విడుదల తేదీ : ఏప్రిల్ 25, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆర్తి, ప్రాచీ బన్సాల్, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శ్రీను తదితరులు
దర్శకుడు : మన్మోహన్ మేనంపల్లి
నిర్మాత : చంద్ర చాగన్ల
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ : జాన్
ఎడిటర్ : శివ సర్వాని
సంబంధిత లింక్స్ : ట్రైలర్
సంపూర్ణేష్ బాబు, సంజోష్ హీరోలుగా నటించిన లేటేస్ట్ మూవీ ‘సోదరా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్‌లతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సంపూర్ణేష్ బాబు, సంజోష్ అన్నదమ్ములు. సోడాలు అమ్ముకునే సంపూకి తన తమ్ముడు అంటే ఎంతో ఇష్టం. వారి పక్కింట్లోకి కొత్తగా వచ్చిన దివి(ఆర్తి గుప్తా)ను సంపూ ఇష్టపడతాడు. అయితే, సంజోష్ కారణంగా దివి ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే, భువి(ప్రాచీ బన్సాల్)తో సంపూ పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ, భువి సంజోష్‌ను ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని కోరుతుంది. ఇంతకీ భువికి సంజోష్‌తో ఏమిటి సంబంధం..? సంపూతో ఆమె పెళ్లి ఎందుకు వద్దని కోరుతుంది..? దివి ఏమైంది..? చివరికి ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సంపూర్ణేష్ బాబు సినిమాల్లో కథ ఎంత చిన్నగా ఉన్నా ఎంటర్‌టైనింగ్ అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అయితే, ఈ సినిమాలో కథ రొటీన్ అయినప్పటికీ దానిని క్యారీ చేసిన విధానం బాగుంది. అన్నదమ్ముల అనుబంధాన్ని మరోసారి ఈ సినిమాలో చక్కగా ప్రెజెంట్ చేశారు. వారి మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమ్ముడి పాత్రలో సంజోష్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
కాలేజ్ నేపథ్యంలో వచ్చే రొమాంటిక్ ట్రాక్ కొంతవరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. గెటప్ శ్రీను కామెడీ కూడా అక్కడక్కడ నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సాంగ్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్ సెకండాఫ్‌పై కాస్త ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఇక ప్రీ-క్లైమాక్స్ సీన్‌ను రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
అన్నదమ్ముల అనుబంధంతో తెరకెక్కిన సినిమాల్లో ఎమోషనల్ బాండింగ్ చక్కగా ప్రెజెంట్ చేయవచ్చు. కానీ, ఈ సినిమాలో ఆ బాండింగ్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. సంపూర్ణేష్ బాబు గత సినిమాల మాదిరిగా ఇందులో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఆకట్టుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్‌లో ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనిపిస్తుంది.
కాలేజీకి సంబంధించిన సీక్వెన్స్ కొంతవరకు ఓకే అనిపించినా, పెద్దగా ఇంప్రెస్ చేసే అంశాలు లేకపోవడం మైనస్. గెటప్ శ్రీను కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తాడు. చాలా సీన్స్ స్లోగా సాగడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు.
అటు సెకండాఫ్‌లోనూ స్క్రీన్ ప్లే స్లోగా సాగడం ఆకట్టుకోదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే సాంగ్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. చాలా సీన్స్ అనవసరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. ప్రీ-క్లైమాక్స్‌ను రాసుకున్న తీరు బాగున్నా, దానిని చాలా సింపుల్‌గా ముగించినట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి ఈ సినిమాకు రాసుకున్న కథ చాలా రొటీన్ అయినా, ఎంటర్‌టైనింగ్ అంశాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ల్యాగ్ సీన్స్, కొన్ని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. విజువల్స్ చక్కగా ప్రెజెంట్ చేశారు. సునీల్ కశ్యప్ అందించిన సాంగ్స్ కొంతవరకు ఓకే అనిపించినా, బీజీఎం పెద్దగా ఆకట్టుకోదు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘సోదరా’ మూవీ సంపూర్ణేష్ బాబు మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించడంలో తడబడిందని చెప్పాలి. నటీనటుల పర్ఫార్మెన్స్‌లు బాగున్నా, కథను హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకోలేకపోయింది. స్లో పేస్, బోరింగ్ స్క్రీన్ ప్లే, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. వింటేజ్ సంపూ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష : సోదరా – సిల్లీగా సాగే కామెడీ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.