Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2258

సమీక్ష : భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు –గందరగోళంగా సాగే కామెడీ !

$
0
0
Bhagya Nagara Veedhullo Gammathu review

విడుదల తేదీ : డిసెంబర్  06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు :  శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్, సత్య, వెన్నెల కిషోర్, చిత్రం శ్రీను, రచ్చ రవి, సత్యం రాజేష్, రఘుబాబు, ప్రవీణ్ తదితరులు

దర్శకత్వం : వై. శ్రీనివాస రెడ్డి

నిర్మాత‌లు : వై. శ్రీనివాస రెడ్డి

సంగీతం :  సాకేత్ కొమాండూరి

ఎడిటర్:  ఆవుల వెంకటేష్

కమెడియన్ నుండి హీరోగా మారి పలు సినిమాలు చేసిన శ్రీనివాస రెడ్డి.. ఈ సారి దర్శక నిర్మాతగా కొత్త టర్న్ తీసుకుని తానే హీరోగా రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. ఇక స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ఇతర ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

శ్రీనివాస్ రెడ్డి (శ్రీనివాస్ రెడ్డి), తన ఫ్రెండ్స్ స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ లతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో వారికి ఓ అవకాశం వస్తోంది. హీరోయిన్ గా యాక్ట్ చెయ్యటానికి ఒక అందమైన అమ్మాయిని తీసుకొస్తే.. నిన్నే హీరోగా పెట్టి షార్ట్ ఫిల్మ్స్ చేస్తా అని డైరెక్టర్ (రఘుబాబు) చెప్తాడు. దాంతో అందమైన అమ్మాయి కోసం వెతుకులాట మొదలెట్టిన శ్రీనివాస్ రెడ్డి గ్యాంగ్ కి.. సిటీలో డ్రగ్స్ గ్యాంగ్ కి, అలాగే పోలీస్ లకు మధ్య జరిగే కొన్ని సంఘటనల అనంతరం కథ అనేక రకాలుగా అక్కడక్కడే మలుపులు తిరిగి మళ్ళీ ఓ లాటరీ టికెట్ మీదకొచ్చి.. చివరికీ పోలీస్ స్టేషన్ లో ఆగి.. ఓవరాల్ గా ఇప్పటివరకూ జరిగిన అనేక అంశాలకు క్లారిటీ ఇస్తూ.. ఫైనల్ గా శుభం కార్డు వేసుకుంటుంది.

ప్లస్ పాయింట్స్:

నో యాక్ష‌న్‌, నో సెంటిమెంట్.. ఓన్లీ కామెడీనే అంటూ వచ్చిన ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి.. అలాగే ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించిన స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ఎలాంటి గ్యాప్ లేకుండా తమ కామెడీ టైమింగ్ తో విషయం లేని సీన్స్ లో కూడా నవించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. కొన్ని చోట్ల బాగానే నవ్వించారు కూడా. ముఖ్యంగా రసగుల్ల సీక్వెన్స్ మరియు సత్య సీన్స్ కొన్ని బాగున్నాయి. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన వెన్నెల కిషోర్ తన ఫన్నీ డైలాగ్స్ తో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు కథలో కామెడీతో కూడుకున్న సీరియస్ నెస్ కూడా తీసుకొచ్చారు.

ఇక హీరోయిన్ నటించిన నటి కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన కమెడియన్లు కొద్ది సేపే కనిపించనా తమ కామెడీ పల్స్ తో వాళ్ళు కూడా అక్కడక్కడా నవ్వించే ఓ ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించాం అనిపించున్నారు. ఇక దర్శకుడిగా శ్రీనివాస్ రెడ్డి ఎక్కువుగా వీలైనంత వరకు నవ్వించాడనికే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్:

యాక్టర్ గా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వించే శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి దర్శకుడిగా మారి చేసిన ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఆయన దర్శకత్వ పనితనం బాగున్నా.. తీసుకున్న స్క్రిప్ట్ లో విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతింది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి అనేక ట్రాక్ లు ఉన్నాయి గానీ, మెయిన్ గా ఏ సీక్వెన్స్ ఇంట్రస్ట్ గా సాగలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో వర్కౌట్ కాని కామెడీతో సాగితే , సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో సాగుతుంది.

సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయి సినిమానే అర్థమయిపోతుంది. ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయటానికి అమ్మాయి కోసం సిటీ మొత్తం గాలించడం.. దానికి తోడు ఓ సాంగ్ వేసుకోవడంతోటే ఆడియన్స్ కి ఈ సినిమా పై ఒక అవగాహన వచ్చేస్తోంది. అయితే శ్రీనివాస్ రెడ్డి గ్యాంగ్ మాత్రం నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది.

కానీ ప్రేక్షకులను మాత్రం పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయింది. సినిమాలో అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. అవసరానికి మించిన పండని హాస్య సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడిగా శ్రీనివాస్ రెడ్డి సరైన స్క్రిప్ట్ ను తీసుకోలేదు. అయితే కొన్ని సీన్స్ ను ఆయన స్క్రీన్ మీద బాగా ఎగ్జిక్యూట్ చేశారు. భరణి కె. ధరణ్ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. అయితే సినిమాలో చాల చోట్ల సినిమాటోగ్రఫీ మైనస్ గానే నిలుస్తోంది. ఎడిటర్ ఆవుల వెంకటేష్ గురించి ఆయన చేసిన ఎడిటింగ్ గురించి చెప్పుకోవటానికి ఏమిలేదు. సాకేత్ కొమాండూరి అందించిన సంగీతం జస్ట్ సో సో గా అనిపిస్తోంది. అయితే నేపథ్య సంగీతంలో చాల వరకూ గతంలో వచ్చిన సౌండ్స్ నే సాకేత్ కొమాండూరి వాడేశారు. ఈ చిత్ర నిర్మాతగా కూడా వ్యవహరించిన శ్రీనివాస్ రెడ్డి కథకు తగ్గట్లుగానే ఖర్చు పెట్టారు.

తీర్పు :

శ్రీనివాస రెడ్డి..హీరోతో పాటు దర్శక నిర్మాతగా కూడా టర్న్ తీసుకుని చేసిన ఈ సినిమా ఆసక్తికరంగా సాగదు. కానీ, కొన్ని కామెడీ సన్నివేశాలు, శ్రీనివాస్ రెడ్డి సత్యల కామెడీ టైమింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచినప్పటికీ.. సినిమాని మాత్రం నిలబెట్టలేకపోయాయి. కథాకథనాల్లో అసలు ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడం, చాల చోట్ల ఉన్న కామెడీ కూడా బోర్ గా సాగడం, సినిమాలో బేసిక్ లాజిక్ లు కూడా లేకపోవడం పైగా చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా గందరగోళంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here English Vesrion


Viewing all articles
Browse latest Browse all 2258