Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : హలో –ఎమోషనల్ లవ్ జర్నీ

$
0
0
Hello movie review

విడుదల తేదీ : డిసెంబర్ 22, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : అఖిల్‌ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్‌

దర్శకత్వం : విక్రమ్‌ కె. కుమార్‌

నిర్మాత : అక్కినేని నాగార్జున

సంగీతం : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫర్ : పి. ఎస్‌. వినోద్‌

ఎడిటర్ : ప్రవీణ్‌ పూడి

అక్కినేని అఖిల్ హీరోగా చేసిన రెండవ సినిమా ‘హలో’ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. నాగార్జున నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అనాథైన శీను (అఖిల్) తన చిన్నప్పటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి ప్రియదర్శిన్) ను ఎంతో అభిమానిస్తాడు. జున్ను కూడా శీను అంటే ఎంతో అభిమానం చూపిస్తుంది. అలా వాళ్ళిద్దరి స్నేహం కొనసాగుతుండగా జున్ను ఢిల్లీ వెళ్లిపోతూ అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటుంది.

కానీ ఆ నెంబర్ ను పోగొట్టుకున్న శీను జున్ను ఎప్పటికైనా తిరిగొస్తుందని 13 ఏళ్ల నుండి ఎదురుచూస్తూనే ఉంటాడు. అలా ఎదురుచూపుల్లో ఉన్న శీనును జున్ను ఎలా కలిసింది ? ఆమెను చేరుకోవడానికి శీను ఎలాంటి సాహసాలు చేశాడు ? విధి వాళ్ళిద్దర్నీ ఎలా కలిపింది ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ ఫస్టాఫ్. సినిమాను మొదలుపెట్టడమే ఆహ్లాదకరంగా మొదలుపెట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఇంటర్వెల్ వరకు అలాగే కొనసాగించాడు. హీరో పాత్రని పెద్ద హాడావుడి లేకుండా కూల్ గా నడిపిస్తూ అతని చుట్టూ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ను బిల్డ్ చేశాడు. కొన్ని సీన్స్ లో రమ్యక్రిష్ణ, జగపతిబాబుల నటనతో కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇక హీరో హీరోయిన్ల చినప్పటి స్టోరీని కూడా అందంగా, చూడాలనిపించే విధంగా తీర్చిదిద్దారు. అంతేగాక అందులోని భావోద్వేగాన్ని చాలా సేపటి వరకు అలాగే కొనసాగించి మంచి ఎమోషన్ క్యారీ అయ్యేలా చేశాడు.

ఇక ఒక హీరోగా అఖిల్ సినిమాకు ఎంత చేయాలో అంతా చేశాడు. మంచి స్టంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ తేలికపాటి ఎమోషన్స్ ను అలవోకగా పలికిస్తూ ఎక్కడా వంక పెట్టడానికి లేని విధంగా పెర్ఫార్మ్ చేశాడు. సినిమాకు మరొక పెద్ద ప్లస్ టెక్నికల్ టీమ్. అనూప్ రూబెన్స్ తన సంగీతంతో ఆరంభం నుండి చివరి వరకు సినిమాను అందంగా తయారుచేశాడు. పాటలు, నైపథ్య సంగీతం అన్నీ బాగా కుదిరాయి. ఫస్టాఫ్ లో వచ్చే యాక్షన్ స్టంట్స్ కొత్తగా, రియలిస్టిక్ గా అనిపించాయి. పి.ఎస్.వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించాడు.

మైనస్ పాయింట్స్ :

ఇంటర్వెల్ సమయానికి హీరో హీరోయిన్లను దగ్గర చేసిన దర్శకుడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ ను నడపలేకపోయాడు. సినిమా ముఖ్య ఉద్దేశ్యం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, అది గెలవడం అయినప్పుడు వారిద్దరి మధ్య దాని తీవ్రత, దాన్ని పొందడానికి వాళ్ళు పడే తపనను అధికంగా హైలెట్ చేయాలి. కానీ ఇందులో అలాంటివి పెద్దగా కనబడలేదు.

కేవలం హీరో హీరోయిన్ల మాటల్లోనే ప్రేమను మిస్సయ్యాం, దాన్ని పొందాలి అనే భావం కనిపిస్తుంది కానీ దాని కోసం వాళ్ళు క్లైమాక్స్ లో తప్ప ఇంకెక్కడా పెద్దగా ప్రయత్నించకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కొంత ఎమోషనల్ డ్రామాను ప్లే చేసి ఉంటే ప్రేక్షకులు ఇంకాస్త సంతృప్తి చెందేవారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు విక్రమ్ కుమార్ కొంత నార్మల్ కథనే తీసుకున్నా దానికి యాక్షన్ ను జోడించి సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు. హీరో హీరోయిన్ల చిన్నప్పటి కథలో మనసుకు హత్తుకునే ఎమోషన్ ను చూపెట్టినా పెద్దయ్యాక వారు కలుసుకున్నాక వారి మధ్యన అంతటి భావోద్వేగం పండలేదు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ బాబ్ బ్రౌన్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి.

అనూప్ రూబెన్స్ పాటలు సంగీతం, నైపథ్య సంగీతం అన్నీ సినిమాకు బాగా హెల్ప్ అవుతాయి. అన్నీ వినడానికి చాలా బాగున్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగానే ఉంది. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాతగా నాగార్జునగారు సినిమాను గొప్ప స్థాయిలో నిలబెట్టారు.

తీర్పు :

అక్కినేని అభిమానులు అఖిల్ ను ఎలా అయితే చూడాలనుకున్నారు విక్రమ్ కుమార్ ‘హలో’ లో అలానే చూపించారు. ఈ సినిమా ఆయనకు పర్ఫెక్ట్ రీలాంచ్. ఫస్టాఫ్ లో ఉండే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో హీరోయిన్ల చిన్ననాటి ఎమోషనల్ కథ, దాన్ని దర్శకుడు అలాగే ముందుకు తీసుకెళ్లిన విధానం, స్టంట్స్, అఖిల్ పెర్ఫార్మెన్స్ మెప్పించే అంశాలు కాగా సెకండాఫ్ కథనంలో వేగం లోపించడం, హీరో హీరోయిన్ల మధ్యన రొమాంటిక్ ట్రాక్, వారిలో మిస్సైన ప్రేమను దక్కించుకోవాలనే తపన పెద్దగా కనబడకపోవడం కొంత నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద ఈ ‘హలో’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల చిత్రం.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles