Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2262

సమీక్ష : రాజ్‌దూత్ –ఆకట్టుకోలేకపోయిన బైక్ జర్నీ !

$
0
0
Rajdoot movie review

విడుదల తేదీ : జూలై 12, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2/5

నటీనటులు : మేఘాంశ్, సుదర్శన్, నక్షత్ర , ఆదిత్య తదితరులు

దర్శకత్వం : కార్తీక్-అర్జున్

నిర్మాత‌లు : ఎం ఎల్ వి సత్యనారాయ

సంగీతం : వరుణ్ సునీల్

సినిమాటోగ్రఫర్ : విద్యా సాగర్ చింత

ఎడిటర్ : విజయ్ వర్ధన్ కావూరి


స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్‌ దూత్‌’. నక్షత్ర హీరోయిన్ గా అర్జున్‌ – కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

సంజయ్ (మేఘాంశ్) తన ఫాదర్ ఫ్రెండ్ కూతురు అయిన ప్రియ(నక్షత్ర)ని ప్రేమిస్తాడు. తమ ఇద్దరికీ పెళ్లి చేయమని ‘ప్రియ ఫాదర్’ వెంట పడుతూ పదే పదే రిక్వెస్ట్ చేస్తుంటాడు. అయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేని సంజయ్ ని మార్చాలనే ఉద్దేశ్యంతో ‘ప్రియ ఫాదర్’, ‘రాజ్ దూత్‌’ బైక్ ని తీసుకోని వస్తే నీ గురించి ఆలోచిస్తానంటాడు. దాంతో తన ప్రేమను గెలిపించుకోవడానికి సంజయ్ ఆ బైక్ తీసుకురావడానికి బయల్దేరతాడు. ఆ ప్రయాణంలో సంజయ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అప్పటికే చాలా చేతులు మారిన ఆ బైక్ చివరికీ ఎవరి దగ్గరకి చేరుతుంది ? ఇంతకీ ‘ప్రియ ఫాదర్’ ఆ ‘రాజ్ దూత్’ బైక్ నే ఎందుకు తెమ్మని చెప్పాడు ? మరి సంజయ్ కి ఆ బైక్ దొరికిందా ? బైక్ తీసుకోని వస్తాడా ? ఫైనల్ గా ప్రేమించిన ప్రియను సొంతం చేసుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

రియల్ స్టార్ శ్రీహరికి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మేఘాంశ్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు. అదే విధంగా సెసెకెండ్ హాఫ్ లో బైక్ తీసుకోని వెళ్లిపోయే సన్నివేశంలో తన హావభావాలతో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.

ఇక హీరోయిన్ గా నటించిన నక్షత్ర బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరోయిన్ కి తండ్రిగా నటించిన నటుడు, ఇతర కీలక పాత్రల్లో నటించిన సుదర్శన్, మనోబాల ఎప్పటిలాగే తమ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

మెయిన్ గా సినిమాలో స్టోరీ పాయింటే చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. కథకు అవసరం లేని కామెడీ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా విషయం లేని ఆ కామెడీ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

మొత్తానికి దర్శకులు తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయారు. కంటెంట్ పరంగా మంచి ఎంటర్ టైన్మెంట్ మరియు భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకులు మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు.

దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. బోరింగ్ ట్రీట్మెంట్ తో పాటు ఆసక్తి కలగించలేని కొన్ని కీలక సన్నివేశాల కారణంగా.. ప్లే లో సరైన ప్లో కూడా లేకుండా పోయింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకులు కార్తీక్ – అర్జున్ కొన్ని బైక్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఆయన చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు వరుణ్ సునీల్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ఎం ఎల్ వి సత్యనారాయ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని బైక్ జర్నీ సన్నివేశాలు, అక్కడక్కడా రేర్ గా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదనిపించినా.. కథా కథనాలు ఏ మాత్రం ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని బాగా దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
123telugu.com Rating :  2 /5

Reviewed by 123telugu Team


Viewing all articles
Browse latest Browse all 2262

Latest Images

Trending Articles



Latest Images