిందికి తీసుకెళ్లి చివరికి చిత్రాన్ని బిలో యావరేజ్ గా నిలబెట్టాయి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2205

Trending Articles