Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : తుడరుమ్ –కొంతమేర ఆకట్టుకునే రివెంజ్ డ్రామా

$
0
0

Thudarum Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మోహన్ లాల్, శోభన, ప్రకాష్ వర్మ, బిను పప్పు, థామస్ మాథ్యూ, ఫర్హాన్ ఫాసిల్, మణియన్‌పిల్ల రాజు తదితరులు
దర్శకుడు : తరుణ్ మూర్తి
నిర్మాత : ఎం.రెంజిత్
సంగీతం : జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ : షాజీ కుమార్
ఎడిటర్ : నిషద్ యూసుఫ్, షఫీఖ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మలయాళ స్టార్ మోహన్ లాల్ ‘ఎల్2: ఎంపురాన్’ భారీ విజయం తర్వాత ఇప్పుడు ‘తుడరుమ్’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
మధ్య తరగతి ట్యాక్సీ డ్రైవర్ అయిన షణ్ముగం అలియాస్ బెంజ్(మోహన్ లాల్) తన బ్లాక్ అంబాసిడర్ కార్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అతను తన భార్య లలిత(శోభన), కొడుకు పవన్(థామస్ మాథ్యూ), కూతరు(అమృత వర్షిణి)లతో సంతోషంగా జీవనం సాగిస్తుంటాడు. ఓ రోజు అనుకోకుండా అతని కారు యాక్సిడెంట్‌కు గురవుతుంది. దీంతో దానిని రిపేర్ కోసం ఇవగా, మెకానిక్ ఆ కారును చట్టవిరుద్ధమైన పనులకు వాడుకుంటాడు. దీంతో అతని కారును ఎలాగైనా తిరిగిపొందేందుకు బెంజ్ ఎస్ఐ బెన్ని(బిను పప్పు)ను ఆశ్రయిస్తాడు. ఈ కేసును సీఐ జార్జ్ మాథెన్(ప్రకాష్ వర్మ) టేకప్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులతో బెంజ్‌కు ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి..? అసలు పోలీసులు బెంజ్ దగ్గర ఏదైనా దాచిపెట్టారా..? బెంజ్ అతని కారును తిరిగి పొందుతాడా..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
మోహన్ లాల్ మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. ఓ మధ్యతరగతి వ్యక్తిలా అతని పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. బెంజ్ పాత్రలో మోహన్ లాల్ ఈజ్‌గా నటించాడు.

ముఖ్యంగా సెకండాఫ్‌లో మోహన్ లాల్ పలికించే ఎమోషన్స్, ఆయన నటనతో కట్టిపడేశాడు. ఇండియన్ సినిమాలో మోహన్ లాల్ సూపర్ స్టార్‌గా ఎందుకు ఉన్నాడనేది మరోసారి తన నటనతో మనకు ఈ సినిమాలో చూపెట్టాడు.

ప్రకాష్ వర్మ పోలీస్ ఆఫీసర్‌గా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని యాక్టింగ్‌తో ప్రేక్షకులు కూడా తీవ్ర కోపానికి గురయ్యేలా చేశాడు. శోభన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి ప్రతిభను చాటింది. బిను పప్పు, థామస్ మాథ్యూ తదితరులు తమ పర్ఫార్మెన్సులతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథ ఎంతసేపు బెంజ్ అండ్ ఫ్యామిలీ చుట్టూ తిరగడంతో కథలో కొత్తదనం మిస్ అయినట్లు అనిపిస్తుంది. కథలో తర్వాత ఏం జరగబోతుందో మనం ముందే ఊహించగలం. రచయిత కెఆర్ సునీల్, దర్శకుడు తరుణ్ మూర్తి కథను మరికొంత ఊహాతీతంగా రాసుకుని ఉంటే ఆసక్తిని క్రియేట్ చేసేవారు.

ఫస్ట్ హాఫ్‌లో కథ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ, ముందుకు సాగుతూ ఉంటే ట్రాక్ తప్పినట్లుగా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత కూడా కథను ఆసక్తిగా మలిచేందుకు సమయం తీసుకున్నారు. ఇది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుందని చెప్పాలి.

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, పంచ్ డైలాగులు మిస్ కావడంతో మాస్ ఆడియెన్స్ కొంతమేర నిరాశకు గురవుతారు. ఎలివేషన్స్ ఇచ్చే హై వోల్టేజ్ సీన్స్ కూడా పడి ఉంటే ఇంకా మంచి ఫలితం దక్కేది. చాలా సీన్స్ ఇతర సినిమాలను గుర్తుచేస్తాయి. కథలోని మేజర్ ట్విస్ట్‌ని కూడా ఆడియెన్స్ ఈజీగా గెస్ చేస్తారు. ఈ చిత్ర స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు తరుణ్ మూర్తి తన దర్శకత్వ ప్రతిభను కొంతమేర విజయవంతంగా చూపెట్టాడు. కానీ, కథను కన్సిస్టెంట్‌గా ముందుకు తీసుకెళ్లడంలో తడబడ్డాడు. కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉండి ఉంటే మంచి ఫలితం దక్కేది. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. జేక్స్ బిజోయ్ సంగీతం కూడా కథను ఆసక్తికరంగా మార్చేందుకు ఉపయోగడింది. కానీ, ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌కు మంచి ఎడిటింగ్ పనితనం తోడైతే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ వర్క్ కూడా బాగుంది. అయితే, తెలుగులో మలయాళ టైటిల్‌ను పెట్టడం.. టైటిల్ కార్డ్స్‌లో తప్పులు దొర్లడం వంటివి చూస్తే, మేకర్స్ తెలుగు రిలీజ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అనిపించింది.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘తుడరుమ్’ ఓ రివెంజ్ డ్రామా చిత్రంగా మోహన్ లాల్ నటనతో ఆకట్టుకుంది. అయితే, ముందే ఊహించగల కథ, స్లో పేస్, ఎమోషనల్ ఎలివేషన్స్ సరిగా పడకపోవడం వంటి అంశాలు ఈ చిత్రానికి మైనస్. మోహన్ లాల్ అభిమానులు.. స్లో డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చవచ్చు. జనరల్ ఆడియన్స్ ఈ సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్లడం బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

The post సమీక్ష : తుడరుమ్ – కొంతమేర ఆకట్టుకునే రివెంజ్ డ్రామా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles