Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2236

సమీక్ష : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ –పర్వాలేదనిపించే రొటీన్ ఫన్ డ్రామా !

$
0
0
maruthi nagar subramanyam Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 23, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ తదితరులు

దర్శకుడు: లక్ష్మణ్ కార్య

నిర్మాతలు : బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య

సంగీత దర్శకుడు: కళ్యాణ్ నాయక్

సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాలరెడ్డి

ఎడిట‌ర్ : బొంతల నాగేశ్వర రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ప్రముఖ నటుడు రావు రమేశ్ మెయిన్ లీడ్‌లో నటించిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఈ సినిమాను లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేశారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

మారుతీ నగర్ లో ఉండే సుబ్రహ్మణ్యం (రావు రమేశ్) చిన్నతనం నుంచే గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, అది కాస్త కోర్టు కేసులో ఇరుక్కుని దూరం అవుతుంది. మొత్తానికి పెళ్లయి 25 ఏళ్ళు అయినా సుబ్రహ్మణ్యం మాత్రం ఇంకా తన లైఫ్ లో ఏదో జరుగుద్ది, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తోంది అని ఏ పని చేయడు. తన భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదన మీద పడి బతికేస్తూ ఉంటాడు. మరోవైపు సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్(అంకిత్), కాంచన(రమ్య)తో ప్రేమలో పడటం, ఈ మధ్యలో సుబ్రహ్మణ్యం అకౌంట్ లో 10 లక్షలు పడటం వంటివి జరుగుతాయి. ఇంతకీ, ఆ 10 లక్షల కథ ఏమిటి ?, సుబ్రహ్మణ్యం అకౌంట్ లోకి ఎలా పడ్డాయి ?, ఆ డబ్బులతో సుబ్రహ్మణ్యం ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కామెడీ టచ్ బాగుంది. ఓపెనింగ్ నుంచి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం, అతని కొడుకు పాత్ర మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఏళ్ళ తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు, అనుకోకుండా అకౌంట్ లో డబ్బులు పడటం.. ఈ రెండిటిని లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న కామెడీ సీన్స్.. మొత్తమ్మీద ఈ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో ఫన్ తో పాటు కొన్ని చోట్ల ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది.

ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన రావు రమేశ్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘సుబ్రమణ్యం’ పాత్రను ఆయన చాలా బాగా పండించారు. ముఖ్యంగా రావు రమేష్ డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి. ఎమోషనల్ టోన్ లో నడిచిన భార్య పాత్రలో ఇంద్రజ ఆకట్టుకుంది. అంకిత్ కొయ్య నటన చాలా బాగుంది. రమ్య పసుపులేటి అందాల ప్రదర్శన సినిమాకి ప్లస్ అయ్యింది. ఇతర కీలక పాత్రల్లో నటించిన హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్, నూకరాజు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

లక్ష్మణ్ కార్య తీసుకున్న కథాంశం, మరియు రావు రమేశ్ – అంకిత్ కొయ్య పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సిల్లీగా సాగుతుంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రతో పాటు ఆమె తల్లిదండ్రుల పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

అలాగే, ఎవరికో పడాల్సిన డబ్బులు ఇంకెవరి ఖాతాలోనో పడితే..? ఈ కోణంలో నడిచే డ్రామా కూడా ల్యాగ్ అయ్యింది. నిజానికి పాతికేళ్ళు కేవలం భార్య సంపాదన మీద ఆధారపడి బతికే సుబ్రహ్మణ్యానికి ఒక్క సారిగా లక్షలు వచ్చి పడితే.. అతని మనస్తత్వం ఎలా ఉంటుంది ?, అతని ప్రవర్తన ఎలా మారిపోతుంది ? వంటి అంశాలను ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా మలచలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. లక్ష్మణ్ కార్య దర్శకుడిగా ఆకట్టున్నా.. స్క్రీన్ ప్లే పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, కామెడీ సీన్స్ మరియు ‘రావు రమేశ్ – అంకిత్ కొయ్య’ పాత్రలు ఆకట్టుకున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సెకండాఫ్ బోరింగ్ ప్లేతో స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని చోట్ల ఎంటర్టైన్ మెంట్ తో పాటు నటీనటుల పనితీరు కూడా బాగుంది. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ – పర్వాలేదనిపించే రొటీన్ ఫన్ డ్రామా ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2236