Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2241

సమీక్ష : చౌర్య పాఠం –రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా !

$
0
0

Chaurya Paatam Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 25, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, సలీమ్ ఫేకు
దర్శకుడు : నిఖిల్‌ గొల్లమారి
నిర్మాత : త్రినాధరావు నక్కిన, వి. చూడమణి
సంగీతం : డావ్‌జాంద్
సినిమాటోగ్రఫీ : సతీష్ మెంటెమ్
ఎడిటర్ : ఉతురా

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఇంద్ర రామ్, పాయల్‌ రాధాకృష్ణ జంటగా రూపొందిన చిత్రం ‘చౌర్య పాఠం’. కార్తీక్‌ ఘట్టమనేని కథ అందించిన ఈ సినిమా ద్వారా నిఖిల్‌ గొల్లమారి దర్శకునిగా పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు త్రినాధరావు నకినా ఈ క్రైమ్-కామెడీ డ్రామాతో సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

వేదాంత్ రామ్ (ఇంద్ర రామ్) ఒక సినిమా డైరెక్టర్. లైఫ్ లో తను అనుకున్నది సాధించే క్రమంలో అనేక ఇబ్బందులు పడతాడు. ఆ ఇబ్బందుల నుంచి బయట పడటానికి తన ఫ్రెండ్ మరియు కెమెరామెన్ లక్ష్మణ్ తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. మరో ఇద్దర్ని బబ్లూ, జాక్ లను కూడా తన ప్లాన్ లో పార్ట్ ను చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య బాగా డబ్బు ఉన్న గ్రామంలో దొంగతనం చేయాలని ఫిక్స్ అవుతారు. ఇంతకీ, ఆ గ్రామాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు ?, ఆ గ్రామంలోని బ్యాంక్ లో పని చేసే అంజలి (పాయల్‌ రాధాకృష్ణ)తో వేదాంత్ కి ఎలా ప్రేమ కుదిరింది ?, ఈ ఇద్దరి ప్రేమ కథ ఎలా సాగింది ?, అసలు తాను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందా ? లేదా ?, ఈ మధ్యలో ఆ ఊరు సర్పంచ్ వెనుక కథ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర వేదాంత్ రామ్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన దొంగతనం ట్రాక్.. అలాగే మరోవైపు సర్పెంచ్ క్రైమ్ ట్రాక్.. ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘‘చౌర్య పాఠం’’ సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు. ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే కొన్ని సీన్స్ అండ్ ఇంటర్వల్ సీక్వెన్స్ వంటివి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర రామ్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. అలాగే, హీరోయిన్ పాత్రలో నటించిన పాయల్ రాధాకృష్ణ కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. అలాగే, మిగిలిన కీలక పాత్రల్లో కనిపించిన రాజీవ్ కనకాల, సలీమ్ ఫేకు నటన కూడా ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

‘’చౌర్య పాఠం’ సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే ట్రీట్మెంట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్ గానే సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికితోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు కనెక్ట్ కావు.
అయితే దర్శకుడు నిఖిల్‌ గొల్లమారి దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలను కూడా ఇంకా బెటర్ గా రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు.

సాంకేతిక విభాగం :

సినిమాలో దర్శకుడు నిఖిల్‌ గొల్లమారి చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు డావ్‌జాంద్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. సతీష్ మెంటెమ్ వాటిని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాతలు త్రినాధరావు నక్కిన, వి. చూడమణి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

‘చౌర్య పాఠం’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ డ్రామాలో కొన్ని ఎలిమెంట్స్ పర్వాలేదు. ముఖ్యంగా కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు క్లైమాక్స్ బాగున్నా.., కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలోని కొన్ని ఫన్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

The post సమీక్ష : చౌర్య పాఠం – రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2241

Trending Articles