Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2208

సమీక్ష : రైడ్ 2 –స్లో గా సాగే క్రైమ్ థ్రిల్లర్

$
0
0

Raid 2 movie review

విడుదల తేదీ : మే 01, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అజయ్ దేవ్గన్, రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్, రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్ తదితరులు
దర్శకుడు : రాజ్ కుమార్ గుప్తా
నిర్మాతలు : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్
సంగీతం : అమిత్ త్రివేది, యో యో హనీ సింగ్, రోచక్ కోహ్లి, సచేత్-పరంపర
సినిమాటోగ్రఫీ : సుధీర్ కె చౌదరి
ఎడిటర్ : సందీప్ ఫ్రాన్సిస్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కు సీక్వెల్‌గా ‘రైడ్ 2’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా నేడు వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
అమయ్ పట్నాయక్(అజయ్ దేవ్గన్) సన్సియర్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా మరోసారి కనిపించాడు. ఇక తన కెరీర్‌లో 75వ రెయిడ్‌ను సమాజంలో మంచి పేరు, పలుకుబడి ఉన్న దాదా మనోహర్ భాయ్(రితేష్ దేశ్‌ముఖ్)పై నిర్వహిస్తాడు. అయితే, అమయ్ పట్నాయక్ రైడ్ చేసినప్పుడు దాదా భాయ్ వద్ద ఎలాంటి అక్రమ సంపాదన లభించదు. దీంతో అమయ్‌ను సస్పెండ్ చేస్తారు. మరి దాదా భాయ్ నిజంగానే అక్రమంగా సంపాదన కలిగి ఉన్నాడా..? అతడి దగ్గర్నుంచి ఆ అక్రమాస్తిని అమయ్ ఎలా పట్టుకున్నాడు..? ఈ క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
కథ రొటీన్‌గా అనిపించడంతో మొదట్నుంచి ప్రేక్షకులు ఈ సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతారు. స్లోగా సాగే స్క్రీన్ ప్లే వారి సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక ల్యాగ్ సీన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

అటు సెకండాఫ్‌లోనూ మ్యూజిక్ పై భారం పడినట్లుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే వరకు ఆకట్టుకున్నా, ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది అనిపించింది.

మ్యూజిక్ విషయంలోనూ పలువురు సంగీత దర్శకులు ఈ సినిమాకు పాటలు అందించడంతో ఏ ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. అయితే, వారందరినీ కూడా అమిత్ త్రివేది తన బీజీఎం తో దాటిపోయాడు.

మైనస్ పాయింట్స్ :
కథ రొటీన్‌గా అనిపించడంతో మొదట్నుంచి ప్రేక్షకులు ఈ సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతారు. స్లోగా సాగే స్క్రీన్ ప్లే వారి సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక ల్యాగ్ సీన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

అట సెకండాఫ్‌లోనూ మ్యూజిక్ పై భారం పడినట్లుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే వరకు ఆకట్టుకున్నా, ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది అనిపించింది.

మ్యూజిక్ విషయంలోనూ పలువురు సంగీత దర్శకుడు ఈ సినిమాకు పాటలు అందించారు. అయితే, వారందరినీ కూడా అమిత్ త్రివేది తన బీజీఎం తో దాటిపోయాడు.

సాంకేతిక విభాగం :
దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దానిని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. స్క్రీన్ ప్లే, స్లో పేస్ ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి. నటీనటులు బాగానే పర్ఫార్మ్ చేసినా, ఫస్ట్ హాఫ్‌లోని కథనం కారణంగా ఈ మూవీకి మైనస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది.

తీర్పు :
మొత్తంగా చూస్తే.. ‘రైడ్ 2’ ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా కొంతవరకు ఓకే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినా, సెకండాఫ్‌లోని కంటెంట్ ఆకట్టుకుంటుంది. అజయ్ దేవ్గన్, రితేష్ దేశ్‌ముఖ్ తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. అయితే, ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, నెరేషన్‌లో బలం లేకపోవడం, క్లైమాక్స్ పేలవంగా ఉండటం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ వీకెండ్ వేరొక ఆప్షన్ చూసుకోవడం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

The post సమీక్ష : రైడ్ 2 – స్లో గా సాగే క్రైమ్ థ్రిల్లర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2208

Trending Articles