Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : జవాన్ –దేశం కోసం పోరాడే యువకుడి కథ

$
0
0
Jawaan movie review

విడుదల తేదీ : డిసెంబర్ 01, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : బి.వి.ఎస్‌. ర‌వి

నిర్మాత : కృష్ణ‌

సంగీతం : థమన్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్, ప్రసన్న

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. బివిఎస్.రవి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

జై (ధరమ్ తేజ్) చిన్నప్పటి నుండి దేశమంటే భక్తితో పెరిగి పెద్దై డిఆర్డీవోలో ఉద్యోగంలో చేరాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలోనే డిఆర్డీవో శాస్త్రవేత్తలు ఆక్టోపస్ అనే ఒక పవర్ ఫుల్ మిస్సైల్ సిస్టంను కనిపెడతారు.

దాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఆ డీల్ ను కేశవ్ (ప్రసన్న)కు అప్పగిస్తారు. ప్రసన్న దాన్ని దొంగిలించడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తాడు. కానీ ఆ ప్లాన్ ను జై అడ్డుపడతాడు. దాంతో కేశవ్ జై కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అలా ఒకవైపు దేశం, మరోవైపు కుటుంబాన్ని కాపాడాల్సిన విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న జై ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఆక్టోపస్ ను క్రిమినల్స్ చేతిలోకి వెళ్లకుండా ఎలా కాపాడాడు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ అంటే కథానాయకుడు దేశమా, కుటుంబమా అనే క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకోవడమే. ఆ పరిస్థితుల్లో హీరో ఎలా ఆలోచించాడు, ఏ నిర్ణయం తీసుకున్నాడు అనే అంశాల్ని బాగా హ్యాండిల్ చేశాడు రచయిత, దర్శకుడు అయిన బివిఎస్ రవి. ఒకవైపు దేశం కోసం పోరాడుతూనే కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో పడే తపన, చేసే ప్రయత్నాలు బాగున్నాయి.

అలాగే సెకండాఫ్లో హీరో తన కుటుంబంలోని ఫైల్యూర్స్, సక్సెస్ ల గురించి మాట్లాడే ఎమోషనల్ సన్నివేశాలు, అందులోని డైలాగులు మనసుకు హత్తుకున్నాయి. ఇక విలన్ హీరోతోనే తన పని చేయించుకోవాలనుకోవడం, అందుకోసం హీరోని రకరకాల ఇబ్బందులకు గురిచేయడం బాగుంది. ధరమ్ తేజ్ కూడా దేశమంటే భాద్యత కలిగిన యువకుడిగా బాగా నటించాడు. కాస్ట్యూమ్స్ దగ్గర్నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నింటిలోను పర్ఫెక్షన్ చూపిస్తూ, పాటల్లో క్లాస్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు.

మెహ్రీన్ కౌర్ కూడా పాత్ర పరిధి మేరకు గ్లామరస్ గా కనిపిస్తూనే ఆకట్టుకోగా నెగెటివ్ రోల్ లో ప్రసన్న నటన మెప్పించింది. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు బివిఎస్.రవి కథను మంచి లింక్ తోనే మొదలుపెట్టినా ఆద్యంతం దాన్ని అలాగే కొనసాగించడంలో విఫలమయ్యారు. ఆయన రాసుకున్న సన్నివేశాల్లో ఎక్కడా కొత్తదనమనేదే కనబడలేదు. చాలా సినిమాల్లో చూసినట్టుగానే హీరో విలన్ కు అడ్డుతగలడం, విలన్ అతన్ని కష్టపెట్టడం, చివరికి హీరో అతన్ని జయించడం అనే రెగ్యులర్ ఫార్మాట్లోనే సినిమాను నడిపారు. ఫార్మాట్ సాధారణమైనదే అయినా రేసీ స్క్రీన్ ప్లే, కొత్తగా అనిపించే సీన్లు రాసుకుని ఉంటే బాగుండేది.

హీరో, విలన్ ఇద్దర్నీ ఆరంభం నుండి ఎగ్రెస్సివ్ గా, ఇంటెలిజెంట్స్ గా చూపించడంతో కథనం కూడా అలానే మంచి మైండ్ గేమ్ సన్నివేశాలతో వేగంగా నడుస్తుందని ఆశిస్తే అలాంటిదేం లేకుండా సాదా సీదాగా ఉండటంతో ఎక్కడా పెద్దగా ఉత్కంఠ కలుగలేదు. సినిమా చివరి వరకు ఇక విలన్ ని పట్టుకోవడం హీరోకి కష్టమేమో అనే భావన కలిగించి ఆఖరులో కేవలం ఒక్క ఫోన్ ద్వారా అతను పట్టుబడిపోవడం సిల్లీగా అనిపించింది.

అంతేగాక సినిమా ముగింపు కూడా చాలా సాధారణంగా ఉంది, హడావుడిగా ముగిసినట్టు అనిపించింది. దానికి తోడు అసందర్బంగా వచ్చే పాటలు స్పీడ్ బ్రేకర్స్ లా అనిపించాయి.

సాంకేతిక విభాగం :

రచయిత, దర్శకుడు బివిఎస్.రవి నార్మల్, ఎన్నో సినిమాల్లో చూసిన కథాంశాన్నే ఈ సినిమా కోసం కూడా ఎంచుకున్నారు. కానీ దాన్ని ప్రేక్షకులు కోరుకునే, వాళ్ళను ఆకట్టుకునే ఉత్కంఠమైన సన్నివేశాలతో కూడిన కథనంతో నింపలేకపోయారు. దాంతో సినిమా చాలా వరకు రొటీన్ గా, నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలిగింది. హీరో పాత్ర తాలూకు డైలాగ్స్ బాగున్నాయి.

సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటల సంగీతం పర్వాలేదనిపించింది. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ బాగానే ఉంది. కెవి. గుహన్ సినిమాటోగ్రఫీ బాగుంది కానీ నైట్ ఎఫెక్ట్ లో తీసే ఒక కీలకమైన ఫైట్లో మాత్రం క్లారిటీ కొరవడింది. పాటల్లోని నృత్యాలు అలరించాయి. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

బివిఎస్.రవి, ధరమ్ తేజ్ కలిసి చేసిన ఈ ‘జవాన్’ అనే ప్రయత్నం స్క్రీన్ మీద ఆశించిన స్థాయిలో పండలేదు. సెకండాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్, తేజ్ పెర్ఫారెన్స్, డ్యాన్సులు, దర్శకుడు కథ కోసం ఎంచుకున్న పాయింట్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా ఏమాత్రం కొత్తదనం, ఉత్కంఠ లేని కథనం, సాదా సీదా రొటీన్ సన్నివేశాలు, హడావుడిగా ముగిసిన క్లైమాక్స్ ప్రేక్షకుల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. మొత్తం మీద చెప్పాలంటే పెద్దగా కొత్తదనం లేకుండా రొటీన్ గా సాగే ఈ ‘జవాన్’ రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లను ఇష్టపడేవారికి నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles