విడుదల తేదీ : మే 01, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సూర్య, పూజా హెగ్డే, జయం రవి, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, శ్రియా శరణ్ తదితరులు
దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు : సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ
కూర్పు : షఫీక్ మొహమ్మద్ అలీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘రెట్రో’. సూర్య నుంచి కంబ్యాక్ సినిమా అవుతుంది అనిపించేలా ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఈ చిత్రం 1993 సమయంలో జరిగే కథ కాగా తన చిన్నతనంలోనే పారివేల్ కణ్ణన్ (సూర్య) తన తల్లిదండ్రుల నుంచి వేరయ్యి ఒక గ్యాంగ్ స్టర్ తిలక్ రాజ్ (జోజు జార్జ్) కి దొరుకుతాడు. అయితే అతని భార్య కోరికతో పెంచుకుంటాడు కానీ పారి అంటే ఇష్టం ఉండదు. తను దొరికిన పరిస్థితులుతో పారికి చిన్నతనం నుంచి నవ్వు అనేది ఉండదు. ఆ తర్వాత రుక్మిణి (పూజా హెగ్డే) తో జరిగిన పరిచయం ఎలా ప్రేమగా మారింది. ఈ క్రమంలో తన కోపం, నవ్వు పారి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాయి. అసలు ఈ పారి ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు? ఈ మొత్తంలో అండమాన్ లో ఒక దీవిలో ప్రజలని బానిసలుగా చేసిన దొరలు రాజ్ వేల్, తన కొడుకు మైఖేల్ (వేదు) లు చేసే అరాచకాలు ఏంటి? అక్కడికి పారి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అలాగే తిలక్ రాజ్ కోరుకుంటున్న గోల్డ్ ఫిష్ కి పారికి ఉన్న లింక్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో ఫస్టాఫ్ మంచి బలం అని చెప్పవచ్చు. మేకర్స్ అనౌన్స్ చేసిన లవ్, లాఫ్టర్ (నవ్వు), వార్ ఈ పాయింట్స్ కి తగ్గట్టుగా నడిపిన కథనం మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ క్రమంలో సూర్య నటన కూడా సాలిడ్ గా ఉందని చెప్పవచ్చు.
తన లోని నటుణ్ని మిస్ అవుతున్న వారికి చాలా కాలం తర్వాత ఈ సినిమా ఫస్టాఫ్ లో అలాగే తనలో ఉన్న లోపంని అద్దంలో చూసుకునే సీక్వెన్స్ లో సూర్య జీవించేశారు అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే తనపై పలు క్రేజీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి.
ఇంకా పూజా హెగ్డే తన రోల్ లో బానే చేసింది. వీరితో పాటుగా జోజు జార్జ్ ఇంకా జైరాం లు తమ గత సినిమాలు నుంచి కొంచెం డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు. అలాగే నెగిటివ్ రోల్ లో కనిపించిన యంగ్ నటుడు విదు తన పాత్రలో మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. అలాగే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అందుకు తగ్గ కొన్ని కనెక్షన్ లు అలాగే ఫస్టాఫ్ లో ఒక సింగిల్ టేక్ సీక్వెన్స్ మొత్తం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరోసారి సెకండాఫ్ ని ఎంగేజింగ్ గా నడపడంలో తడబడ్డారు అని చెప్పక తప్పదు. ఒక డీసెంట్ ఫస్టాఫ్ ని కొనసాగించి యుద్ధంతో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి సెకండాఫ్ కి మంచి స్కోప్ ని హోప్ ని ఇచ్చేలా సెట్ చేసి సెకండాఫ్ ని మాత్రం డల్ గా సాగదీతగా నడిపించారు.
కథ ఒకలా మొదలై అది కాస్తా ఏటెటో వెళుతుంది. వీటితో ఆడియెన్స్ ఏకాగ్రత తప్పుతుంది. సూర్యపై కొన్ని సీన్స్ బాగానే అనిపిస్తాయి కానీ అవన్నీ ఫ్లోలో కరెక్ట్ గా లేవు అనిపించక మానదు. అలాగే ప్రీ క్లైమాక్స్ సూర్యపై ట్విస్ట్ వచ్చే వరకు కథనం అంతా చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ ఆడియెన్స్ కి ఇది వరకే ఎక్కడో చూసినట్టే అనిపిస్తాయి.
అంతే కాకుండా అక్కడక్కడా సన్నివేశాలు ఈజీగా ఊహించే రేంజ్ లోనే కొనసాగుతాయి. మరో డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే క్లైమాక్స్ కూడా అని చెప్పొచ్చు. కార్తిక్ సుబ్బరాజ్ అనుకున్న పాయింట్ కి ప్లాన్ చేసుకున్న క్లైమాక్స్ అంత ఎఫెక్టీవ్ గా అయితే అనిపించలేదు. అప్పుడు వరకు అంతా స్ట్రాంగ్ గా ఉన్న విలన్లు చాలా ఈజీగా లొంగిపోయినట్టు అనిపిస్తుంది. వీటితో చాలా అంశాలు మాత్రం సెకండాఫ్ లో డిజప్పాయింట్ చేస్తాయి.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంతోష్ నారాయణన్ తన సంగీతంతో చాలా సీన్స్ కి మంచి స్కోర్ అందించి ఎలివేట్ చేసాడు. అక్కడక్కడా కాలా సినిమా స్కోర్ కూడా కొట్టేసాడు. శ్రేయస్ కృష్ణ, సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్యంకి తగ్గట్టుగా మంచి రెట్రో విజువల్స్ అందించారు. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి. తీసుకున్న జాగ్రత్తలు హర్షణీయం.
ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే తను ఎంచుకున్న లైన్ అందులో పాయింట్స్ బాగున్నాయి కానీ వాటికి అనుగుణంగా రాసుకున్న కథనం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆకట్టుకునేలా లేదు. మెయిన్ గా సెకండాఫ్ వీక్ గా సాగింది. ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో కలిపిన లింక్ ఒకే కానీ పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయగలిగే రేంజ్ లో అయితే తన వర్క్ సాగలేదు. ఫస్టాఫ్ వరకు మాత్రం తన మార్క్ కనిపించింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “రెట్రో” సినిమాలో మంచి కీ పాయింట్స్ కనిపిస్తాయి అలాగే సూర్య సాలిడ్ పెర్ఫామెన్స్ తో సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచారు కానీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా కథనం ఆసక్తిగా నడపలేదు. ఫస్టాఫ్ వరకు తన వర్క్ ఓకే కానీ సెకండాఫ్ లో మాత్రం తన కథనం ఆడియెన్స్ కి రుచించదు. సో వీటితో సూర్య అభిమానులు వరకు చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష : రెట్రో – కేవలం సూర్య ఫ్యాన్స్ వరకు మాత్రమే first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.