విడుదల తేదీ : ఏప్రిల్ 25, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్, కార్తీక్, షాన్ జాయ్, అనఘ రవి, నంద నిశాంత్ మరియు నోయిలా ఫ్రాన్సీ
దర్శకుడు : ఖలీద్ రెహమాన్
నిర్మాతలు : ఖలీద్ రెహమాన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి
సంగీతం : విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ : జిమ్షి ఖలీద్
ఎడిటర్ : నిషాద్ యూసుఫ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో మళయాళ హిట్ చిత్రం ‘జింఖానా’ కూడా ఒకటి. ప్రేమలు హీరో నెస్లన్ నటించిన ఈ బాక్సింగ్ డ్రామా తెలుగు ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
కేరళ, అలప్పుజా ప్రాంతంకి చెందిన జోజో జాన్సన్ (నెస్లన్) మరియు తన స్నేహితులు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాక కేజ్రీగా అండ్ డిఫరెంట్ గా ఏదన్నా చెయ్యాలని డిసైడ్ అవుతారు. ఇలా బాక్సింగ్ ని ఎంచుకున్న వారు లోకల్ జింఖానాలో జాయిన్ అయ్యి ఒక మిస్టరీ గతం ఉన్న ట్రైనర్ జాషువా (లక్మన్ ఆవరన్) దగ్గర చేరుతారు. ఇక ఇక్కడ నుంచి వీరి ప్రయాణం ఎలా సాగింది? ఆకతాయితనంగా బాక్సింగ్ లోకి దిగిన వీరు ఏం చేశారు? జాషువా గతం ఏంటి? అసలు వీళ్ళు బాక్సింగ్ లో ఏం చేశారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ప్రేమలు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన యంగ్ నటుడు నెస్లన్ మరోసారి షైన్ అయ్యాడని చెప్పాలి. ఆ సినిమాకి ఈ సినిమాకి కంప్లీట్ కొత్త నెస్లన్ ని మనం సి చూడొచ్చు. తన కామిక్ టైమింగ్, కొన్ని సీన్స్ లో తన ఎక్స్ ప్రెషన్స్ మంచి ఫన్ గా అనిపిస్తాయి. అలాగే మన తెలుగు ఆడియెన్స్ కి కావాల్సిన రీతిలో సాలిడ్ డబ్బింగ్ వర్క్స్ కనిపిస్తాయని చెప్పాలి.
ట్రెండీ డైలాగ్స్ లో మంచి ఫన్ ని జెనరేట్ చేసేలా సినిమాలో కథనం కొన్ని కొన్ని చోట్ల హిలేరియస్ గా సాగుతుంది. ఫ్రాంకో ఫ్రాన్సిస్ ఆలాగే షాన్ జాయ్ ఇంకా గణపతిలు మంచి నటన కనబరిచారు. ఒకొక్కరు కూడా తమకంటూ సెపరేట్ లీగ్ లో కనిపిస్తూ ఇంప్రెస్ చేసారని చెప్పాలి. అలాగే మెయిన్ గా సెకండాఫ్ లో మూమెంట్స్ బెటర్ గా ఉన్నాయని చెప్పొచ్చు.
లీడ్ నటులు పెర్ఫార్మెన్స్ లు సహా మంచి ఎంగేజింగ్ సీన్స్ తో జింఖానా సాగుతుంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలు ఉండడంతో ఇందులో కూడా కొంచెం డిఫరెంట్ గా దర్శకుడు చేసిన యత్నం కనిపిస్తుంది. అన్ని రకాల బాక్సింగ్ డ్రామాలలా కాకుండా ఈ చిత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో అక్కడక్కడా మంచి ఫన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ ఫస్టాఫ్ కథనం మాత్రం ఒకింత స్లోగా సాగుతుంది అని చెప్పాలి. ఇక్కడ నుంచి సినిమా పికప్ అయ్యేందుకు సమయం తీసుకోవడం స్లోగా అనిపిస్తుంది.
అలాగే కథనంలో వచ్చే లవ్ ట్రాక్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి అనిపించదు. దీనిని బెటర్ గా ఏమన్నా షేప్ అవుట్ చేయాల్సింది. అలాగే ట్రైలర్, టీజర్స్ చూసి మంచి సీరియస్ స్పోర్ట్స్ డ్రామా లాంటి దాన్ని ఆశిస్తే వారికి ఈ సినిమా డిజప్పాయింట్ చేయొచ్చు..
కొంచెం డిఫరెంట్ గానే అనిపించొచ్చు కానీ ఈ స్పోర్ట్స్ డ్రామా ఒకింత సిల్లీగా కూడా అనిపించక మానదు. అలాగే సాలిడ్ ఎమోషన్స్, మంచి హై మూమెంట్స్ లాంటివి కోరుకునేవారికి కూడా ఈ చిత్రం అంత రుచించదు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. మంచి డైలాగ్స్ లో తెలుగు డబ్బింగ్ టీం సాలిడ్ వర్క్ అందించారు.
ఇక దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఒక డిఫరెంట్ లైన్ ని తీసుకొని తెరకెక్కించే ప్రయత్నం చేశారు కానీ ఇది అందరికీ సమానంగా కనెక్ట్ కాకపోవచ్చు. ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ తో కూడిన సినిమాని తాను ఆవిష్కరించారు. సో సీరియస్ స్పోర్ట్స్ చిత్రాలని మెయిన్ గా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో చూడాలి అనుకునేవారిని మాత్రం ఖలీద్ డిజప్పాయింట్ చేస్తారని చెప్పక తప్పదు. కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ వరకు చూస్తే మాత్రం వారిని తన వర్క్ మెప్పిస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘జింఖానా’ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచుయ్. లీడ్ నటులు మంచి నటన, తమ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటారు. అలాగే దర్శకుడు ఐడియా కూడా డిఫరెంట్ గా ఉంది కానీ సీరియస్ నెస్ లేకపోవడంతో అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కాన్సెప్ట్ ఎలా ఉన్నా కూడా డీసెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవారికి తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష: జింఖానా – కొన్ని చోట్ల ఆకట్టుకునే కామెడీ బాక్సింగ్ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.