విడుదల తేదీ : మే 1, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణచందర్, మౌనిక బొమ్మ, సాయి లీల తదితరులు
దర్శకుడు : భాస్కర్ మౌర్య
నిర్మాతలు : వంశీ కరుమంచి, వ్రిందా ప్రసాద్
సంగీతం : కార్తీక్ రొడ్రిగేజ్
సినిమాటోగ్రఫీ : దివాకర్ మణి
ఎడిటర్ : సాయి మురళీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ముత్తయ్య’. పలు అవార్డులు అందుకున్న ఈ చిత్రం నేడు నేరుగా ఓటీటీ ప్లా్ట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
వనపర్తి ప్రాంతంలో నివసించే 70 ఏళ్ల ముత్తయ్య(సుధాకర్ రెడ్డి) ఒకప్పుడు నాటకాల్లో నటించడంతో, ఎప్పటికైనా ఓ సినిమాలో నటించాలనే కల కంటుంటాడు. అయితే, అతడికి అండగా మల్లి(అరుణ్ రాజ్) పరిచయం అవుతాడు. ముత్తయ్య కల ఎప్పటికైనా నెరవేరుతుందని అతను ప్రోత్సహిస్తూ ఉంటాడు. మరి ముత్తయ్య తన కలను నెరవేర్చుకుంటాడా..? అతడికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ముత్తయ్య సినిమాను నిజాయితీగా తీర్చిదిద్దిన తీరు ఈ సినిమాకు పెద్ద బలం అని చెప్పాలి. గ్రామీణ నేపథ్యంలో సాగే కథను మేకర్స్ తెరకెక్కించిన తీరు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. గ్రామీణ సెట్టింగ్, అక్కడి ప్రజలు, వారు చేసే పనులు ప్రేక్షకులను మెప్పిస్తాయి.
సుధాకర్ రెడ్డి మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ముత్తయ్య పాత్రలో ఆయన పరకాయప్రవేశం చేశారు. అరుణ్ రాజ్‌తో ఆయన చేసని సన్నివేశాలు న్యాచురల్‌గా అనిపిస్తాయి. వారి మధ్య బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
అరుణ్ రాజ్ కూడా తన పర్ఫార్మెన్స్‌తో కథకు బలం చేకూర్చాడు. మిగతా నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో చెప్పాలనుకున్న కోర్ పాయింట్ చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, దానికి కావాల్సిన ఎమోషనల్ డెప్త్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ముత్తయ్య కల వెనకాల అసలైన ఎమోషన్ ఏమిటనేది వివరించడంలో మేకర్స్ తడబడినట్లు కనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ కొంతమేర స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ఆకట్టుకునే అంశాలు కూడా మనకు పెద్దగా కనిపించవు. స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునే విధంగా ఉండాల్సింది. సెకండాఫ్ కొంతమేర బెటర్‌గానే ఉన్నా, స్లో పేస్ కారణంగా సినిమాపై ప్రభావం పడింది.
మల్లి పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకోదు. దీనిని మరింత ఆసక్తికరంగా రాసుకుని ఉండాల్సింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు భాస్కర్ మౌర్య ఒక ఆసక్తికర కథను వెండితెరపై ప్రెజెంట్ చేశారు. అయితే, దీని ఎగ్జిక్యూషన్ కథకు తగ్గట్టుగా లేదని చెప్పాలి. రైటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వంశీ ప్రియా సౌండ్ డిజైనింగ్ బాగుంది. కథకు ఈ సౌండ్ డిజైనింగ్ చాలా ప్లస్ అయ్యింది.
కార్తీక్ రొడ్రిగేజ్ సంగీతం సినిమాకు బలాన్ని అందించింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. గ్రామీణ నేపథ్యంలోని విజువల్స్ ఆకట్టకుంటాయి. సాయి మురళి ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘ముత్తయ్య’ ఒక సిన్సియర్ అటెంప్ట్ అని చెప్పాలి. కానీ, స్లో పేస్ ఈ చిత్రాన్ని మిస్‌ఫైర్ చేసింది. ఓ పెద్దాయన నటుడు కావాలనే కల కనడటం బాగానే ఉన్నా, దానికి కావాల్సిన ఎమోషనల్ డెప్త్ మనకు ఇందులో కనిపించదు. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్‌లు తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు. స్లోగా సాగే ఫీల్ గుడ్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చవచ్చు. అయితే, మిగతావారిని ఈ సినిమా పెద్దగా మెప్పించకపోవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
The post ఓటీటీ సమీక్ష : ముత్తయ్య – ఈటీవీ విన్‌లో తెలుగు చిత్రం first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.