Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2258

సమీక్ష: డిమోంటి కాలనీ 2 –ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్

$
0
0
Demonte Colony 2 Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 23, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: అరుళ్నితి, ప్రియా భవానీశంకర్, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్

దర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తు

నిర్మాతలు : విజయసుబ్రమణియన్, ఆర్‌సి రాజ్‌కుమార్

సంగీత దర్శకుడు: సామ్ సిఎస్

సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్

ఎడిట‌ర్ : కుమారేష్ డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

తమిళంలో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ పొందిన తర్వాత, హర్రర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ 2 తెలుగులోకి డబ్ అయ్యింది. ఈరోజు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రీమియర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

డెబ్బీ (ప్రియా భవానీ శంకర్) తన ప్రేమికుడు శామ్యూల్ రిచర్డ్ అలియాస్ సామ్ (సర్జానో ఖలీద్) విషాదకరమైన ఆత్మహత్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయాలని నిశ్చయించుకుంది. దావోషి (త్సెరింగ్ దోర్జీ) మార్గదర్శకత్వంతో, ఆమె సామ్ యొక్క ఆత్మను సంప్రదిస్తుంది. అతనికి మరియు విడిపోయిన కవల సోదరులు శ్రీని మరియు రఘు (అరుల్నితి) మధ్య ఆశ్చర్యకరమైన సంబంధాన్ని కనుగొనడం కోసం ఇలా ఆత్మను సంప్రదిస్తుంది. ఈ క్రమంలో డెబ్బీ కొన్ని విషయాలను తెలుసుకుంటుంది. ఆమె శపించబడిన పుస్తకం, అన్‌సంగ్ కింగ్ ఆఫ్ ఎ ఫాలెన్ కింగ్‌డమ్ మరియు ప్రతి ఆరు సంవత్సరాలకు పునరావృతమయ్యే దుర్మార్గపు శాపం ఉనికిని వెలికితీస్తుంది. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్న ఆమె ఈ శాపాన్ని ఛేదించడానికి ఒక మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది. ఈ చీకటి కథ డిమోంటి కాలనీకి ఎలా కనెక్ట్ అవుతుంది? రహస్యమైన పుస్తకం ఎక్కడ ఉంది? మరి కవల సోదరులను రక్షించడం ఎందుకు కీలకంగా మారింది? ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణంలో సమాధానాలు ఉన్నాయి, ఊహించని ట్విస్టులు ఇందులో ఉన్నాయి. అవి పూర్తిగా తెలుసుకోడానికి సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డిమోంటి కాలనీ 2: వెంజియన్స్ ఆఫ్ ది అన్‌హోలీతో డిమోంటి కాలనీ కథాంశాన్ని అద్భుతంగా అల్లుకున్నారు. రెండు చిత్రాల మధ్య కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ కనెక్షన్ మొత్తం కథనానికి మరింత డెప్త్ ను జోడిస్తుంది.

ఇటీవల రిలీజైన ఇండియన్ 2లో తన నటనకు విమర్శలను ఎదుర్కొన్న ప్రియా భవానీ శంకర్, ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి బాగా ఆకట్టుకుంది. కథను ఎలివేట్ చేసే పాత్రతో చాలా కీలకంగా మారింది.

అరుళ్నితి ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. ప్రియా నటనకు బలమైన సపోర్ట్ ను అందించారు. సినిమాకి ఇతని నటన ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

ఆద్యంతం సస్పెన్స్‌పై గట్టి పట్టును కొనసాగిస్తూ స్క్రీన్‌ప్లే చక్కగా రూపొందించబడింది. సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్టులు టర్న్ లు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. అంతేకాక ప్రేక్షకులు డిమోంటి కాలనీ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా కథ ఉంది.

మైనస్ పాయింట్స్:

సినిమా యొక్క నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కొంతమంది వీక్షకులను, ముఖ్యంగా మొదటి పార్ట్ చూడని వారిని గందరగోళానికి గురి చేస్తుంది. ఈ సంక్లిష్టత కారణంగా సినిమా పూర్తిగా అర్థం కాకపోవచ్చు.

విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నప్పటికీ, కథలో లీనమయ్యే విధంగా భయానక అనుభవాన్ని సృష్టించలేవు. ఇంకాస్త బెటర్ గా ఉండే అవకాశం ఉంది.

కొన్ని పాత్రలు, ముఖ్యంగా అరుణ్ పాండియన్ మరియు కళాశాల విద్యార్థులు సినిమాను మరింత ఎఫెక్టివ్ గా మార్చే అవకాశం ఉంది. కానీ అలా జరగలేదు. అంతేకాక సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు కథకి అడ్డంకిగా మారతాయి. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే కథ మరింత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం ఉంది.

సాంకేతిక విభాగం:

దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం బాగుంది. కథను డీల్ చేసిన విధానం, ప్రీక్వెల్‌ కి సినిమాను కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అజయ్ జ్ఞానముత్తు, వెంకీ వేణుగోపాల్ మరియు రాజవేల్ స్క్రీన్ ప్లే, సినిమా సస్పెన్స్ టోన్‌ని ఎఫెక్టివ్‌గా మెయింటైన్ చేస్తూ చక్కటి నిర్మాణాన్ని అందించింది. అయితే, వారు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలపై ఎక్కువ శ్రద్ధ వహించి ఉండవచ్చు. సెకండాఫ్ మరింత ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందించే ప్రయత్నం చేయవచ్చు.

హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే ఇంకా బెటర్ గా విజువల్ అప్పీల్‌ని పెంచవచ్చు. సామ్ సిఎస్ స్కోర్ చాలా బాగుంది. సినిమా టెన్షన్ మరియు ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేలా మ్యూజిక్ ఉంది. కుమారేష్ డి ఎడిటింగ్ చక్కగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. CGI వర్క్ ఇంకా బాగుందే అవకాశం ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా నీట్‌గా ఉండటంతో స్ట్రెయిట్ సినిమా అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

తీర్పు:

మొత్తమ్మీద డిమాంటి కాలనీ 2 సినిమా మొదటి నుండి చివరి వరకు మిమ్మల్ని కట్టిపడేసేలా ఉండే గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్. ప్రియా భవానీ శంకర్, అరుళ్నితిల ప్రదర్శనలు బాగున్నాయి. స్క్రిప్ట్ బాగుండటం, సినిమాను డైరెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే కొన్ని గందరగోళ అంశాలు, సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు మరియు విజువల్ ఎఫెక్ట్‌లు కొంచెం అనుభవాన్ని దూరం చేస్తాయి. హార్రర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఈ వారాంతం డిమోంటి కాలనీ 2 మిమ్మల్ని అలరిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

The post సమీక్ష: డిమోంటి కాలనీ 2 – ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2258

Trending Articles