Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2262

సమీక్ష : వెంకీ మామ –ఆకట్టుకునే మామా అల్లుళ్ళు

$
0
0
Venky Mama review

విడుదల తేదీ : డిసెంబర్  13, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు :  వెంకటేష్ నాగచైతన్య, పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా, నాజర్, ప్రకాష్ రాజ్, విద్యుల్లేఖ రామన్, రావు రమేష్, దాసరి అరుణ్ కుమార్, చమ్మక్ చంద్ర తదితరులు

దర్శకత్వం : : కె ఎస్ రవీంద్ర(బాబీ)

నిర్మాత‌లు : సురేష్ బాబు, టి జి విశ్వప్రసాద్

సంగీతం :  ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ళ

ఎడిటర్:  ప్రవీణ్ పూడి

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ:

 

కార్తీక్ శివరామ్ (నాగ చైతన్య) చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య చేతే నష్టజాతకుడిగా పిలవబడుతున్న క్రమంలో కార్తీక్ కి తల్లితండ్రిగా మారతాడు అతని మేన మావయ్య వెంకట రత్నం (వెంకటేష్). కార్తీక్ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తం కార్తీక్ హ్యాపినెస్ కోసమే త్యాగం చేస్తాడు. అది తెలిసిన కార్తీక్ ఎలాగైనా తన మామయ్య పెళ్లి చెయ్యాలనే ఉద్దేశ్యంతో స్కూల్ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్ పుత్)కు వెంకట రత్నం మధ్య ప్రేమ పుట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇటు వెంకట రత్నం కూడా కార్తీక్ ప్రేమించిన హారిక (రాశి ఖన్నా)ను ఒప్పించి కార్తీక్ ను హారికను కలపాలని ట్రై చేస్తాడు. అయితే అంతలో కార్తీక్ జీవితానికి సంబంధించి వారికి ఒక నిజం తెలుస్తోంది. ఆ తరువాత జరిగిన కొన్ని ఊహించని పరిణామాల అనంతరం కార్తీక్ తన మామయ్యకు శాశ్వతంగా దూరమయిపోవటానికి ఆర్మీలోకి వెళ్ళిపోతాడు. కార్తీక్ తన మామయ్యకి ఎందుకు దూరం అవ్వాలనుకున్నాడు? ఇంతకీ కార్తీక్ జీవితానికి సంబంధించిన నిజం ఏమిటి? ఈ మధ్యలో కార్తీక్ ఆర్మీ నుండి ఎలా మిస్ అయిపోతాడు? కార్తీక్ కోసం వెంకట రత్నం ఏమి చేశాడు? కార్తీక్ ను ఎలా కనిపెట్టాడు? చివరికి వాళ్లిద్దరూ ఒకటయ్యారా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ ‘వెంకీ మామ’లో డీసెంట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు గుడ్ ఎమోషన్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ – రాశి ఖన్నాల మధ్య కామెడీ సీన్స్, అలాగే చైతు – పాయల్ మధ్య ట్రాక్ మరియు మిగిలిన సెటప్ లో భాగంగా వచ్చే సీన్స్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌ గా సాగుతాయి. అలాగే ఇంటర్వెల్ లోని యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఈ మధ్య కాలంలో తన మ్యూజిక్ తో సంచలనం సృష్టిస్తోన్న తమన్ ఈ సినిమాకి అందించిన సంగీతం కూడా బాగుంది. మరియు హీరోల మధ్య కెమిస్ట్రీ అండ్ ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంటాయి.

ఇక వెంకట రత్నం అనే పాత్రలో వెంకటేష్ తన పాత్రకు తగ్గట్లు… తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాయల్ తో సాగే లవ్ ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో వెంకీ అద్భుతంగా నటించాడు. అలాగే మేనల్లుడిగా కనిపించిన నాగచైతన్య కూడా బాగా నటించాడు.

హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా – పాయల్ లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన రావు రమేష్, తాతయ్యగా నాజర్ ఎప్పటిలాగే తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.

 

మైనస్ పాయింట్స్:

 

దర్శకుడు బాబీ రాసుకున్న కామెడీ ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆర్మీ సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల ప్లే ఆసక్తికరంగా సాగదు. అలాగే మామఅల్లుళ్ళు వీడిపోవటానికి కారణమైన పాయింట్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినా.. ఆ డ్రామాని ఇంకా బలంగా రాసుకొని ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది.

మొత్తంగా దర్శకుడు మంచి కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. కొన్ని సన్నివేశాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో చైతు పాత్రకి సంబదించిన ట్రాక్ ఇంకా ఎఫక్టీవ్ గా చూపించి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం:

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఎడిటింగ్ బాగుంది గాని, ఆసక్తికరంగా సాగని కొన్ని సీన్స్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. విలేజ్ సన్నివేశాల్లోని విజువల్స్ ను కెమెరామెన్ చాలా సహజంగా చూపించారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

 

తీర్పు:

 

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలయికలో వచ్చిన ఈ ఎమోషనల్ క్రేజీ మల్టీస్టారర్.. సరదాగా మంచి ఫన్ తో సాగుతూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడా బాగానే ఆకట్టుకుటుంది. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అవ్వడం, మొయిన్ గా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ స్ లో వచ్చే సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు లేకపోవడం వంటి అంశాలు సినిమాలో మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఐతే వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో బాగా అలరించారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Version


Viewing all articles
Browse latest Browse all 2262

Latest Images

Trending Articles



Latest Images