విడుదల తేదీ : ఏప్రిల్ 25, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్, నికితా దత్తా, కునాల్ కపూర్, కుల్‌భూషన్ ఖర్బందా, గగన్ అరోరా తదితరులు
దర్శకుడు : కూకి గులాటి, రాబీ గ్రేవాల్
నిర్మాతలు : సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్
సంగీతం : షెజాన్ షైక్, సచిన్-జిగర్
సినిమాటోగ్రఫీ : జిష్ణు భట్టాచార్జీ
ఎడిటర్ : ఆరిఫ్ షైక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘జ్యువెల్ థీఫ్’ నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
రేహాన్ రాయ్(సైఫ్ అలీ ఖాన్) అనే వజ్రాల దొంగ ఇస్తాంబుల్‌లో నివసిస్తుంటాడు. తన తండ్రి ఓ సమస్యలో ఉన్నట్లు తెలుసుకుంటాడు రేహాన్. అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్న రాజన్ ఔలఖ్(జైదీప్ అహ్లావత్) తన తండ్రి క్లినిక్‌ను కబ్జా చేసి ఉంటాడు. తన తండ్రిని కాపాడుకునేందుకు రాజన్ ఔలఖ్‌తో రేహాన్ ఓ డీల్ కుదుర్చుకుంటాడు. ‘రెడ్ సన్’ అనే ఖరీదైన వజ్రాన్ని దొంగలించి తీసుకు రావాలని రాజన్ కోరుతాడు. ఈ క్రమంలో రేహాన్ ‘రెడ్ సన్’ వజ్రాన్ని దొంగలిస్తాడా..? అతడికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి..? తన తండ్రిని రేహాన్ కాపాడుకుంటాడా..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
హియిస్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ చక్కటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. నికితా దత్తా కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో ఆమె పాత్ర కొంతవరకే ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
దొంగతనానికి సంబంధించిన సీన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఇక సినిమాలోని మిగతా నటీనటులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్ :
ఓ గ్రిప్పింగ్ హియిస్ట్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని మలచలేకపోయారు. ప్రేక్షకులను టెన్షన్ పెట్టే సీన్స్ లేకపోవడం.. సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు పెద్దగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్. ఔట్‌డేటెడ్ కథతో ఈ సినిమాలో తరువాత ఏం జరుగబోతుందో ప్రేక్షకులు ముందే ఊహించగలరు.
ఎమోషనల్‌గా ఈ సినిమా ఏమాత్రం కనెక్ట్ కాలేదు. రేహాన్ దొంగగా మారిన విధానం ప్రేక్షకులను కన్విన్స్ చేయలేదు. నికితా దత్తా పాత్ర కూడా కథకు ఏమాత్రం సంబంధం లేదు అనేలా డిజైన్ చేశారు.
జైదీప్ అహ్లావత్ విలన్‌గా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరో-విలన్ మధ్య వచ్చే డైలాగులు ఏమాత్రం ఆకట్టుకోవు. ప్రేక్షకులకు విలన్ పాత్ర నచ్చలేదని చెప్పాలి.
ఈ సినిమాలోని డైలాగులు చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఈ చిత్ర స్క్రీన్‌ప్లే లో చాలా లోపాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రేక్షకులను ఇది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
సాంకేతిక విభాగం :
దర్శకద్వయం కూకీ గులాంటి, రాబీ గ్రేవాల్ ఈ చిత్ర కథను సస్పెన్స్‌గా తీర్చిదిద్దడంలో ఫెయిల్ అయ్యారు. ఇలాంటి సాధారణ కథను బాగా ఎగ్జిక్యూట్ చేసినా ఫలితం బాగా వచ్చేది. కానీ, ఈ సినిమాను వారు డీల్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఇక జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ, ఆరిఫ్ షైక్ ఎడిటింగ్, షేజాన్ షైక్ స్కోర్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు గొప్పగా ఏమీ లేవు. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘జ్యువెల్ థీఫ్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ చిత్ర కథను ఎగ్జిక్యూట్ చేసిన తీరు మెప్పించదు. వీక్ స్టోరీ టెల్లింగ్, ఫ్లాట్ ఎగ్జిక్యూషన్, టెక్నికల్ లోపాలు, సస్పెన్స్, థ్రిల్ల్ ఏమాత్రం లేకపోవడం వంటి అంశాలు ఈ చిత్రానికి భారీ డ్యామేజ్ చేశాయి. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారు ఈ సినిమాను స్కిప్ చేసి వేరొక ఆప్షన్ చూసుకోవడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team
The post ఓటీటీ సమీక్ష : జ్యువెల్ థీఫ్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.