Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : “గామి”–డీసెంట్ గా సాగే మంచి ప్రయత్నం

$
0
0
Gaami Movie Review in Telugu

విడుదల తేదీ: మార్చి 08, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెడదా, శాంతి రావు, మయాంక్ పరాక్ మరియు ఇతరులు

దర్శకుడు: విద్యాధర్ కాగిత

నిర్మాత: కార్తీక్ శబరీష్ మరియు చాలా మంది క్రౌడ్ ఫండర్లు

సంగీత దర్శకులు: నరేష్

సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్ రెడ్డి సి.హెచ్

ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్

సంబంధిత లింక్స్: ట్రైలర్

రీసెంట్ గా టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపి ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “గామి”. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ తో క్రియేట్ చేసిన బజ్ ని అంచనాలు అందుకుందా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథ లోకి వస్తే.. మానవ స్పర్శని తట్టుకోలేని ఓ అఘోర శంకర్(విశ్వక్ సేన్) తనకి ఉన్న ఈ లోపం కారణంగా ఈ ప్రపంచంలో ఇమడ లేకపోతాడు. అయితే ఈ క్రమంలో తనకి ఉన్న లోపాన్ని నయం చేసే తారకా మాలిపత్రాలు ప్రతి 36ఏళ్ళకి ఒకసారి మాత్రమే ధ్రువనగిరి ప్రాంతంలో ఉంటాయని తెలుసుకుంటాడు. మరి అక్కడికి పయణమైన తన ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి(చాందిని చౌదరి) తోడవుతుంది. అయితే ఇంకో పక్క శంకర్ ని కొందరి విజువల్స్ వెంటాడుతూ ఉంటాయి. ఇందులో కనిపించే అభినయ(దుర్గ), అలాగే ఇండియా చైనా బోర్డర్ లో జరిగే ఒక ల్యాబ్ లో సబ్జెక్ట్ సిటీ – 333(మొహమ్మద్ షమద్) వీరు తనకి ఎందుకు కనిపిస్తారు? తాను తన గమ్యాన్ని చేరుకున్నాడా లేదా? అసలు శంకర్ గతం ఏమిటి? వారికి తనకి సంబంధం ఏమన్నా ఉందా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రంని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంతో డెఫినెట్ గా విశ్వక్ సేన్ నుంచి మరో సాలిడ్ ప్రయత్నం అని చెప్పాలి. ఈ చిత్రంతో తన నుంచి మరిన్ని ప్రామిసింగ్ సబ్జెక్ట్ లు ఆశించవచ్చు. అయితే ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ కూడా నీట్ గా ఉందని చెప్పాలి. అఘోర పాత్రలో తనని ఎవరైనా ముట్టుకుంటే తట్టుకోలేని వ్యక్తిగా తాను తన రోల్ కి పూర్తి న్యాయం చేసాడు.

అలాగే నటి చాందిని చౌదరి కూడా విశ్వక్ కి డీసెంట్ సపోర్టింగ్ రోల్ కనిపించి తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవడమే కాకుండా కొన్ని కష్టతరమైన సన్నివేశాల్ని చేయడం మెచ్చుకొని తీరాలి. అలాగే నటి అభినయ మరోసారి తన రోల్ లో షైన్ అయ్యారని చెప్పాలి. ఆమెపై కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

ఇక వీరితో పాటుగా బాల్య నటులు ఇతర ప్రధాన తారాగణం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇంకా సినిమాలో బాగా ఎగ్జైట్ చేసే అంశం ఆ విజువల్స్ మరియు నేపథ్య సంగీతం హైలైట్ అని చెప్పవచ్చు. ఆ గ్రాండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో పలు సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. అలాగే క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ఓ సెక్షన్ ఆడియెన్స్ ని మెప్పించవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మెయిన్ థీమ్ పాయింట్ డీసెంట్ గానే ఉంది కానీ పూర్తి స్థాయిలో సినిమా ఎగ్జైటింగ్ గా అనిపించదు. అలాగే ట్రైలర్ లోని విజువల్స్ అవీ చూసి చాలా మంది ఎగ్జైట్ అయ్యి ఉండొచ్చు అయితే ఇవి ఉన్నాయి కానీ వీటి విషయంలో కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే మంచిది. అలాగే పలు సీన్స్ లో లాజిక్స్ కూడా బాగా మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది.

వీటితో పాటుగా హై మూమెంట్స్ ని కూడా ఇంకాస్త దట్టించి ఉంటే బాగుండేది. అలాగే సెకండాఫ్ లో కొన్ని చోట్ల నరేషన్ మనం ఆల్రెడీ ఊహించే రేంజ్ లోనే అనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ నుంచి కూడా కొంచెం స్లో గానే కథనం సాగుతుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మరికొన్ని సీన్స్ ని డిటైలింగ్ గా ప్రెజెంట్ చేస్తే చూసే ఆడియెన్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు కోసం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. క్రౌడ్ ఫండింగ్ అంటూ చేసిన ఈ హానెస్ట్ అటెంప్ట్ చాలా తక్కువ బడ్జెట్ లో చూపించిన అవుట్ పుట్ మాత్రం ఊహించనిది అని చెప్పవచ్చు. ఈ విషయంలో టెక్నికల్ టీం అంతటికీ క్రెడిట్ వెళుతుంది. ఇక టెక్నికల్ టీం లో నరేష్ కుమారన్ ఇచ్చిన సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే విశ్వనాథ్ రెడ్డి ఇచ్చిన గ్రాండ్ విజువల్స్ బాగున్నాయి. ఇక ఎడిటింగ్ పర్వాలేదు. డైలాగ్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడు విద్యాధర్ కాగిత విషయానికి వస్తే.. తాను మంచి పాయింట్ ని తీసుకొని దానిని ఈ రేంజ్ విజువల్స్ తో అందులోని ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రెజెంట్ చేయడం హర్షణీయం. అలాగే విశ్వక్ పాత్రని తాను డిజైన్ చేసిన విధానం దానిని ప్రెజెంట్ చేయడం చాలా బాగుంది. అలాగే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా లేకుండా కూడా తాను ఆడియెన్స్ ని కూర్చోబెట్టగలగడం విశేషం. అయితే తాను కొన్ని అంశాల్లో మాత్రం లాజికల్ గా కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని చోట్ల కథనం స్లోగా నడిపించాడు. ఇవి మినహా తన వర్క్ ఈ చిత్రానికి మెప్పిస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “గామి” ఖచ్చితంగా విశ్వక్ సేన్ కెరీర్ లో మంచి యూనిక్ అండ్ డేరింగ్ అటెంప్ట్ అని చెప్పాలి. తాను సహా ఇతర మెయిన్ తారాగణం కూడా సినిమాలో మెప్పిస్తారు. అలాగే వీటితో పాటుగా సినిమాలో టెక్నికల్ వాల్యూస్, మెయిన్ పాయింట్ పట్టుకొని నడిచే కథనం కొన్ని చోట్ల ఆసక్తిగా సాగుతుంది. అయితే కొంతమేర స్లో నరేషన్, కొన్ని లాజిక్స్ ని పక్కన పెడితే దర్శకుడు చెప్పాలనుకున్న ప్రయత్నం ఈ వారంతానికి థియేటర్స్ లో డీసెంట్ ట్రీట్ ని అందిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష : “గామి” – డీసెంట్ గా సాగే మంచి ప్రయత్నం first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles