Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : ఆర్జీవీ శపథం –బోరింగ్ పొలిటికల్ డ్రామా

$
0
0
Shapadham Movie Review in Telugu

విడుదల తేదీ: మార్చి 08, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు: అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ, వాసు ఇంటూరి, కోట జయరామ్, ఎలీనా తుతేజా తదితరులు.

దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ

నిర్మాత: రామదూత క్రియేషన్స్, ఆర్జీసీ ఆర్వీ గ్రూప్

సంగీత దర్శకుడు: ఆనంద్

సినిమాటోగ్రాఫర్‌: సజీశ్ రాజేంద్రన్

ఎడిటింగ్: మనీష్ ఠాకూర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా మూవీ శపథం తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది పూర్తి సమీక్షలో చూద్దాం.

కథ :

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల అనంతరం శపధం సాగుతుంది. జగన్ మోహన్ రెడ్డి (అజ్మల్ అమీర్) ముఖ్యమంత్రిగా ఆ ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు (ధనంజయ్ ప్రభునే) రానున్న 2024 ఎన్నికల్లో జగన్‌ను సవాలు చేయడానికి పవన్ కళ్యాణ్ (చింటూ) తో పొత్తు పెట్టుకోవాలని చూస్తారు. కాగా ఈ కథనం ఆ ఐదేళ్లలో జరిగే క్లిష్టమైన రాజకీయ ఎత్తుగడలను చూపిస్తూ సాగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా శపథం మూవీలో అందరు రియల్ పాత్రలని చూపిస్తూ ఆయా పాత్రల్లో పలువురు నట్లని తీసుకుని మూవీ తెరకెక్కించారు ఆర్జీవీ. ఇక చంద్రబాబుగా ధనంజయ్ ప్రభునే, జగన్ గా అజ్మల్, పవన్ కళ్యాణ్ గా చింటూ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. అలానే జగన్ భార్య వైఎస్ భారతిగా మానస రాధాకృష్ణన్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ఇక కథనం కూడా నటీనటుల పెర్ఫార్మన్స్ లు వారి సంభాషణలు కథానుగుణంగా బాగున్నాయి. మిగతా పాత్రలు కూడా పర్వాలేదు.

మైనస్ పాయింట్స్ :

పాత్రధారుల యొక్క నటన బాగున్నప్పటికీ మెయిన్ పాయింట్ చిన్నది కావడంతో దానిని ఆకట్టుకునే రీతిన ఆర్జీవీ తెరకెక్కించలేకపోయారు. ముఖ్యంగా ఆయా పాత్రలను సెటైరికల్ గా తీయడంతో పాటు డ్రామాని కూడా పండించేకపోయారు. స్క్రీన్‌ప్లేలో పట్టు లేదు, దీని ఫలితంగా కథనం ఆకర్షించడంలో విఫలమైంది. సబ్‌పార్ సౌండ్ డిజైన్ మరియు ఆహ్లాదకరమైన మ్యూజికల్ స్కోర్‌తో కలిపి, ఆర్జీవీ స్వయంగా పాడిన పాట కూడా మూవీ పై అసంబద్ధమైన అనుభూతిని అందిస్తుంది. కథనం బలవంతంగా సాగిదీసినట్లుగా అనిపించడంతో పాటు వేగంగా చిత్రీకరించడంతో సీన్స్ యొక్క కూర్పు పరంగా కూడా సినిమాలో లోపాలు కనపడతాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఆర్జీవీ తాను అనుకున్న విజన్ కి ఈ కథ ద్వారా జీవం పోయడంలో విఫలమయ్యారు మరియు అసంబద్ధమైన కథాకథనం మరియు ప్రేరణ లేని సినిమాటోగ్రఫీతో సినిమా నిరాసక్తతతో సాగుతుంది. సంగీత పరంగా కావలసిన టోన్‌ను సెట్ చేయడంలో విఫలమైంది, ఇక ఎడిటింగ్ పరంగా కొన్ని సన్నివేశాలు మూవీ రెండు భాగాలలో కథనాన్ని ఇబ్బందికరంగా మారుస్తాయి.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే ఆర్జీవీ తెరకెక్కించిన శపథం మూవీ ఒక సిల్లీ పొలిటికల్ డ్రామా అని చెప్పాలి. అలానే చాలా వరకు నిరాశాజనకంగా సాగుతుంది. నటీనటుల యొక్క పెర్‌ఫార్మెన్స్‌లు ఓకే అయినప్పటికీ, సినిమా యొక్క అసంబద్ధమైన కథనం మరియు సాంకేతిక లోపాలు దాని ప్రభావాన్ని తగ్గించాయి. ఇక ఈవారం దీని బదులు ప్రేక్షకులు మరొక సినిమాని సెలెక్ట్ చేసుకోవచ్చు.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష : ఆర్జీవీ శపథం – బోరింగ్ పొలిటికల్ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles